వైట్‌ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్‌! | Norwegian Company Halts Fuel Supply to US Over Trump,Zelensky Dispute | Sakshi
Sakshi News home page

వైట్‌ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్‌!

Published Sun, Mar 2 2025 4:35 PM | Last Updated on Sun, Mar 2 2025 5:04 PM

Norwegian Company Halts Fuel Supply to US Over Trump,Zelensky Dispute

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు అంటే ఒక్క లీటరు చమురు ఇవ్వబోమని అమెరికా సైన్యానికి ఇంధనం సరఫరా చేసే నార్వే దేశ చమురు, యుద్ధనౌకల్ని సరఫరా చేసే హాల్ట్‌బ్యాక్‌ బంకర్స్‌ (Haltbakk Bunkers) సంస్థ ఖరాఖండీగా చెప్పేసింది. 

వైట్‌ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల (Volodymyr Zelensky)మధ్య మాటలు మంటలు రేపాయి. ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇందుకు అమెరికా పెద్దన్నగా వ్యవరిస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో అమెరికా, ఉక్రెయిన్‌ అధ్యక్షుల మధ్య బహిరంగంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్‌ పట్టుబట్టారు. భవిష్యత్‌లో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా?, అందుకు మీరు భరోసా ఇస్తారా జెలెన్‌ స్కీ ఎదురు ప్రశ్నవేశారు.  జెలెన్‌స్కీ ఎదురు ప్రశ్నించడంతో  ట్రంప్‌,జేడీ వాన్స్‌ లు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునేలా మాటమాట పెరిగింది.

 

ఈ పరిణామంలో ప్రపంచ దేశాలు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీకి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే  ఆయా దేశాలు జెలెన్‌స్కీకి బాసటగా నిలిచాయి. తాజాగా, నార్వేజియన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని అమెరికాకు సరఫరా చేసే నార్వేజియన్ దేశ సంస్థ haltbakk బుంకెర్స్ కీలక ప్రకటన చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో పహారా కాస్తున్న అమెరికా సైనిక బలగాలకు సరఫరా చేసే ఇంధనాన్ని తక్షణమే ఆపేస్తున్నట్లు వెల్లడించింది. అందుకు వాషింగ్టన్‌లో శుక్రవారం అమెరికా, ఉక్రెయిన్‌ దేశాల దౌత్య సమావేశంలో జరిగిన వివాదమేనని తెలుస్తోంది.  

హల్ట్‌ బ్యాక్‌ బంకర్స్ తన ప్రకటనలో 2024లో అమెరికా సైనిక బలగాలకు సుమారు 30,00,000 లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేసింది. వైట్‌ హౌస్‌లో దేశాధ్యక్షుల మధ్య జరిగిన వాగ్వాదంలో జెలెన్‌స్కీకి అండగా నిలుస్తోంది. అందుకే మా సంస్థ అమెరికా సైనిక బలగాలకు ఇంధన సరఫరా చేయడం వెంటనే ఆపివేయాలని నిర్ణయించుకుంది’ అని సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఏమైందో ఏమో కొద్ది సేపటి తర్వాత ఆ పోస్టును డిలీట్‌ చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement