aquarium
-
మనం మీనం
పెంపుడు జంతువులు అనగానే మనకు కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. ఎందుకంటే అవి మనుషులను గుర్తు పెట్టుకోవడమే కాదు విశ్వాసంగానూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే వస్తుంటాయి. చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో కలియదిరుగుతాయి. అయితే కుక్కలు, పిల్లులే కాదు.. చేపలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయని మీకు తెలుసా..? అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయని విన్నారా? అలాంటి చేపలను మన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటే? అలాంటి ఫ్రెండ్లీ చేపల గురించి తెలుసుకుందాం.. మనసుకు ప్రశాంతత, కాలక్షేపం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. మరికొందరైతే పని ఒత్తిడితో అలిసిపోయి ఇంటికి వచ్చాక కాసేపు వాటితో దోస్తానా చేస్తుంటారు. బిజీ లైఫ్‌స్టైల్‌తో మాన సిక ప్రశాంతత కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వాసులు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చేపలను పెంచేస్తున్నారు.జీబ్రా చేపలుఈ చేపల శరీరంపై నల్లటి, తెల్లటి చారికలు ఉంటాయి. అందుకే వీటికి జీబ్రా అని పేరుపెట్టారు. జీబ్రా డానియోస్ పూర్తి పేరు. ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. భిన్న పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోయే లక్షణాల కారణంగా వీటిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడుతుంటారు. ఇవి ఆరేడు చేపలతో కలిసి గుంపుగా పెరుగుతాయి.నెమలి నాట్యంలా.. నెమలి ఫించం లాంటి మొప్పలు ఉన్న చేపలు కదులుతుంటే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అవి నీటిలో అలాఅలా కదులుతుంటే మనసు గాల్లో తేలిపోక మానదు. ఇవి యజమానులను గుర్తించడమే కాదు.. మనం నేరి్పంచే టాస్్కలు కూడా నేర్చుకుంటాయి.‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. ఆస్కార్ ఫిష్‌లు గోల్డెన్, బ్లాక్, బ్లూ కలర్లో ఉంటాయి. అందంగా, ఫ్రెండ్లీగా ఉండి పెంచుకునే వారిని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తే ముద్దు ముద్దుగా చెప్పినట్టు వింటాయి.ఇంటెలిజెంట్.. గోల్డ్ ఫిష్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్వేరియం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ పెంచుకుంటారు. వీటికి జ్ఞాపక శక్తి, తెలివి చాలా ఎక్కువ. వీటికి కూడా మనకు నచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు.హచ్ డాగ్స్‌లా.. పేరుకు తగ్గట్టే ఏంజెల్లా ఉంటాయి ఈ చేపలు. అక్వేరియంలోని ఇతర చేపలతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. యజమానులు ఎటువెళ్తే అటు చూస్తాయి. ఇక ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయి.వెరీ.. క్యూరియస్ గయ్..గౌరమి అనే రకం చేపలు క్యూరియస్‌గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాయి. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూనే.. చుట్టుపక్కల ఏం ఉన్నాయనే విషయాలు తెలుసుకుంటాయి. చుట్టుపక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా యజమానులను గుర్తుంచుకుంటాయి. సిచిల్డ్ చాలా భిన్నం..సిచిల్డ్ చేపలు చాలా భిన్నమైనవి. వాటి ప్రవర్తన క్లిష్టంగా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలగలిసి పోతాయి. ఏదైనా సమస్యలు వస్తే చాకచక్యంగా పరిష్కరించడంలో దిట్ట. జాగ్రత్తగా కాపాడుకోవాలి.. చేపలను పెంచాలని ఇష్టపడటమే కాదు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఫుడ్పెట్టాలి. ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. మోటార్లతో ఆక్సిజన్ అందేలా జాగ్రత్తపడాలి. లేదంటే వైరస్ బారినపడి చేపలు చనిపోతుంటాయి. – షేక్ నసీరుద్దీన్ మన బాధ్యత.. ఎలాంటి చేపలను పెంచితే ఎక్కువ కాలం జీవించగలవో తెలుసుకుని పెంచాలి. పెద్ద అక్వేరియం ఏర్పాటు చేసి, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. చేపలకు మన మీద నమ్మకం రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అవి మనతో ఫ్రెండ్లీగా ఉండి, మనల్ని గుర్తుపడతాయి. – ఇబ్రహీం అహ్మద్ దస్తగిర్ -
#Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు)
-
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్‌తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్‌గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్‌లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్‌లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్‌ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్‌వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
హైదరాబాద్ లో సముద్రం ఎక్స్ పీరియన్స్
-
అక్వేరియం బద్దలైంది..!
బెర్లిన్: గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎల్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉంది. 2003 నుంచీ సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా రూపాయలు ఖర్చయింది. ఇది బెర్లిన్‌లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతి అని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. -
విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..
ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ.. ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తయిన తూర్పు కనుమల అందాలు అంతర్జాతీయ టూరిస్టులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కార్యనిర్వాహక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశీ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న విశాఖలో పీపీపీ విధానంలో పలు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పెట్టుబడులకు విదేశాలు ఆసక్తి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రిక్రియేషన్ టూరిజంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. సరికొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వివిధ దేశాలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. రిక్రియేషన్ అండ్ అడ్వెంచర్ టూరిజం విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టి.. పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ తదితర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రానున్న ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ఐకానిక్‌గా.. స్కైటవర్ తీరంలో సముద్ర మట్టానికి ఎత్తున విహరిస్తూ.. ఓవైపు అలల అందాల్ని.. మరోవైపు విశాఖ నగర హొయలను చూసేలా స్కైటవర్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీటూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచస్థాయి సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అంతర్జాతీయ వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమ్యూజ్మెంట్ రైడ్స్ సంస్థ ఇంటమిన్ ఈ ప్రాజెక్టుకు ఏపీటీడీసీ జాయింట్ వెంచర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి.. స్కైటవర్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. సుమారు 70 మంది సందర్శకులు చుట్టూ కూర్చొనే విధంగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ స్కైటవర్ పైకి తీసుకెళ్తుంది. రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే కాంతులతో కనిపించే ఈ టవర్.. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అరకు అందాల్లో తేలినట్టుందే.. మరోవైపు అడ్వెంచర్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రకృతి అందాలకు నిలయంగా.. అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆకర్షిస్తున్న విశాఖ మన్యం అడ్వెంచర్ టూరిజంకి కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా అరకులోయలో టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు రానుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరో ఫైల్ సంస్థ దీనికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి 30 మంది గాల్లో విహరించే సామర్థ్యం ఉన్న బెలూన్‌లో పర్యాటకులు విహరించేలా ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఇలా.. సరికొత్త పర్యాటకాన్ని విశాఖ వచ్చే టూరిస్టులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై.. రిక్రియేషన్ ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఏపీటీడీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. జలచరాల మధ్యలో విహరించేలా.. టన్నెల్ అక్వేరియం.. ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్ర లోతు ల్లో ఉండే పగడపు దీవులకు వెళ్లి.. 360 డిగ్రీల కోణంలో జలచరాల్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలో.. నీలి నీలి అందాలు.. చూపు తిప్పనీకుండా చేస్తాయి. టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్.. ఈ టన్నెల్ అక్వేరియంని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. టన్నెల్ అక్వేరియంకు ఎక్కువ శాతం సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. -
ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!
Tiger Shark Vomited Human Arm In An aquarium: కొన్ని కేసులు ఎంతలా పోలీసులు ప్రయత్నించినప్పటికీ వాటిని చేధించడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఒక పట్టాన ఆధారాలు దొరకవు. దీంతో పోలీసులకు ఆ కేసులు ఎప్పటికి పరిష్కారం కానీ ఒక మిస్టరీ కేసులుగా కనిపిస్తుంటాయి. అచ్చం అలాంటి ఒక అపరిష్కృత కేసును ఒక షార్క్ చేప సాయంతో చేధించగలిగారు. (చదవండి: అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కూగీ అక్వేరియంలో ఒక పెద్ద షార్క్ చేప ఒకరోజు అనూహ్యంగా వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. దీంతో అక్వేరియంలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్‌కి గురవుతారు అయితే ఆ షార్క్ చేప తొలుత మొదటగా ఒక ఎలుకను, పక్షిని వాంతి చేసుకుంది. ఆ తర్వాత ఒక తెగిపడిన మానవ చేతిని వాంతి చేసుకుంటుంది. దీంతో ఆస్ట్రేలియాను పట్టి పీడిస్తున్న 1935 నాటి ఒక హత్య కేసు పోలీసులు చేధిస్దారు. అసలేం జరిగిందంటే ఆ షార్క్ చేప వాంతి చేకున్న చేయి జిమ్మీ స్మిత్ అనే మాదక ద్రవ్యాల స్మగ్లర్ది. పైగా ఆ చేతిపై ఇద్దరూ బాక్సర్లు చెలరెగిపోతున్న ఒక పచ్చబొట్టు ఉంటుంది, అంతేకాదు ఆ చేయి మణికట్టుకు ఒక తాడు ఉంటుంది. అయితే ఈ స్మిత్ మాజీ సైనికుడు ప్యాట్రిక్ బ్రాడీతో కలిసి తమ క్లైయింట్లను ఫోర్జరీ చేసిన నకిలీ చెక్‌లతో మోసం చేస్తుండేవారు. అ తర్వాత కొన్నాళ్లకి ఆ ఫోర్జరీ కేసు నుంచి ఇద్దరూ ఏదో విధంగా బయటపడ్డారు. ఈ మేరకు కొంతకాలం తర్వాత స్మిత్ బ్రాడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆ ఇద్దరూ చివరిసారిగా ఒక హోటల్ కలిసి మధ్యం సేవించినట్లు వారి కదలికలను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రోజే స్మిత్ హత్యకు గురవ్వడంతో పోలీసులు అనుమానంతో బ్రాడీని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే స్మిత్ మృతదేహ కనిపించకపోవడంతో పోలీసులు ఆ కేసును చేధించలేక తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో కూగీ అక్వేరియం యజమాని బ్రెట్ హాబ్సన్ షార్క్ చేప వాంతులు చేసుకన్న వీడియోలతో పాటు ఎలా వాంతులు చేసుకుందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ షార్క్ చేప వాంతి చేసుకున్న మానవ చేయి ఆధారంగా ఈ కేసును చేధించారు. అయితే విచారణలో షార్క్ చేప స్మిత్‌పై దాడి చేయలేదని పోలీసులు నిర్థారించారు. (చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..) -
Visakhapatnam: అలా నడిచేద్దాం.. మీన ప్రపంచంలోకి
సాక్షి, విశాఖపట్నం: చిన్న అక్వేరియంలో అందమైన చేపల కదలికలను చూస్తేనే మనకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే పెద్ద అక్వేరియంలోకి నడుచుకుంటూ వెళ్లి భారీ జలచరాల మొదలు చిన్న చిన్న జీవులను సమీపం నుంచి చూస్తే మనసు ఎంత పులకరిస్తుందో కదా! ఓ టన్నెల్ లాంటి అక్వేరియంలో జలచరాలను చూస్తూ అక్కడే విందు ఆరగిస్తుంటే మజా వస్తుంది కదా! అద్దాల అక్వేరియంలో ఇలాంటివన్నీ ఆస్వాదించడానికి ఇప్పుడు విదేశాలకు వెళ్లనక్కర్లేదు. మన రాష్ట్రంలో కూడా అలాంటి అద్దాల అక్వేరియంను నిర్మించడానికి ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటిదైన టన్నెల్ అక్వేరియంను సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.163 కోట్లతో విశాఖపట్నంలో పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్వేరియం నిర్మాణానికి విశాఖలోని రుషికొండ, తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల్ని పరిశీలించారు. అక్వేరియంకు ఎక్కువ సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో.. తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. అద్భుత ప్రపంచం.. అక్వేరియం ఓ భారీ సొరంగం మాదిరిగా ఉంటే.. అందులో దాదాపు సముద్రంలో ఉండే జీవుల్నీ పెంచితే.. దాన్నే టన్నెల్ అక్వేరియం అంటారు. ఓసినేరియం మాదిరిగా ఇది ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్రలోతుల్లోకి వెళ్లి.. జలచరాల్ని సమీపం నుంచి చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. గుహలా ఉండే ఈ నిర్మాణంలోకి అడుగుపెట్టగానే.. జలచరాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్ మన మీదకు వచ్చేసినట్లే ఉంటుంది. షార్క్‌ల దంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆక్టోపస్‌ల జిత్తులు, సముద్రపు రొయ్యల దాగుడు మూతలు, భారంగా ఈదుతున్న తాబేళ్లు.. ఇలా పలు రకాల జలజీవాలను అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలోంచి 360 డిగ్రీల కోణంలోనూ చూడవచ్చు. విశాఖలో నిర్మించే అక్వేరియంలో ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో కనిపించే 20 వేల రకాల సముద్ర జీవులు ఉండనున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, స్పెయిన్ దేశాలకు చెందిన నిపుణులు దీనిని డిజైన్ చేయనున్నారు. సుమారు 3 వేల మంది ఒకేసారి సాగర ప్రపంచాన్ని తిలకించేలా ఐదు అంతస్తుల్లో నిర్మాణం జరగనుంది. కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా.. వైజ్ఞానిక, పరిశోధన క్షేత్రంగానూ ఉపయోగపడేలా దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. విశాఖలో ఇవీ థీమ్స్.. ► ఓషన్ థీమ్స్: హిందూ, పసిఫిక్ మహా సముద్రాల్లో మత్స్య సంపద, సుడిగుండాలు, ఉప్పెనల వల్ల సముద్రాలు ఎలా ప్రభావితమవుతాయి. స్థానిక వాతావరణం కారణంగా ఎలాంటి మార్పులు సంభవిస్తాయనే విషయాలు పర్యాటకులకు వివరించనున్నారు. ► ఓడలు ఎలా మునిగిపోయాయి?: ప్రపంచంలో పలు సముద్రాల్లో భారీ ఓడలు ఎలా మునిగిపోయాయి. ఎలా ధ్వంసమయ్యాయో పర్యాటకులకు షిప్‌రెక్ థీమ్‌లో వివరించేలా నిర్మాణం జరగనుంది. ► భారతదేశ నదుల థీమ్: మనదేశంలో ఉన్న నదులు ఎక్కడ పుట్టాయి. ఎటు ప్రవహిస్తున్నాయి. సముద్రంలో ఎక్కడ కలుస్తాయన్నది ఇక్కడ చూపించనున్నారు. ► టన్నెల్ రీఫ్ రెస్టారెంట్: టన్నెల్ అక్వేరియంలో సముద్ర జీవులను చూస్తూ.. హాయిగా భోజనం చేసేలా టన్నెల్ రీఫ్రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ► షార్క్ ల్యాబ్: షార్క్(సొర) చేపల జీవన చక్రం, మానవ చర్యల కారణంగా అవి ఎలా అంతరించిపోతున్నాయన్నది ఈ ల్యాబ్‌లో చూపించనున్నారు. ► మెడిటరేనియన్ కేవ్స్: అలల తాకిడికి సముద్రంలో శిలాతోరణాలు ఎలా ఏర్పడతాయో వివరించేలా నిర్మాణం జరగనుంది. అద్భుతాల నిలయం.. విశాఖ అక్వేరియం సింగపూర్‌లోని మెరైన్ లైఫ్పార్క్, ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్, లాస్ ఏంజిల్స్‌లోని సీవరల్డ్ తరహా టన్నెల్ అక్వేరియం విశాఖలో నిర్మించాలని భావిస్తున్నాం. టూరిజం పాలసీ 2020–2025ని అనుసరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించాం. అద్భుతాలకు నిలయంగా ఇది రూపుదిద్దుకోనుంది. విభిన్న థీమ్స్‌తో పాటు గ్రీన్ ఫోటో ఫెసిలిటీ, సావనీర్ షాప్స్, ఫుడ్ కోర్టులు, అనేక సరికొత్త అందాలు టన్నెల్ అక్వేరియంలో మిళితమై ఉంటాయి. – రజత్ భార్గవ, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
సిరులిచ్చే.. సోయగాల చేపలు!
సాక్షి, అమరావతి: అందమైన అక్వేరియాల్లో.. రంగురంగుల చేపలు తిరుగాడుతుంటే ఇంటికే కొత్త కళ వస్తుంది. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లకే పరిమితమైన ఈ అలంకార చేపలు.. ఇప్పుడు మధ్యతరగతి, సామాన్య ప్రజల నివాసాల్లో కూడా కనువిందు చేస్తున్నాయి. అందుబాటును బట్టి చిన్న చిన్న గాజు డబ్బాలతో పాటు పెద్దపెద్ద అక్వేరియాల్లో వీటిని పెంచేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా అలంకార చేపలకు గిరాకీ పెరిగింది. అక్వేరియాల్లో పెంచుకునే చేపలు 2,500 రకాలకు పైగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఏటా రూ.15 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ చేపల ఉత్పత్తి, ఎగుమతులకు సింగపూర్ కేంద్రంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, చెక్ రిపబ్లిక్, థాయిలాండ్, మలేసియా, ఇజ్రాయెల్, ఇండోనేసియా, నెదర్లాండ్స్, శ్రీలంక దేశాలున్నాయి. మన దేశంలో కూడా వీటి ద్వారా ఏటా రూ.222.50 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ అలంకార చేపల ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక రాష్ట్రాలున్నాయి. ఆరు జిల్లాల్లో యూనిట్లు.. ప్రస్తుతం మన దేశంలోని మంచి నీటిలో 375, ఉప్పు నీటిలో 165 రకాల అలంకార చేపలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన వీటి ఉత్పత్తికి.. ఏపీలో అపార అవకాశాలున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరుతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాలు వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ప్రోత్సహించేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. క్లస్టర్‌కు రూ.కోటి చొప్పున ఆరు జిల్లాలకు రూ.6 కోట్లతో యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో రూ.27 లక్షలతో బ్రూడర్(తల్లి చేపలు అభివృద్ధి), రూ.9.2 లక్షలతో రెండు రేరింగ్(తల్లి చేపల పెంపకం) యూనిట్లు, రూ.3.40 లక్షలతో 10 లార్వా(పిల్లల ఉత్పత్తి) యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం సబ్సిడీపై, ఇతరులకు 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వనుంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి ఏటా కోటి చేపల్ని ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పెట్టుబడికి 4 రెట్లు ఆదాయం.. లార్వా యూనిట్ కింద 300 చదరపు అడుగుల ట్యాంక్‌లో 3–4 సెంటీమీటర్ల సైజులో 600 నుంచి 800 పిల్లలను వేస్తే నెలకు అంగుళం సైజుకొస్తాయి. రకాల ఆధారంగా గరిష్టంగా 300 నుంచి 500 గ్రాముల వరకు పెరుగుతాయి. అంగుళం సైజుకొస్తే చాలు.. మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెలకు 13 వేల చేపల చొప్పున.. ఏటా లక్షకు పైనే ఉత్పత్తి అవుతాయి. సాధారణ అలంకార చేప ధర రూ.10. రకాలు, డిమాండ్ ఆధారంగా రూ.50 నుంచి రూ.100 వరకు ధర పలుకుతుంటుంది. రూ.3.40 లక్షల వరకు పెట్టుబడి పెడితే చాలు.. ఏడాదికి రూ.11.70 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉత్పత్తయ్యే వాటిని చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై మీదుగా సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఈ చిత్రంలో ఉన్న చేప పేరు ‘కోరన్ ఏంజిల్’. దీని ధర ఎంతో తెలుసా? రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర పైమాటే(పరిమాణం, రంగు ఆధారంగా). ఈ చేపకు అంతర్జాతీయంగా.. మరీ ముఖ్యంగా అరబిక్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీని తోక మీద డిజైన్.. అరబిక్ అక్షరాలను పోలి ఉంటుంది. ఈ చిత్రంలో ఉన్న చేప పేరు ‘అరోవనా’. దీన్ని వాస్తు చేపగా పిలుస్తారు. వీటి ధర కూడా రంగు, పరిమాణం ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటుంది. ఈ చేప ఉన్న ఇల్లు ప్రశాంతతకు నిలయంగా ఉంటుందని నమ్ముతుంటారు. అందుకే వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వాళ్లు.. వీటిని పెంచేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇవే కాదు పికాక్, పెప్పర్మింట్ ఏంజిల్, బటర్ ఫ్లై ఇలా ఎన్నో రకాల అలంకార చేపలున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో అలంకార చేపల సాగు చేపట్టాం. 1.25 ఎకరాల్లో ప్రభుత్వం ఇచ్చిన 60 శాతం సబ్సిడీతో.. రూ.93 లక్షలతో క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేశాం. బ్రూడర్, రేరింగ్, లార్వా యూనిట్లతో పాటు 100 ట్యాంకులు, 100 అక్వేరియం యూనిట్లు పెట్టాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాకేజింగ్, స్టోరేజ్, ల్యాబొరేటరీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. 20 రకాల చేపల్ని ఉత్పత్తి చేయబోతున్నాం. మరో రెండు నెలల్లో చేపల ఉత్పత్తికి శ్రీకారం చుడతాం. – ఆర్.అలోక్, జె.ధీరజ్, ఆనందజ్యోతి ఆర్నమెంటల్ ఫిషరీస్ ఫామ్ మహిళలకు లాభదాయకం గ్రామీణ మహిళలకు అలంకార చేపల సాగు ఎంతో లాభదాయకం. అంతర్జాతీయంగానే కాదు లోకల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – డాక్టర్ ఎం.విశ్వాస్‌రావు, కర్నూలు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల -
ఆటోకి ఊరి లుక్ వచ్చింది!
పల్లెను వదిలొచ్చాక తల్లి గుర్తొస్తే గుట్టుగానైనా కన్నీళ్లు పెట్టుకోడానికి సిటీలో చోటే దొరకదు. పల్లే తల్లయిన కుర్రాడికి చెరువులోని చేపలు, చేలోని వరి కంకులు, కోళ్లూ కుందేళ్లూ, కొండ మీద గుడిలో స్వాముల వారు.. ఊరంతా తోబుట్టులే. బతకడానికి వచ్చినవాడు రాళ్లు కొట్టగలడు, ఆటో నడపగలడు, పట్టభద్రుడైతే పద్దులూ రాయగలడు. పొద్దుపోయాక, ’ఏరా పెద్దోడా తినే పడుకున్నావా..’ అనే తండ్రి గొంతు వినకుంటే సిటీలో బతుకు ఉన్నట్టేనా? బతుకుతున్నట్టేనా? ఇలాగే ఉంటుంది ఊరిని వదిలి రావడం. ఒడిశాలోని కంధమల్ గ్రామం నుంచి పని వెతుక్కుంటూ రాజధాని నగరం భువనేశ్వర్ వచ్చాడు సుజిత్ దిగల్. అమ్మను వదిలి వచ్చిన పిల్లవాడిని సిటీ పెద్దమ్మ ఆదరించింది. ఆటో నడిపే పనిలో పెట్టింది. డబ్బులొస్తున్నాయి సంతోషమే. అమ్మతోనూ రోజూ మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మలాంటి ఊరినే.. చూడకుండా ఉండలేక పోతున్నాడు. సిటీలో ఊపిరి ఆడటం లేదు. సిటీని వదలి వెనక్కు వెళితే ఊపిరే ఉండదు. కొన్నాళ్లు చూశాడు. బెంగ అలాగే ఉంది. ఆటోలో చిన్న మొక్కను పెట్టుకున్నాడు. మనసుకు నెమ్మదిగా అనిపించింది. మరికొన్ని మొక్కలు తగిలించాడు. ఆటోకి గార్డెన్ లుక్ వచ్చింది. చిన్న ఆక్వేరియం పెట్టాడు. ఆటో లోపలే రెండు బోన్లు వేలాడదీసి ఒక దాంట్లో కుందేలు పిల్లను, ఇంకో దాంట్లో పక్షుల్ని ఉంచాడు. ఆటోకి ఊరి లుక్ వచ్చింది! ఆటో నడుపుతున్నంతసేపూ ఊళ్లో తిరుగుతున్నట్లే ఉంది సుజిత్ కి. ‘ఈ కుందేలు పిల్ల, పక్షులు, చేపలు, పూల మొక్కలు మా ఊరి వైబ్రేషన్స్‌ని నాకు అందిస్తున్నాయి‘ అంటున్నాడు. అమ్మ ఫొటో ఉన్న పర్స్ సుజిత్ కి తన ఆటో ఇప్పుడు. -
అంచనాలు తలకిందులు, అన్నీ నాణేల గుట్టలే!
వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా అక్వేరియం చాలా ఫేమస్. అక్కడికి రోజూ వేలాది మంది సందర్శకులు వస్తారు. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటేన్ నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. 30 అడుగుల లోతైన ఆ వాటర్‌ఫాల్స్‌లో నాణేలు వేసి ఏదైనా కోరుకుంటే అది తీరుతుందనే విశ్వాసం ఉంది. దాంతో సందర్శకులు ఆ వాటర్‌ఫాల్స్‌లో నాణేలు వేస్తుంటారు. సాధారణంగా జనాలతో కిక్కిరిసిపోయే ఆ అక్వేరియానికి ఆదాయానికి కూడా లోటు లేదు. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా దానిని మూసేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. రోజూవారి ఖర్చులు, జంతువుల సంరక్షణ కష్టమైంది. దాంతో అక్వేరియం నిర్వాహకులకు ఓ ఆలోచన తట్టింది. జనాల కోరికలు నెరవేరేందుకు వేసిన విషింగ్ కాయిన్స్‌ని బయటికి తీసేందుకు నిర్ణయించారు. అయితే, వారి అంచనాలు తప్పయ్యాయి. ఆ వాటర్ ఫాల్స్ ఫౌంటేన్‌లో జనాల కోరికలు రాశులుగా పోగుపడి దర్శనమిచ్చాయి. వారు ఊహించినదానికంటే చాలా ఎక్కువ.. అంటే దాదాపు 100 గాలన్ల నాణేలు ఆ ఫౌంటేన్‌లో లభించాయి. తమ అంచనాలు తలకిందులు చేసిన ఆ నాణేల రాశులకు సంబంధించిన ఫొటోలను అక్వేరియం నిర్వాహకులు ఫేస్బుక్లో ఫేర్ చేశారు. ఈ మొత్తం నాణేలు ఎంత విలువ చేస్తాయో చెప్పగలరా? అని నెటిజన్లకు క్విజ్ పెట్టారు. 48 వేల డాలర్లు అని ఒకరు, 64,427 డాలర్లు అని ఇంకొకరు తమ తోచిన మొత్తాన్ని చెప్పుకొచ్చారు. ఈ నాణేలన్నీ చలామణిలోకి వస్తే దేశంలో వాటి కొరత తీరుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. దేవుడు అందరి కోరికలు నెరవేర్చాలి అని మరొకరు ఆకాక్షించారు. ఈ పోస్టుకు లక్షా 80 వేల లైకులు రావడం విశేషం. కాగా, సరైన మొత్తం ఎంతో వచ్చేవారం జవాబు చెబుతామని అక్వేరియం నిర్వాహకులు వెల్లడించారు. -
కరోనా : పెంగ్విన్ ఫీల్డ్ ట్రిప్ !!
చికాగో : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆ పెగ్విన్స్‌కు స్వేచ్ఛ లభించింది. తాము ఇన్ని రోజులు మగ్గిపోయిన అక్వేరియంలో ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి. తమ రాజ్యంలోని ఇతర జీవులను చూస్తూ టైం పాస్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ పూర్తిగా ప్రబలడంతో అమెరికా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికాగోకు చెందిన షేడ్ అక్వేరియాన్ని కూడా మూసేశారు. అయితే అక్వేరియంలో ఉండే పెంగ్విన్లను లోపల స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. దీంతో విల్లింగ్టన్ అనే పెంగ్విన్ అక్వేరియాన్ని చుట్టేస్తూ అందులోని జంతువులను చూస్తూ ఆనందపడిపోతోంది. ఆసక్తిగా ఒకదాన్నొకటి చూసుకుంటున్న వేల్, పెంగ్విన్ మంగళవారం కయావక్, మోయక్, బేబీ అన్నిక్ అనే వేల్స్‌ల దగ్గరకు వెళ్లి చూసి వచ్చింది. అక్కడే ఉంటున్న మరో రెండు పెంగ్విన్లు టిల్లీ, కార్మిన్లు కూడా వేల్స్లను చూసోచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిలియన్ల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతున్నాయి. దీనిపై అక్వేరియం సిబ్బంది మాట్లాడుతూ.. ‘‘ విల్లింగ్టన్ వేల్స్ దగ్గరకు వెళ్లినపుడు అవి చాలా ఆసక్తిగా దాన్ని చూడసాగాయి. ఎందుకంటే అవెప్పుడూ పెంగ్విన్స్‌ను చూసెరుగవ’’ని పేర్కొన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా జూలు, అక్వేరియాలు మూతపడటంతో అక్కడి జంతువులు లోపలే స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు సంరక్షకులు. -
ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి
-
అక్వేరియం.. ఆహ్లాదం.. ఆనందం
ఇంటిని నిర్మించుకోవడం.. ఆ ఇంటికి అందాలు అద్దడం ఓ కళ. ఇంటి పరిసరాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు రంగు రంగుల బొమ్మలు, పోస్టర్లు అతికిస్తారు. ఇంటి బయట అరుదైన మొక్కలు నాటుతారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇంటీరియల్ డెకరేషన్‌కు ఎంత ఖర్చు అయినా వెనకాడటం లేదు. అరుదైన విగ్రహాలు, ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అక్వేరియం ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటికొచ్చే వారిని ఆకట్టుకునేందుకు కొందరు, వాస్తు పేరుతో మరి కొందరు అక్వేరియాన్ని తెచ్చేసుకుంటున్నారు. అందులో అందమైన చేపలు పెంచుతూ ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పొందుతున్నారు. సాక్షి, ఒంగోలు: మనిషి జంతువులను పెంచుకోవడం, వాటితో సరదాగా గడపడం ఎప్పటి నుంచో ఉంది. అలాగే పురాతన కాలం నుంచి జంతువులను, జలచరాలను పూజిస్తున్నారు. జలచరాల్లో తాబేలు, చేపకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో చేప, తాబేలు ఉంచితే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో పూర్వం సంప్లాంటి నిర్మాణంల్లో వాటిని ఉంచే వారు. ప్రస్తుతం వాటి స్థానంలో అక్వేరియాలు వచ్చేశాయి. గాజు ఫలకాలతో నిర్మించిన డబ్బాలో అందమైన చేపల కదలికలను చూస్తే మనసుకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది భావిస్తున్నారు. దీంతో అక్వేరియం ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. నివాసాల్లో, పెద్ద పెద్ద హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, బ్యాంకులు, వ్యాపార సంస్థల్లో అక్వేరియాలు ఏర్పాటు చేసి అందులో అరుదైన చేపలను ఉంచి ఆకట్టుకుంటున్నారు. గతంలో దేశవాళి చేపలనే పెంచుకునే వారు. ప్రస్తుతం అమెరికా, స్వీడన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి 40కిపైగా చేపలు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, ముంబాయి, బెంగళూరు వంటి మహానగరాలకు చేపలు దిగుమతి కాగా.. అక్కడి నుంచి జిల్లాలో పలువురు వ్యాపారులు తెచ్చుకుని స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు, ఆదోని, నంద్యాల తదితర ప్రాంతాల్లో 20కి పైగా అక్వేరియం షాప్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఆన్లైన్లో రోజుకు 10 నుంచి 15 వరకు అక్వేరియం డబ్బాలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో అక్వేరియం ధర రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. చేపల్లో అత్యధికంగా ప్రజలు ఆసక్తి చూపి కొనే చేప గోల్డ్ ఫిష్ కాగా, దానికి ఆహారంగా ఇచ్చే బ్లడ్మాన్స్ ధర అత్యధికంగా రూ.1500 ఉంది. ఆహారం ధర అనీఫుడ్ రూ.160 టయాఫుడ్ రూ.40 వసాకిఫుడ్ రూ.40 ఫ్రాన్స్ఫుడ్ రూ.1000 బ్లడ్‌మూన్ ఫుడ్ రూ.1500 తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి కావడంతో సాధారణ వాతావరణంలోనే జీవిస్తాయి. ► అక్వేరియంలో ప్రత్యేకంగా నీటి పంపు, ఆక్సిజన్ పంపు అవసరం. ► చేపలకు సమపాళ్లలో, రెండు పూటల ఆహారం అందించాలి. ► అక్వేరియం అందంగా ఉంచేందుకు ఆల్చిప్పలు, గవ్వలు, చిన్నపాటి పడవ తదితర ఆకారాలతో పాటు సముద్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ► అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపలు ఉంచితే చేపల విసర్జితాలు ఎక్కువై అమ్మోనియం పాలు అధికమవుతోంది. ఈ పదార్థం చేపలకు హానికరంగా మారుతుంది. ► అక్వేరియంలో నీటిని