ఎవరెస్ట్‌ అంత పెళ్లి గౌను..! | World’s longest wedding DRESS TRAIN can almost cover Mt EVEREST | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌ అంత పెళ్లి గౌను..!

Published Tue, Dec 19 2017 10:47 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

World’s longest wedding DRESS TRAIN can almost cover Mt EVEREST - Sakshi

కాడ్రీ : ప్రపంచంలోని అతి పెద్ద పెళ్లి గౌనును ఫ్రెంచ్‌ పట్టణం కాడ్రీలో ఆవిష్కరించారు. ఈ గౌను సైజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరం ఎవరెస్ట్‌ను ఈ డ్రెస్‌తో కప్పేయొచ్చట. దుస్తుల తయారీ కంపెనీ డైనమిక్‌ ప్రాజెక్ట్స్‌ ఈ గౌనును తయారు చేసినట్లు గిన్నిస్‌ బుక్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ గౌనుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

తొలుత విడి భాగాలను తయారు చేసి ఆ తర్వాత మొత్తం డ్రెస్‌ను కుట్టినట్లు తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద పెళ్లి గౌనుగా దీన్ని గుర్తిస్తూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కంపెనీ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందజేసింది. ఆ తర్వాత గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ట్విట్టర్‌లో గౌను ఫొటోను ట్వీట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement