Wedding Dress
-
వైజాగ్ సృజన ఉదంతం మరవకముందే మహబూబ్‌నగర్‌లో లక్ష్మి!
సాక్షి, మహబూబ్‌నగర్: వైజాగ్ మదురవాడ నవవధువు సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ నవ వధువు వివాహం జరిగిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించిన నవవధువు లక్ష్మి.. ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు.. బాత్రూమ్లోకి వెళ్లి పేను విరుగుడుకు వేసే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఎంతకీ బాత్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. లక్ష్మి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి -
‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు
సిమ్లా: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్లో 13 మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతోపాటు 11 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. అతని తమ్ముడు సుమిత్ కుమార్ చితికి నిప్పంటించాడు. ఈ కార్యక్రమంలో వివేక్ కుమా ర్‌భార్య ప్రియాంక పెళ్లి నాటి చీరను కట్టుకొని తన భర్తకు తుది వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వద్ద ‘మేరా ఫౌజీ అమర్ రహే’ అంటూ మూడు సార్లు నినాదం చేసింది. అందరి ముందే కన్నీళ్లతో భర్తకు వీడ్కోలు పలకడం పలువురిని కలచివేసింది. చదవండి: ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం అనంతరం వివేక్‌కుమార్ భార్య ప్రియాంక మాట్లాడుతూ.. తన భర్తను చూసి చాలా గర్వపడుతున్నానని తెలిపింది. తమ ఆరునెలల బిడ్డ భవిష్కత్తు కోసం వివేక్ ఎన్నో కలలు కన్నాడని. ఆ కోరికలన్నీ నెరవేరుస్తాను ధీమా వ్యక్తం చేసింది. అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని వివేక్ తల్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇక అంతకముందు ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ గగ్గల్ విమానాశ్రయంలో మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించినట్లు ఠాకూర్ తెలిపారు. చదవండి: విషాదం: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి -
భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు
పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశిస్తారు. తమతో జీవితాంతం కలిసి జీవించే వారికి కొత్తగా, అందంగా కనిపించాలనుకుంటారు. అచ్చం ఇలాగే వధువు తన వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు వేదిక వద్దకు వయ్యారంగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన వరుడు మంత్రుముగ్ధుడయ్యాడు. వధవును చూడటానికి తనకు రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెను చూసిన ఆ వరుడి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. పుత్తడిబొమ్మలా తనవైపు నడిచొస్తున్న వధువుని చూసి ఫిదా అయిన వరుడు భావోద్వేగానికి లోనై సంతోషంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ వైర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. చదవండి: అఫ్గాన్ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు! ‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: తాలిబన్ల ఆధీనంలో అప్గన్ పార్లమెంట్, వీడియో వైరల్ View this post on Instagram A post shared by WeddingWire India (@weddingwireindia) -
అందమైన డ్రెస్‌లో అనా అరోరా పుషప్స్
-
పెళ్లికూతురి పుషప్స్ మామూలుగా లేవుగా
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి పలువురు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ ఫిట్నెస్ ఔత్సాహికురాలు వ్యాయామం ప్రాధాన్యం వివరిస్తూనే ఓ వైరల్ వీడియోను తీసి తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేశారు. ఆమె చేసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతలా ఆకట్టుకోవడానికి కారణమేమిటంటే.. పెళ్లి డ్రెస్‌లో ఆమె పుషప్స్ చేసింది. అనా అరోరా ఫిట్నెస్ వీడియోలు చేస్తూ వ్యాయామ ప్రాధాన్యం వివరిస్తుంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఎరుపు రంగు లెహంగా చోలీలో అనా మెరిసింది. ఆమె వివాహం జూలైలో జరిగింది. ఈ పెళ్లి డ్రెస్‌లోనే ఆమె పుషప్స్ చేసి అందరినీ అబ్బురపరిచింది. అందమైన డ్రెస్‌లో అనా పుషప్స్ చేస్తున్న అప్పటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె పుషప్స్ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 81 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోతో పాటు మరో వీడియో, కొన్ని ఫొటోలు పంచుకున్నారు. -
వామ్మో.. ఇదేం డ్రెస్ తల్లి..!
నికోసియా: వివాహ వేడుకలు కొత్త పోకడలు పోతున్నాయి. పంచ భూతాల సాక్ష్యిగా అన్నట్లు గాలి, నింగి, నీరు, ఆకాశం ఇలా రకరకాల వేదికల మీద పెళ్లిల్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వేలం వెర్రి వేషాలు వేసేవారు బాగా పెరిగారు ఈ మధ్య కాలంలో. ఇక పెళ్లి బట్టల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్థాయికి తగ్గట్లు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఇంత ఖరీదు పెట్టి కొన్న దుస్తులను మళ్లీ వాడతారా అంటే చాలా వరకు లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ మహిళ తన పెళ్లి డ్రెస్‌తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వెయిల్(పాశ్యాత్య వివాహ వేడుకలో పెళ్లి కుమార్తె తల మీద ధరించే వస్త్రాన్ని వెయిల్ అంటారు) ధరించిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ఇది ఎంత పొడవు ఉందంటే..6962.6 మీటర్లు. అంటే ఒకటీ కాదు రెండూ కాదు ఏకంగా 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం అన్నమాట. మరి అంత పొడువున్న ఆ వస్త్రాన్ని ఆమె ఎలా ధరించింది అంటే.. రికార్డు కోసం ఆ మాత్రం చేయక తప్పదు కదా అంటుంది. సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవా తన వెడ్డింగ్ డ్రెస్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మరియా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నా కల ఒక్కటే. నా వివాహంలో ప్రపంచంలోనే అతి పెద్ద వెయిల్ ధరించి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలనేది నా కోరిక. ఈ రోజు అది నిజమయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది. ఈ వెయిల్ డిజైన్ చేయడం కోసి మరియా 7,100 మీటర్ల క్లాత్ కొనుగోలు చేసింది. గ్రీస్‌కు చెందిన ఓ కంపెనీ దాదాపు మూడు నెలల పాటు కష్టపడి దీన్ని డిజైన్ చేసింది. నిపుణులైన టైలర్లు స్వయంగా చేతులతో ఈ ముక్కలను కలిపి పూర్తి అతిపెద్ద వెయిల్‌ను రూపొందించారు. వివాహం జరిగిన స్టేడియం మొత్తాన్ని ఈ వెయిల్ కప్పేసింది. ఆ వస్త్రాన్ని మైదానంలో అమర్చడానికి 30 మంది వలంటీర్లు 6 గంటల పాటు కష్టపడ్డారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు అన్ని సుఖసంతోషాలతో ఆమె వైవాహిక జీవితం ఇంతే సుదీర్ఘగంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి కొందరేమో ఆ వెయిల్ని కాస్త పైకి లేపితే టెంట్లా మారుతుంది. ఎంచక్క ఎండ కొట్టకుండా ఉంటుంది అంటూ జోక్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) చదవండి: హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా.. -
ఈ నెలలో ఇదే పెద్ద జోక్!
కొన్ని కొన్ని సార్లు డిగ్రీలు, పీజీల కంటే కామన్ సెన్స్ ఎంత అవసరమో ఈ స్టోరీని చదివితే తెలుస్తుంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత తెలివితక్కువగా వ్యవహరిస్తారో అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే.. డ్యూయెక్స్ ఓబ్రే అనే యువతికి నెల రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. పేరు మోసిన కంపెనీలో ఆర్డర్ చేసి పెళ్లి కోసం మంచి డ్రెస్ కూడా కుట్టించుకుంది. ఆ డ్రెస్ ఇంటికి రాగానే ఓ ట్రైల్ చూద్దామని దాన్ని వేసుకుంది. అయితే తాను ఆర్డర్ చేసిన విధంగా కాకుండా చిందరవందరగా అనిపించిందది. దీంతో ఓబ్రేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సదరు కంపెనీకి డ్రెస్ సరిగా లేదంటూ గరంగరంగా మెయిల్ పెట్టింది. ( అరుదైన రికార్డు: భారీ మార్కర్ పెన్ను ) ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పంపింది. దీనిపై సదరు కంపెనీనుంచి వచ్చిన సమాధానం చదివి ఓబ్రే సిగ్గుతో తలదించుకుంది. మరీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానా అనుకుంది. ఆ కంపెనీ ఏం సమాధానం పంపిందంటే ‘‘మీరు డ్రెస్‌ను తిరగేసుకున్నారు. సరైన విధంగా వేసుకుని చూడండి’’ అని. దీని గురించి ఓబ్రే తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. దీంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘నువ్వు డ్రెస్ ఎలా వేసుకున్నా అందంగానే ఉన్నావు... అయ్యో! నవ్వలేక చచ్చిపోతున్నా... మమ్మల్ని కడుపుబ్బా నవ్వించినందుకు ధన్యవాదాలు... ఈ నెలలో ఇదే పెద్ద జోక్!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ( వైరల్ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?! ) -
డిజైనర్ బామ్మ
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘ఎనిమిది పదులు దాటిన బామ్మ చేతుల్లో రూపుదిద్దుకునే పెళ్లి డ్రెస్ ఎంత అందంగా ఉంటుందో.. అది తనను ఎంతగా ముస్తాబు చేస్తుందో..’ అని అక్కడ కాబోయే ప్రతి వధువూ అంతే అందంగా కల కంటుంది. వారి కలలను నిజం చేస్తూ 58 ఏళ్లుగా అబోక్ రాధే అందమైన పెళ్లి డ్రెస్‌లను రూపొందిస్తూనే ఉంది. ఆ డ్రెస్ డిజైన్ చూపు తిప్పుకోనివ్వదు. వెల్వెట్ లాంగ్ బ్లౌజ్, నడుము చుట్టూ కట్టిన సన్నని మస్లిన్ క్లాత్, మల్టీకలర్ సొగసుతో ఉండే స్కర్ట్స్, దండలు, నెమలీకలతో అలంకరించిన కిరీటం చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తాయి. ఇది మణిపూర్‌లోని సంప్రదాయ పెళ్లికూతురు ధరించే వెడ్డింగ్ డ్రెస్. ‘పొట్లోయి సెట్పి’ అని పిలిచే ఈ వెడ్డింగ్ డ్రెస్సులను ఓ 88 ఏళ్ల బామ్మ 58 ఏళ్లుగా సృష్టిస్తోంది. ఆమెను స్థానికులు అబోక్ రా«ధే అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. ‘అబోక్’ అంటే మీటీ భాషలో ‘బామ్మ’ అని అర్ధం. ఈ వయసులోనూ అత్యంత శ్రద్ధగా అందమైన డిజైన్లను సృష్టిస్తూ, మహిళలకు శిక్షణ ఇస్తూ, వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నేటి తరానికి స్ఫూర్తి. మణిపూర్ సంప్రదాయ గ్రాండ్ పొట్లోయి కళను సజీవంగా ఉంచుతోంది. సాయం కోసం వెళ్లి శిక్షణ ‘వధువు కోసం పొట్లోయిని డిజైన్ చేసిన ప్రతిసారీ టెన్షన్ పడుతుంటాను. పెళ్లికూతురు ఈ డ్రెస్‌ను ఇష్టపడుతుందా, ఆమెకు ఈ డ్రెస్ సంతోషాన్ని ఇస్తుందా.. అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. వేడుకలో వధువు నడుస్తుంటే ఆమె ధరించిన డ్రెస్సు గురించి గొప్పగా చెప్పుకోవడం, ఎవరు తయారు చేశారని వారు అడిగినప్పుడు, నా గురించి నాకు గర్వంగా అనిపిస్తుంది’ అని చెబుతుంది ఈ బామ్మ. ఇన్నేళ్ల వయసులోనూ వారం రోజుల్లో పెళ్లికూతురు డ్రెస్ డిజైన్ చేయగలదు రాధే. దీనికితోడు ప్రసిద్ధ మణిపురి పౌరాణిక ఖంబాతోయిబి నృత్యానికి కూడా దుస్తులను తయారుచేసి ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ లేనప్పుడు బట్టలు, స్ట్రాలను ఉపయోగించి బొమ్మలను తయారు చేసి, స్థానిక షాపులకు అమ్ముతుంది. ‘నాకు 15 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఏడుగురు పిల్లలకు తల్లిని. మొదట్లో గృహిణిగానే ఉన్నాను. నా భర్త మణిశర్మ జ్యోతిష్యం చెప్పేవాడు, ఆలయ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పాతికేళ్ల వయస్సులో ఉన్నప్పుడు అనుకోకుండా ఓసారి మా పక్కింటి ఆమెకు పొట్లోయి తయారీలో సాయం చేశా. అప్పుడే పెళ్లి డ్రెస్సులను రూపొందించడంపై ఆసక్తి ఏర్పడి, అందులో వివిధ ప్రక్రియలను నేర్చుకున్నాను. ఆ సమయంలో ఏడేళ్ల నా కూతురు రాస్లీలా నాటకంలో పాల్గొంటోంది. తనది గోపిక వేషం. ఆమె కోసం మొదటిసారి ఒక డ్రెస్ డిజైన్ చేశాను. అలా 30 ఏళ్ళ వయసు నుంచి పొట్లోయిని తయారు చేస్తూనే ఉన్నాను’ అని అబోక్ రాధే తనకీ కళ వంటపట్టిన విధానాన్ని గుర్తు చేసుకుంటుంది. తొమ్మిది పొరల వస్త్రంతో పొట్లోయి స్కర్ట్ పొట్లోయి చరిత్ర పరిశీలిస్తే దాని మూలాలు రాస్ లీలాలో ఉన్నాయి. 18వ శతాబ్దంలో శ్రీకృష్ణుడు గోపికల నృత్యంలో భాగంగా ధరించే డ్రెస్‌గా ఇది పరిచయం అయ్యింది. కాలక్రమేణ వివాహ వేడుకలలో పెళ్లి కూతురు డ్రెస్‌గా ఇది ప్రాచుర్యం పొందింది. ‘ఇప్పుడు లంగాకు గట్టి ఆకారం ఇవ్వడానికి డిజైనర్లు సన్నని రబ్బరు షీట్‌ను ఉపయోగిస్తున్నారు. గతంలో ఇది అందుబాటులో లేదు. స్కర్ట్ లోపలిభాగంలో తొమ్మిది పొరల వస్త్రాన్ని దళసరిగా వచ్చేలా కుడతాను. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే, స్కర్ట్ గట్టిగా ఉండటానికి, దానిని బియ్యం పిండిలో ముంచి ఎండలో ఆరబెట్టాలి. తగినంత ఎండ లేకపోతే డిజైన్ పాడైపోతుంది. పొట్లోయ్ ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ వంటి రంగులలో వస్తుంది. దీనికి రిబ్బన్లు, రాళ్ళు, అద్దాలతో అలంకరిస్తాను’ అంటూ వివరించింది అబోక్. మొదట్లో ప్రతి పొట్లాయి డ్రెస్‌కు 500 రూపాయలు తీసుకునేది. ఇప్పుడు డిజైన్‌ను బట్టి రూ.10,000–15,000 మధ్యలో ఉంటుంది. పెళ్లిళ్ళ సీజన్ లేకపోయినా ఆమె ఖాళీగా ఉండదు. పొట్లోయి దుస్తుల్లో అందమైన బొమ్మలను రకరకాల సైజుల్లో చేస్తుంది. వీటి ధర 200 నుంచి 1000 రూపాయల్లో ఉంటుంది. శిక్షణకు విద్యార్థులు అబోక్ రాధే పొట్లోయి పనికి ప్రసిద్ధి చెందడంతో ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు ఈ కళను నేర్చుకోవడానికి ఆమె వద్దకు వస్తారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది తమకు తాముగా పొట్లోయి వ్యాపారాలను ప్రారంభించిన వారూ ఉన్నారు. ‘నా తదనంతరం కూడా ఈ పొట్లోయి కళ జీవించే ఉండాలి. నేను అందించిన నైపుణ్యాలు నా విద్యార్థులకు పొట్లోయి అందమైన నమూనాలను రూపొందించడానికి సహాయపడాలి‘ అంటోంది అబోక్ రాధే. అబోక్ ఖాళీ సమయంలో సామాజిక పనుల్లోనూ భాగం పంచుకుంటుంది. మాదకద్రవ్యాల వంటి వ్యసనాలను అరికట్టడం, మహిళల ఉపాధి అంశాలపై పనిచేసే రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది అబోక్. ‘ఒక మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఏ పరిస్థితిలోనైనా ఎవ్వరి మీదా ఆధారపడకుండా తనను తన కుటుంబాన్ని చూసుకోగలదు. ఇదే నా జీవితం నాకు నేర్పిన పాఠం’ అని చెబుతున్న ఈ బామ్మను చూసి యువత స్ఫూర్తి పొందాలి. -
పెళ్లి దుస్తులు తీసుకెళ్తుండగా...
సాక్షి, ఆదోని : పెళ్లి దుస్తులు తీసుకుని తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె అన్న మృతి చెందాడు. తండ్రితో పాటు మరో ఆరుగురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి కుమార్తె స్వల్పగాయాలతో బయటపడింది. ఈ సంఘటన బుధవారం బిణిగేరి-విరుపాపురం మధ్య పొలిమేరమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. డీఎస్పీ రామకృష్ణ, క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన మద్దికెరలోని మద్దమ్మ బావి వీధిలో నివాసముంటున్న కొట్రేష్, అన్నపూర్ణమ్మ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమార్తె సుమలతకు ఎమ్మిగనూరుకు చెందిన వినోద్‌కుమార్‌తో వచ్చే నెల 14,15న పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి దుస్తుల కోసం బుధవారం పెళ్లికుమార్తెతో పాటు తండ్రి కొట్రేష్, అన్న సూరిబాబు, బంధువులు మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణ ఓమ్నీ వ్యానులో ఆదోనికి వచ్చారు. పెళ్లి దుస్తులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బిణిగేరి-విరుపాపురం మధ్య పొలిమేరమ్మ గుడి సమీపంలో వ్యాను రోడ్డు పక్కన నిలిపారు. అంతలో ఎదురుగా వస్తున్న ఎంహెచ్46 ఎఫ్4883 నంబరు గల బండల లారీ టైర్ పగిలి వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె తండ్రి కొట్రేష్, అన్న సూరిబాబు, బంధువులు మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణ తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కుమార్తెకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. సూరిబాబు మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొట్రేష్ పరిస్థితి విషమంగా ఉంది. మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. ప్రత్యక్ష సాక్షి అయిన సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆస్పరి పోలీసులు తెలిపారు. ఆదోని డీఎïస్పీ రామకృష్ణ, తాలూకా ఎస్ఐ రామంజులు ఆస్పత్రికి చేరుకుని.. ప్రమాదం వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. -
ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే..
ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే.. ఈ అమ్మాయి ధరించిన వెడ్డింగ్ డ్రెస్‌ను టాయిలెట్ పేపర్‌తో తయారు చేశారు. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ పోటీలో ఈ డ్రెస్‌ను ఉత్తమమైనదిగా ఎంపికచేశారు. -
ఎవరెస్ట్ అంత పెళ్లి గౌను..!
కాడ్రీ : ప్రపంచంలోని అతి పెద్ద పెళ్లి గౌనును ఫ్రెంచ్ పట్టణం కాడ్రీలో ఆవిష్కరించారు. ఈ గౌను సైజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరం ఎవరెస్ట్‌ను ఈ డ్రెస్‌తో కప్పేయొచ్చట. దుస్తుల తయారీ కంపెనీ డైనమిక్ ప్రాజెక్ట్స్ ఈ గౌనును తయారు చేసినట్లు గిన్నిస్ బుక్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ గౌనుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తొలుత విడి భాగాలను తయారు చేసి ఆ తర్వాత మొత్తం డ్రెస్‌ను కుట్టినట్లు తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద పెళ్లి గౌనుగా దీన్ని గుర్తిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కంపెనీ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందజేసింది. ఆ తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్లో గౌను ఫొటోను ట్వీట్ చేసింది. -
అంతలోనే కొత్త పెళ్లికూతురు షాక్ తిన్నది!
పెళ్లంటే అందమైన సంబరం. సంతోషకరమైన సందర్భం. కానీ ఓ నవవధువుకు ఒకింత షాకింగ్ అనుభవాన్ని మిగిల్చింది. చూడచక్కని పెళ్లి దుస్తులు ధరించి.. అందంగా ముస్తాబై.. తనకు కాబోయేవాడితో ఫొటోలు దిగుతుండగా.. ఆమెకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఓ కారు ముందు నిలబడి.. వరుడితో కలిసి నూతన వధువు ఫొటోలు దిగుతుండగా.. కారు కదిలింది. దీంతో కారు బానెట్ లో చిక్కుకుపోయిన ఆమె పెళ్లిగౌనుకు అనుబంధంగా ఉన్న స్కర్ట్ ఊడిపోయింది. ఫొటో దిగుతున్న ఆమె బిత్తరపోయి సోలి పడిపోబోయింది. ఇంతలో వరుడు పరిగెత్తుకెళ్లి స్కర్ట్ తీసుకురాగా.. షాక్ తిన్న వధువు ఆ కారు డ్రైవర్ ను తిడుతూ.. తన చేతిలో ఉన్న బుకేతో కొట్టింది. మరోవైపు ఈ ఘటనను చిత్రీకరిస్తున్న చూపరుల్లో ఒకరిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో ఆమె బంధువు వచ్చి ఆమెకు సర్దిచెప్పి పెళ్లి వేదిక వద్దకు తీసుకెళ్లారు. రష్యాలోని ఉఫాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చి వైరల్‌గా మారిపోయింది. అయితే, ఈ వీడియో వట్టి బూటకమని, కావాలనే ఇలాంటి ఘటనను సృష్టించి చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని పలువురు విమర్శిస్తున్నారు. -
విడాకుల కోసం.. అమ్మకానికి వెడ్డింగ్ డ్రెస్
లండన్: వెడ్డింగ్ డ్రెస్ అంటే ఎవరికైనా ప్రత్యేకమైందే. తమ పెళ్లిరోజుకు సంబంధించిన జ్ఞాపకాలు ముడిపడి ఉన్న ఆ డ్రెస్‌ను ఎవరైనా జాగ్రత్తగా దాచుకోవడం చూస్తుంటాం. అయితే, లండన్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన వెడ్డింగ్ డ్రెస్‌ను.. తన భర్త నుంచి విడాకులు పొందడానికి కావాల్సిన ఫండ్ కోసం ఆన్లైన్లో వేలానికి ఉంచి వార్తల్లో నిలిచింది. చెస్టర్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సమంతా రాగ్ వివాహం 2014 ఆగస్ట్‌లో జరిగింది. కాగా, ఇటీవల సమంతా భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకొని, ఆమెతోనే ఉంటున్నాడు. ఇక లాభం లేదనుకున్న సమంత.. విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే.. ఈ విడాకుల వ్యవహారంలో కొంత మొత్తంలో డబ్బు కావాల్సిరావడంతో తన వెడ్డింగ్ డ్రెస్‌ను అమ్మాలనే ఆలోచన సమంతకు కలిగింది. అనుకున్నదే ఆలస్యంగా ఓ ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి ఉంచింది. వెడ్డింగ్ డ్రెస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. తనకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఆ ఫ్లోర్ లెన్త్ డ్రెస్‌ను 2000 పౌండ్లకు తన పేరెంట్స్ కొనుగోలుచేసినట్లు తెలిపింది. మంచి డిజైన్‌తో ఉన్న ఆ డ్రెస్ ఇప్పుడు కాస్త మురికిగా ఉందని.. అయితే ఒకసారి డ్రైక్లీనింగ్ చేయించి వాడుకోవచ్చిని వెల్లడించింది. 500 పౌండ్లకు దానిని అమ్మనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఓ డజను మంది విచారించినా కొనడానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపలేదు. -
టాయిలెట్ పేపర్లే పెళ్లి దుస్తులుగా..
లండన్: పెళ్లి దుస్తులు అనగానే ముందు మురిసిపోయేది మగువలే. తాళికట్టు శుభవేళ తాము ధరించే ఆ వస్త్రాలపైనే వారికి చాలా మోజుంటుంది. ఏరి కోరి వెతికివెతికి తమ పెళ్లి దుస్తులు సిద్ధం చేసుకుంటారు. కానీ, టాయిలెట్ పేపర్‌తో తయారుచేసే పెళ్లి వస్త్రాలు ఎవరైనా కొనుగోలు చేస్తారా.. ఒక వేళ అలాంటి సాహసమే చేస్తే.. అది కూడా వందల సంఖ్యలో అమ్మాయిలు చేస్తే.. న్యూయార్క్ నగరంలో ఇలాగే జరిగింది. ఓ బహుమతిని గెలుచుకునేందుకు అమెరికా ముద్దు గుమ్మలు టాయిలెట్ పేపర్ తో తయారు చేసిన వస్త్రాల కోసం పోటీ పడ్డారు. వేలు కుమ్మరించి వాటిని తెప్పించుకొని క్యాట్ వాక్ లు చేశారు. ప్రతి ఏటా జరిగినట్లుగానే ఈ ఏడాది కూడా న్యూయార్క్ లో టాయిలెట్ పేపర్ వెడ్డింగ్ డ్రెస్ కాంపిటేషన్ జరిగింది. దీనిని చీప్ చిక్ వెడ్డింగ్స్ వాళ్లు నిర్వహించగా చార్మిన్ అనే టాయిలెట్ పేపర్స్ తయారీ సంస్థ బహుమతి దాతగా నిలిచింది. ఇందులో రూల్ ఏమిటంటే చార్మింగ్ సంస్థకు చెందిన టాయిలెట్ పేపర్స్ తోనే వెడ్డింగ్ డ్రెస్ తయారుచేయించుకుని ధరించాలన్నమాట. దీంతో వందల మంది అమ్మాయిలు ఎగబడి ఆ టాయిలెట్ పేపర్స్ తీసుకొని డ్రెస్ లు తయారు చేయించుకొని వేసుకొని తమ అందాలు ఆరబోశారు. అందులో మంచి టాయిలెట్ వెడ్డింగ్ డ్రెస్‌కు తొలి బహుమతిగా పది వేల డాలర్లు అందించారు. -
రూ. 32 లక్షల వెడ్డింగ్ డ్రెస్
బీజింగ్: ఈ మోడల్ ధరించిన వెడ్డింగ్ డ్రెస్ ఖరీదు అక్షరాల 32.20 లక్షల రూపాయలు. వందలాది స్పటికాలు పొదిగిన ఈ డ్రెస్‌ను తయారు చేసేందుకు 21 మంది టైలర్లకు మూడు నెలల కాలం పట్టింది. దీన్ని మొత్తం చేతి మీదనే నేశారు. ఈ వెడ్డింగ్ డ్రెస్‌కు మరో విశేషముంది. ఇది పొడవైన రైలు పొడవంత, అంటే 331 అడుగుల పొడవుంది. దీన్ని చైనాలోని షాండాంగ్ రాష్ట్రం, జినాన్ నగరంలో సోమవారం వీధుల్లో ప్రదర్శించారు. వెడ్డింగ్ డ్రెస్సుల్లో పేరెన్నికగన్న ‘స్వీట్ స్టోరీ’ అనే షాపు తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఈ డ్రెస్‌ను ప్రదర్శించింది. 331 అడుగుల పొడవైన కిందకు వేలాడే గౌనును పట్టుకునేందుకు డ జన్ల మంది అవసరమయ్యారు. హ్యాపీ మ్యారేజ్‌కి లక్కీ చిహ్నంగా ఉండడం కోసమే తామింతా పొడవైన డ్రెస్‌ను డిజైన్ చేశామని షాపు యజమాని తెలిపారు. ఈ డ్రెస్ ఇంత పొడవున్నప్పటికీ గిన్నీస్ వరల్డ్ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా రాదు. ఎందుకంటే తూర్పుచైనాకు చెందిన గ్జియామెన్ అనే డిజైనర్ రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్‌పైనే గిన్నీస్ రికార్డు ఉంది. ఆయన రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్ పొడవు 8,256 అడుగుల పొడవు. -
అశ్వమా... మనువాడుదామా...
చదివింత......::: సత్యవర్షి ‘‘నీ సకిలింపు నాకెంతో ఇంపు... మన జంట చూపరుల కనులకు ఇంపు’’ అంటూన్న ఆ పాస్టర్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాలోని మిసిసిపి నగరంలో నివసించే పాస్టర్ ఎడ్వర్డ్ జేమ్స్... రీసెంట్గా పెళ్లాడారు. అదీ మనిషిని కాదు గుర్రాన్ని. అచ్చంగా వెడ్డింగ్ డ్రెస్ వగైరా అలంకారాలు చేసి మరీ గుర్రంతో తన పెళ్లి తంతును ట్రెడిషనల్‌గా పూర్తి చేశారు. అది కూడా ఫెడరల్ కోర్ట్ ఆవరణలో బహిరంగంగా. ఇంతకీ ఈయనగారు అంతగా అశ్వారాధకుడు ఎందుకయ్యాడు? ఏకంగా ఆలిగా ఎందుకు చేసుకున్నాడు? అంటే... ఇదంతా నిరసన తెలపడంలో భాగంగానే అంటున్నారు. అమెరికాలోని మిసిసిపిలో స్వలింగ సంపర్కుల వివాహాలపై నిషేధం ఉంది. అయితే దీనిని ఎత్తేయాలని, మిసిసిపిలో ఉన్న 3,484 గే కపుల్స్ హక్కులను కాపాడాలని న్యాయస్థానాలను కొందరు ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గే మ్యారేజెస్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా గుర్రాన్ని పెళ్లాడిన జేమ్స్... ‘‘గుర్రంతో నా పెళ్లిని నిషేధిస్తారా? లేక సేమ్ సెక్స్ మ్యారేజ్ స్టేటస్ ఇస్తారా? లేక మమ్మల్ని కలిసి ఉండమంటారా?’’ అంటూ ఊపిరి సలపనివ్వని ప్రశ్నలతో అక్కడి మీడియాకు చేతినిండా పని కల్పిస్తున్నాడు.