పెళ్లికూతురి పుషప్స్‌ మామూలుగా లేవుగా | Aana Arora Push ups In Wedding Dress Going A Viral Video | Sakshi
Sakshi News home page

పెళ్లికూతురి పుషప్స్‌ మామూలుగా లేవుగా

Aug 4 2021 1:27 PM | Updated on Aug 4 2021 1:44 PM

Aana Arora Push ups In Wedding Dress Going A Viral Video - Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడానికి పలువురు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు వ్యాయామం ప్రాధాన్యం వివరిస్తూనే ఓ వైరల్‌ వీడియోను తీసి తన సోషల్‌ మీడియా ఖాతాల్లో విడుదల చేశారు. ఆమె చేసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతలా ఆకట్టుకోవడానికి కారణమేమిటంటే.. పెళ్లి డ్రెస్‌లో ఆమె పుషప్స్‌ చేసింది. 

అనా అరోరా ఫిట్‌నెస్‌ వీడియోలు చేస్తూ వ్యాయామ ప్రాధాన్యం వివరిస్తుంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎరుపు రంగు లెహంగా చోలీలో అనా మెరిసింది. ఆమె వివాహం జూలైలో జరిగింది. ఈ పెళ్లి డ్రెస్‌లోనే ఆమె పుషప్స్‌ చేసి అందరినీ అబ్బురపరిచింది. అందమైన డ్రెస్‌లో అనా పుషప్స్‌ చేస్తున్న అప్పటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె పుషప్స్‌ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 81 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోతో పాటు మరో వీడియో, కొన్ని ఫొటోలు పంచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement