విడాకుల కోసం.. అమ్మకానికి వెడ్డింగ్ డ్రెస్ | Woman sells wedding dress on ebay to fund divorce from husband | Sakshi
Sakshi News home page

విడాకుల కోసం.. అమ్మకానికి వెడ్డింగ్ డ్రెస్

Published Wed, Aug 17 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

విడాకుల కోసం.. అమ్మకానికి వెడ్డింగ్ డ్రెస్

విడాకుల కోసం.. అమ్మకానికి వెడ్డింగ్ డ్రెస్

లండన్: వెడ్డింగ్ డ్రెస్ అంటే ఎవరికైనా ప్రత్యేకమైందే. తమ పెళ్లిరోజుకు సంబంధించిన జ్ఞాపకాలు ముడిపడి ఉన్న ఆ డ్రెస్ను ఎవరైనా జాగ్రత్తగా దాచుకోవడం చూస్తుంటాం. అయితే, లండన్కు చెందిన ఓ మహిళ మాత్రం తన వెడ్డింగ్ డ్రెస్ను.. తన భర్త నుంచి విడాకులు పొందడానికి కావాల్సిన ఫండ్ కోసం ఆన్లైన్లో వేలానికి ఉంచి వార్తల్లో నిలిచింది.

చెస్టర్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సమంతా రాగ్ వివాహం 2014 ఆగస్ట్లో జరిగింది. కాగా, ఇటీవల సమంతా భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకొని, ఆమెతోనే ఉంటున్నాడు. ఇక లాభం లేదనుకున్న సమంత.. విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే.. ఈ విడాకుల వ్యవహారంలో కొంత మొత్తంలో డబ్బు కావాల్సిరావడంతో తన వెడ్డింగ్ డ్రెస్ను అమ్మాలనే ఆలోచన సమంతకు కలిగింది. అనుకున్నదే ఆలస్యంగా ఓ ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి ఉంచింది. వెడ్డింగ్ డ్రెస్కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. తనకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఆ ఫ్లోర్ లెన్త్ డ్రెస్ను 2000 పౌండ్లకు తన పేరెంట్స్ కొనుగోలుచేసినట్లు తెలిపింది. మంచి డిజైన్తో ఉన్న ఆ డ్రెస్ ఇప్పుడు కాస్త మురికిగా ఉందని.. అయితే ఒకసారి డ్రైక్లీనింగ్ చేయించి వాడుకోవచ్చిని వెల్లడించింది. 500 పౌండ్లకు దానిని అమ్మనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఓ డజను మంది విచారించినా కొనడానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement