అంతలోనే కొత్త పెళ్లికూతురు షాక్‌ తిన్నది! | bride get shocking experience in Russia | Sakshi
Sakshi News home page

అంతలోనే కొత్త పెళ్లికూతురు షాక్‌ తిన్నది!

Published Mon, Oct 17 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

అంతలోనే కొత్త పెళ్లికూతురు షాక్‌ తిన్నది!

అంతలోనే కొత్త పెళ్లికూతురు షాక్‌ తిన్నది!

పెళ్లంటే అందమైన సంబరం. సంతోషకరమైన సందర్భం. కానీ ఓ నవవధువుకు ఒకింత షాకింగ్‌ అనుభవాన్ని మిగిల్చింది. చూడచక్కని పెళ్లి దుస్తులు ధరించి.. అందంగా ముస్తాబై.. తనకు కాబోయేవాడితో ఫొటోలు దిగుతుండగా.. ఆమెకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

ఓ కారు ముందు నిలబడి.. వరుడితో కలిసి నూతన వధువు ఫొటోలు దిగుతుండగా.. కారు కదిలింది. దీంతో కారు బానెట్‌ లో చిక్కుకుపోయిన ఆమె పెళ్లిగౌనుకు అనుబంధంగా ఉన్న స్కర్ట్‌ ఊడిపోయింది. ఫొటో దిగుతున్న ఆమె బిత్తరపోయి సోలి పడిపోబోయింది. ఇంతలో వరుడు పరిగెత్తుకెళ్లి స్కర్ట్ తీసుకురాగా.. షాక్ తిన్న వధువు ఆ కారు డ్రైవర్ ను తిడుతూ.. తన చేతిలో ఉన్న బుకేతో కొట్టింది. మరోవైపు ఈ ఘటనను చిత్రీకరిస్తున్న చూపరుల్లో ఒకరిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో ఆమె బంధువు వచ్చి ఆమెకు సర్దిచెప్పి పెళ్లి వేదిక వద్దకు తీసుకెళ్లారు. రష్యాలోని ఉఫాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చి వైరల్‌గా మారిపోయింది. అయితే, ఈ వీడియో వట్టి బూటకమని, కావాలనే ఇలాంటి ఘటనను సృష్టించి చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారని పలువురు విమర్శిస్తున్నారు.






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement