Lance Naik
-
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్‌సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్‌లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని యోల్ కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్‌ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్‌సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
న్యూస్ మేకర్: గగనాన్ని జయించింది
‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ (పారాచూటింగ్) చేసిన లాన్స్‌నాయక్ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది. ఆర్మీలో మిలటరీ పోలీస్ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్ వింగ్ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్.హెచ్.ధ్రువ్’ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్ రెజిమెంట్ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్ వ్యక్తులు పారాచూటింగ్ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్ థామస్ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్ పోల్‌లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్ నేర్చుకుని జంప్ చేస్తున్నారు. మహిళల ముందంజ ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్ అభిలాష బరాక్ ఆర్మీ ఏవియేషన్‌లో మొదటి మహిళా ఆఫీసర్‌గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మాయ సుదన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా బాధ్యత పొందింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్‌గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది. గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్ హోస్టెస్‌గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే. ఆర్మీకి చెందిన లాన్స్‌నాయక్ మంజు స్కై డైవింగ్ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది. -
Lance Naik Sai Teja Final Rites : సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు ఫొటోలు
-
‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు
సిమ్లా: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్లో 13 మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతోపాటు 11 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. అతని తమ్ముడు సుమిత్ కుమార్ చితికి నిప్పంటించాడు. ఈ కార్యక్రమంలో వివేక్ కుమా ర్‌భార్య ప్రియాంక పెళ్లి నాటి చీరను కట్టుకొని తన భర్తకు తుది వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వద్ద ‘మేరా ఫౌజీ అమర్ రహే’ అంటూ మూడు సార్లు నినాదం చేసింది. అందరి ముందే కన్నీళ్లతో భర్తకు వీడ్కోలు పలకడం పలువురిని కలచివేసింది. చదవండి: ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం అనంతరం వివేక్‌కుమార్ భార్య ప్రియాంక మాట్లాడుతూ.. తన భర్తను చూసి చాలా గర్వపడుతున్నానని తెలిపింది. తమ ఆరునెలల బిడ్డ భవిష్కత్తు కోసం వివేక్ ఎన్నో కలలు కన్నాడని. ఆ కోరికలన్నీ నెరవేరుస్తాను ధీమా వ్యక్తం చేసింది. అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని వివేక్ తల్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇక అంతకముందు ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ గగ్గల్ విమానాశ్రయంలో మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించినట్లు ఠాకూర్ తెలిపారు. చదవండి: విషాదం: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి -
‘లవ్యూ డాడీ’ అంటూ.. సాయితేజ ఫోటోను ముద్దాడిన కొడుకు
చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సైనికుడు లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహానికి ఎగువరేగడిలో సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకూ దాదాపు 30 కిలోమీటర్ల అంతిమయాత్ర కొనసాగింది. ఎగువరేగడకు చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని చూడగానే ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపించారు. ఆయన కొడుకు తండ్రి ఫోటోకు ‘లవ్ యూ డాడీ.. లవ్ యూ డాడీ..’ అంటూ బాధగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం కదిలించింది. -
సెలవిక.. సైనికా!
బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్‌బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాల నడుమ.. సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్‌బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు. జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్‌బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు. శ్యామలకు జాతీయ పతాకం అందజేత సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఊరే అతడింటికి కదిలొచ్చింది
మదనపల్లె: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆ గ్రామమంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఊరికి ఊరే అతడి ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన లాన్స్‌నాయక్ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరిని ఆ ఊరంతా ఓదారుస్తోంది. తమ ఊరి ముద్దుబిడ్డ ఇక లేడంటే ఇప్పటికీ గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల, తాత మోహన్, నాయనమ్మ భువనేశ్వరి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియని చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని వారందరి ముఖాల్లోకి దీనంగా చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. సాయితేజ మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా ఆర్మీ ప్రత్యేక బృందం అతడి తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లింది. వీరి డీఎన్ఏల ఆధారంగా లాన్స్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి.. శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు సాయితేజ మరణవార్త అధికారికంగా ధ్రువీకరించాక ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మదనపల్లె నుంచి ఎగువరేగడ వారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ ఎగువరేగడకు వెళ్లి అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. వీరజవాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, ప్రజలు హాజరవుతారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న మరణవార్త తెలిసిన వెంటనే సాయితేజ సోదరుడు మహేష్ (బీఎస్ఎఫ్ జవాన్) సిక్కిం నుంచి గురువారం సాయంత్రం స్వగ్రామం చేరుకున్నాడు. తల్లి, తండ్రి, వదినను ఎలా ఓదార్చాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తన సోదరుడి స్ఫూర్తితోనే దేశ సేవలో చేరానన్నాడు. ‘నన్ను రమ్మని చెప్పి నువ్వెళ్లిపోయావా’ తన బిడ్డ సాయితేజకు ఎప్పుడు ఫోన్ చేసినా ‘మదనపల్లెకు వచ్చేయమ్మా. నా భార్యాబిడ్డలకు తోడుగా ఉండు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అనే వాడని తల్లి భువనేశ్వరి వాపోయింది. ‘వ్యవసాయ పనులు పూర్తయ్యాక వస్తాలే బిడ్డా్డ అంటే.. కూలీలు చూసుకుంటార్లేమ్మా. నీవు వచ్చేయని ప్రాధేయపడేవాడు. ఇప్పుడు నా బిడ్డ లేడు. నన్నెవరు చూసుకుంటారు తండ్రీ’ అని రోదిస్తోంది. ‘అందరూ వద్దంటే నేనే పంపిస్తిని’ ‘ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా నేనే పంపిస్తినే. ఆడు వెళతానని పట్టుపడితే బిడ్డ కోరిక కాదనక పోతినే. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకు దిక్కెవరు రామా. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా. మోసం చేసి వెళ్లిపోతివే సామీ. నాకు దిక్కెవరు రామా..’ అంటూ తండ్రి మోహన్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి అశొక్చక్ర
-
అహ్మద్ వనీకి ‘అశోక చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్‌నాయక్ నజీర్ అహ్మద్ వనీ(38)కి కేంద్రం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018, నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు. ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 2004లో వనీ ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్ 162 ఇన్ఫాంట్రీ బెటాలియన్’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు. కుల్గామ్ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీకి భార్య మహజబీన్తో పాటు కుమారులు అథర్, షహీద్ ఉన్నారు. ఆయనకు డ్యూటీనే అత్యుత్తమం నజీర్ వనీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించేవారని ఆయన భార్య, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహజబీన్ తెలిపారు. వనీ ధైర్యవంతుడైన సైనికుడనీ, తన రాష్ట్రంలో శాంతి కోసం పరితపించేవాడని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితాంతం వనీ పలు ప్రమాదాలను ఎదుర్కొన్నాడనీ, చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడని జవాన్లు అన్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్ జవాన్ వీర మరణం
శ్రీనగర్: నిత్యం దేశం కోసం పరితపించే లాన్స్ నాయక్ సందీప్ సింగ్ సోమవారం వీర మరణం పొందారు. 2016లో పీవోకేలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో సందీప్ సింగ్ చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం జుమ్మూ కశ్మీర్‌లోని టాంగ్దార్ సెక్టార్లో భారత దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ తన చివరి శ్వాస ఉన్నంత వరకు దేశం కోసం పోరాడుతూనే ఉన్నారు. శనివారం టాంగ్దార్ సెక్టార్లో ఉగ్ర కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వారిని నివారించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగా ఆది, సోమ వారాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఆపరేషన్‌లో సందీప్ ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ప్రయత్నంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతని శరీరంలోకి బులెట్లు దూసుకెళ్లాయి. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. కాగా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన సందీప్‌కు భార్య, ఐదేళ్ల బాబు ఉన్నారు. -
లాన్స్‌నాయక్ హనుమంతప్పకు సేనా మెడల్
న్యూఢిల్లీ: దుర్భరమైన హిమాలయాల్లో 30 అడుగుల లోతులో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచు పెళ్లల కింద ఆరురోజులపాటు మృత్యువుతో పోరాడి అనంతరం ఆస్పత్రిలో మరణించిన వీరసైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్‌ను సైన్యం సేనా పతకంతో సత్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో గత ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా ఒక్క హనుమంతప్పను మాత్రం ఆరు రోజుల తర్వాత సహాయక దళాలు ప్రాణాలతో బయటికి తీశాయి. అనంతరం అతన్ని సైనిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. ఆర్మీడే సందర్భంగా ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హనునమంతప్ప భార్య మహాదేవి అశోక్ బిలేబల్‌కు ఈ అవార్డు అందజేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు. -
అన్నమయ్య పదశోభ
హరినామమే కడు ఆనందకరము.. అని అన్నమయ్య తిరువీధుల వెలసిన ఆ దేవదేవుడ్ని కీర్తించాడు. ఆ వాగ్గేయకారుడి సంకీర్తనలను తన అమృతగానంతో ఆలపిస్తూ తన పరబ్రహ్మం ఆ శ్రీహరి ఒక్కడేనని చాటుతున్నారు శోభారాజు. ‘కట్టెదుర ఉన్న వైకుంఠం’ వదిలి భాగ్యనగరానికి చేరుకున్న ఆమె అన్నమయ్య భావన వాహిని ద్వారా మూడు దశాబ్దాలుగా తన రాగతరంగాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. మనుషుల మనసులను ఆవహించిన భావ కాలుష్యాన్ని నివారించే శక్తి సంకీర్తనలకు ఉందని చెబుతున్నారు. ఇది కాక సౌభాగ్యం ఇది కాక తపము మరి ఇది కాక వైభోగము ఇంకొకటి కలదే అంటూ కోనేటిరాయుడ్ని నిరంతరం కీర్తిస్తున్న శోభారాజు తన అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించారు. - హనుమా ‘జో అచ్యుతానంద... జోజో ముకుందా...’ అంటూ అమ్మ పాడుతూ ఉంటే... అలా నాకు తెలియకుండానే అన్నమయ్య పాటలు నన్ను ఆకట్టుకున్నాయి. అవి అన్నమాచార్య కీర్తనలని అప్పుడు నాకు తెలియదు. టెన్త్ పాసైన తరువాత ఇంటర్లో చేరడానికి తిరుపతి వెళ్లా. ఏటా అక్కడ జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో పాడుతుండేదాన్ని. వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంటర్ వర్సిటీ కాంపిటీషన్లో అన్నమయ్య కీర్తనలు పాడి మొదటి బహుమతి గెలుచుకున్నా. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు వచ్చేవారు. తన కచేరీలో రెండు పాటలు పాడించారు. ఆ తరువాత ఆయన మద్రాసు నుంచి ఉత్తరం రాశారు... ‘నీ కోసం రెండు స్వరాలు చేశా పాడతావా అంటూ..! సినిమా ఫీల్డు, పైగా మద్రాసు వెళ్లడమంటే ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అన్నయ్యకు నచ్చజెబితే సరే అన్నారు. 1972లో ‘నారాయణతే నమో నమో.., అదె చూడు తిరువెంకటాద్రి కొండా..’ కీర్తనలు పాడా. అదే నా తొలి అల్బమ్. అలా అనుకోకుండా అన్నమయ్య తన వైపు లాక్కొని వెళ్లాడు. ఆ తరువాత టీటీడీ వారు అన్నమాచర్య కీర్తనల ప్రచారం, సాహిత్యంపై అధ్యయనానికి స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించారు. అన్నమయ్య తత్వం అప్పుడర్థమైంది. ఆయనకు స్వామి, మానవాళిపై ఉన్న ప్రేమ తెలిసింది. క్రమంగా ఆయన వ్యక్తిత్వంపై గౌరవం, ఆరాధన పెరిగాయి. ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో... టీటీడీ నుంచి ‘అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఆస్థాన గాయకురాలిగా’ నియమిస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడే స్వామికి మాటిచ్చా... ‘జీవితాంతం నీకు స్వర కైంకర్యం చేస్తా’నని. భావనా వాహిని... కొన్ని కారణాలతో తిరుపతి వదిలి హైదరాబాద్‌కు (1982) రావాల్సి వచ్చింది. 1983 నవంబర్ 30న నా పుట్టిన రోజున ‘అన్నమయ్య భావనా వాహిని’ స్థాపించా. నా పుట్టిన రోజు సందర్భంగా నాన్న రూ.1116లు బహుమతిగా ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో దీన్ని ప్రారంభించా. నేటికి (ఆదివారం) ఇది నెలకొల్పి 31 ఏళ్లవుతుంది. స్వామికి మాటిచ్చాను గనుక... కారణాంతరాల వల్ల తిరుమల వదిలి వచ్చినా... ఆ మహా యజ్ఞాన్ని మధ్యలో ఆపకూడదని దీని ద్వారా కీర్తనల ప్రచారం చేస్తున్నా. అన్నమయ్య కీర్తనల్లో ఓ దివ్యత్వం, ఓ వెలుగు. చాలామంది అంటుంటారు... నా పాట వింటుంటే అల్లకల్లోలంగా ఉన్న మనసు ప్రశాంతంగా మారుతుందని. రామకృష్ణమఠంలో పాడినప్పుడు కూడా కొందరు చెప్పేవారు... నా క్యాసెట్స్ పెట్టుకుని ధ్యానం చేస్తామని. ఆ మధ్య ఓ అమ్మాయి నాకు ఉత్తరం రాసింది. అత్తింటి పోరు పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. చివరగా దైవ ధ్యానం చేయాలనిపించి... నా ఆల్బమ్ పెట్టుకుని వింటుంటే తనలో ఆ ఆలోచన పోయిందట. నా జీవితాన్ని ఇలా భక్తి సంగీతం వింటూ గడపలేనా అనిపించిందంటూ ఆమె రాసింది. గమనించాల్సిందేమిటంటే... అన్నమయ్య గీతాలకు మానసిక ప్రక్షాళన చేసే శక్తి ఉందని. మా భావనా వాహిని లక్ష్యం కూడా అదే... ‘భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ’. నేటితరం... కీర్తనం... ఇప్పటివరకు భావన వాహిని ద్వారా పదహారు వేల మందికి కీర్తనలు నేర్పా. వారిలో చాలా మంది ఏదో రకంగా కొనసాగిస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో నేర్చుకుని, ప్రస్తుతం రాణిస్తున్నవారెందరో. సాందీప్, రాధిక, గోపికాపూర్ణిమ, గీతామాధురి, హేమచంద్ర, కారుణ్య వంటి ఎందరో వర్ధమాన గాయకులు ఇక్కడి నుంచి షైన్ అయినవారే. ఇక్కడికి వచ్చేవారికి కీర్తనలే కాదు.. ఆధ్యాత్మిక చింతన, మానవీయ విలువల గురించీ చెబుతా. ఉపశమన సంకీర్తనం... వైఫల్యంతోనో, మరేదైనా బాధతోనో, ఒత్తిడితోనో మానసికంగా కుంగిపోయేవారికి సంకీర్తనల ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం కల్పించే ఆలోచనే ‘ఉపశమన సంకీర్తనం’. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి వద్దకు స్వయంగా వెళ్లి, నా ఖర్చులతోనే సంకీర్తనలు చేసి, వాళ్లలో మానసిక పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇటీవల ఓ 75 ఏళ్ల వృద్ధుడు చాలా కాలంగా మంచంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన కుమార్తె నాకు ఫోన్ చేసింది. నేను వెళ్లి కీర్తనలు పాడితే... అప్పటి వరకు కోమాలో ఉన్న ఆయనలో కదలిక వచ్చింది. ఆ తరువాత ఆయన చనిపోయినట్టు ఆమె చెప్పింది. చివరి దశలో ప్రశాంతంగా కన్ను మూసినందుకు నాకు ధన్యవాదాలు తెలిపింది. ఇలానే ‘నాద చికిత్స’. ప్రత్యేకంగా ఆ అంశాన్నే కేంద్రీకృతం చేసి, ఓ కార్యక్రమాన్ని రూపొందించా. నిమ్స్ (2000)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే... చాలామంది పేషెంట్లు తమకు దీనివల్ల ఎంతో ఆనందం కలిగిందన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ‘నగర సంకీర్తన’ చేస్తున్నాం. మా విద్యార్థులు, కళాకారులు, కళాభిమానులు కలసి చేసే మహత్తర కార్యమిది. దీని పరమార్థం... భావ కాలుష్యాన్ని తుడిచేయడం. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అన్ని మతాల వారితో శాంతి సంకీర్తనలు చేశాం. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య, లాన్స్ నాయక్ రామచంద్రుడుల ఆత్మకు శాంతి కలగాలని కీర్తనలు పాడి, వారి కుటుంబాలను సన్మానించిన తొలి సాంస్కృతిక సంస్థ మాది. సంస్థకు ఫండింగ్ అంటే... పాటల ద్వారా నాకు వచ్చే పారితోషికం తొంభై శాతం. మిగిలింది కళాభిమానులు ఇచ్చింది. టీటీడీ వంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ముందుకు వస్తే... దీన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. ప్రపంచాన్ని ‘స్వరధామం’గా మార్చవచ్చు.