బ్రస్సెల్స్: తనను త్వరగా పారిస్కు పంపించాలని ఆ నగరంపై దాడికి పాల్పడి ఇటీవల బ్రస్సెల్స్ పోలీసులకు పట్టుబడిన సలాహ్ అబ్దెస్లామ్ కోరాడు. ఈ విషయాన్ని అతడి తరుపు న్యాయవాది తెలిపాడు. 'వీలయినంత తొందరగా పారిస్ పోయేలా చూడాలని అబ్దెస్లామ్ నన్ను కోరాడు. స్వయంగా తనంతట తానే వివరణ ఇచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇది మంచి పరిణామం' అని ఆ న్యాయవాది చెప్పాడు.
కాగా, ఫ్రాన్స్పై దాడికి సంబంధించి మరింతమంది ఉగ్రవాదుల గురించిన సమాచారం తెలుసుకునేందుకు అతడిని తమ నిర్భందంలోనే ఉంచుకోవాలా లేక పారిస్కు బదిలీ చేయాలా అనే విషయంపై బ్రస్సెల్స్ కోర్టు ఈ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
'నన్ను త్వరగా పారిస్ పంపించండి'
Published Thu, Mar 24 2016 7:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement
Advertisement