జాతీయ దర్యాఫ్తు సంస్థ( ఎన్‌ఐఏ)
కశ్మీర్: దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ( ఎన్‌ఐఏ) మరొక నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసింది. కశ్మీర్‌లో ఇమాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందుతులైన మాలిక్ సోదరులతో కలిసి ఇమాజ్ దర్భంగా పేలుడుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటీవల దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment