రూ. 32 లక్షల వెడ్డింగ్ డ్రెస్ | Woman wearing lavish £32,200 wedding dress with an incredible 330-foot train stuns city residents in China | Sakshi
Sakshi News home page

రూ. 32 లక్షల వెడ్డింగ్ డ్రెస్

Published Tue, Mar 15 2016 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

రూ. 32 లక్షల వెడ్డింగ్ డ్రెస్

రూ. 32 లక్షల వెడ్డింగ్ డ్రెస్

బీజింగ్: ఈ మోడల్ ధరించిన వెడ్డింగ్ డ్రెస్ ఖరీదు అక్షరాల 32.20 లక్షల రూపాయలు. వందలాది స్పటికాలు పొదిగిన ఈ డ్రెస్‌ను తయారు చేసేందుకు 21 మంది టైలర్లకు మూడు నెలల కాలం పట్టింది. దీన్ని మొత్తం చేతి మీదనే నేశారు. ఈ వెడ్డింగ్ డ్రెస్‌కు మరో విశేషముంది. ఇది పొడవైన రైలు పొడవంత, అంటే 331 అడుగుల పొడవుంది.

దీన్ని చైనాలోని షాండాంగ్ రాష్ట్రం, జినాన్ నగరంలో సోమవారం వీధుల్లో ప్రదర్శించారు. వెడ్డింగ్ డ్రెస్సుల్లో పేరెన్నికగన్న ‘స్వీట్ స్టోరీ’ అనే షాపు తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఈ డ్రెస్‌ను ప్రదర్శించింది. 331 అడుగుల పొడవైన కిందకు వేలాడే గౌనును పట్టుకునేందుకు డ జన్ల మంది అవసరమయ్యారు. హ్యాపీ మ్యారేజ్‌కి లక్కీ చిహ్నంగా ఉండడం కోసమే తామింతా పొడవైన డ్రెస్‌ను డిజైన్ చేశామని షాపు యజమాని తెలిపారు.

ఈ డ్రెస్ ఇంత పొడవున్నప్పటికీ గిన్నీస్ వరల్డ్ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా రాదు. ఎందుకంటే తూర్పుచైనాకు చెందిన గ్జియామెన్ అనే డిజైనర్ రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్‌పైనే గిన్నీస్ రికార్డు ఉంది. ఆయన రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్ పొడవు 8,256 అడుగుల పొడవు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement