సిమ్లా: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌లో 13 మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతోపాటు 11 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నారు.
కాగా ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. అతని తమ్ముడు సుమిత్ కుమార్ చితికి నిప్పంటించాడు. ఈ కార్యక్రమంలో వివేక్ కుమా ర్‌భార్య ప్రియాంక పెళ్లి నాటి చీరను కట్టుకొని తన భర్తకు తుది వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వద్ద ‘మేరా ఫౌజీ అమర్ రహే’ అంటూ మూడు సార్లు నినాదం చేసింది. అందరి ముందే కన్నీళ్లతో భర్తకు వీడ్కోలు పలకడం పలువురిని కలచివేసింది.
చదవండి: ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
అనంతరం వివేక్‌కుమార్ భార్య ప్రియాంక మాట్లాడుతూ.. తన భర్తను చూసి చాలా గర్వపడుతున్నానని తెలిపింది. తమ ఆరునెలల బిడ్డ భవిష్కత్తు కోసం వివేక్ ఎన్నో కలలు కన్నాడని. ఆ కోరికలన్నీ నెరవేరుస్తాను ధీమా వ్యక్తం చేసింది. అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని వివేక్ తల్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇక అంతకముందు ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ గగ్గల్ విమానాశ్రయంలో మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించినట్లు ఠాకూర్ తెలిపారు.
చదవండి: విషాదం: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి
Comments
Please login to add a commentAdd a comment