మార్చకపోతే బ్యాక్టిరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. ► నీటిని తరుచూ మార్చుతూ ఉండాలి. పెద్దది అయితే వారానికో సారి, చిన్నది అయితే రెండు రోజులకోసారి మార్చాలి. ► చేపలను నేరుగా నెట్ అవుట్ చేయకుండా నీళ్లు ఉన్న కంటైనర్ సహాయంతో బయటకు తీస్తే మంచిది. లేదంటే కొన్ని చేపలు అభద్రతభావంతో చనిపోయే ప్రమాదం ఉంది. చేపల ఆహారం చేపలకు మామూలు ఆహారం ఇస్తే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రత్యేకించి తయారు చేసిన ఆహారాన్నే వాటికి ఇవ్వాలి. వాటికిచ్చే ఆహారంలో నాణ్యత తక్కువైనా, పరిమాణం ఎక్కువైనా చేపలకు ప్రమా దమే. ప్రత్యేకంగా తయార య్యే ఆహారాన్ని వ్యాపారులు బెంగళూరు నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. చేపలకు రెండు పూటలా ఆహారం ఇవ్వాలి చేపలు.. రకాలు అక్వేరియంలో పెంచే చేపలు చాలా అరుదైనవి. వాటిలో గోల్డ్‌ఫిష్, షార్క్, టైగర్‌ఫిష్, ఫైటర్, బ్లాక్మాలిష్, సిల్వర్మాలిష్, పికాక్ ఫిష్, ఎస్కే గోల్డ్, ఎంజల్ఫిష్, సోలైన్, అర్తోనా, ఫ్లోరేన్ఫిష్, ఫిరోనాస్, చిక్స్లైట్స్, ఆస్పర్స్, ఇస్కార్స్, షిఫర్, సియాంజల్ వంటి చేపలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని శాస్త్రీయ నామాలతోనే పెంపకం దారులు పెంచుకుంటున్నారు. ఇవన్నీ సముద్రపు చేపల సంతతి. -
ప్రకృతి నిజంగానే పిలుస్తోంది..
జపాన్‌లోని అకాషీలో ఉన్న హిపోపో పాపా కేఫ్.. లోకల్‌గా ఇది చాలా ఫేమస్.. ఫుడ్ విషయంలో కాదు.. బాత్రూం విషయంలో.. ఈ హోటల్‌కు వచ్చినవారు ఒక్కసారైనా బాత్రూంకు వెళ్లివస్తారు. ఎందుకో తెలుసా? ఫొటో చూశారుగా.. ఇందుకే.. ఈ కేఫ్ యజమాని ఓ భారీ అక్వేరియం మధ్యలో బాత్రూంను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.1.8 కోట్లు ఖర్చుపెట్టాడు. దీంతో జనం ఈ కేఫ్‌కు బారులు తీరుతున్నారు. అయితే.. దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్.. చాలామంది జనం కేఫ్‌లో అర్డర్ ఇచ్చేదాని కన్నా.. ఎక్కువ సమయం బాత్రూంలో చేపలను చూస్తూ గడిపేస్తున్నారట. మరికొందరైతే.. ఉత్తుత్తినే.. ప్రకృతి పిలుస్తోందంటూ బాత్రూంలో దూరి గంటలు గంటలు గడిపేస్తున్నారట. ఇంకొందరైతే.. మరింత చిత్రంగా.. అవలాగ మమ్మల్నే చూస్తూ ఉంటే.. పనెలా అవుతుందమ్మా.. ఛీ సిగ్గేస్తోంది అంటూ వయ్యారాలు కూడా పోతున్నారట. -
దేశభక్తి చేప...
ఈ చేపకు దేశభక్తి ఉంది. అందుకే తన ఒంటి రంగును తన దేశ పతాకపు రంగులతో మేచ్ చేసింది. సరదాగా కనిపిస్తున్నా ఇది నిజం. థాయ్‌లాండ్‌లో సాధారణంగా దొరికే అక్వేరియం చేపల్లో ఒకదానికి అచ్చు ఆ దేశ పతాకానికి ఉన్న రంగులే ఉన్నాయి. దాంతో దాన్ని కొనుక్కోవడానికి థాయ్‌లాండ్ వాసులు పోటీ పడ్డారు. 600 లేదా వెయ్యి రూపాయలు పలికే ఈ చేప గిరాకీ పెంచుకుంటూ పోయింది. చివరకు బేరం లక్షా ఇరవై వేల రూపాయల దగ్గర తెగింది. థాయ్ చరిత్రలో ఇటువంటి చేప ఇంత రేటు పలకడం ఇదే రికార్డు. -
చుట్టూ చేపలు... మధ్యలో మనుషులు
ఒలింపిక్స్ ముగిసి రెండు మూడు నెలలు అవుతోంది. కానీ బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో మరో సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్‌కు సిద్ధమవుతోంది. మొత్తం దక్షిణ అమెరికాలోనే అతిపెద్దదైన అక్వేరియం వచ్చే నెల తొమ్మిదిన ప్రారంభం కానుంది. అక్కడెక్కడో యూరప్‌లో కిలోమీటర్ లోతైన అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉంటే... ఇక్కడ 650 అడుగుల పొడవైన అండర్‌వాటర్ టన్నెల్ ఉందీ చేపలతొట్టిలో. దాదాపు 45 లక్షల లీటర్ల నీటిని 28 ట్యాంకుల్లో నింపడం ద్వారా ఈ అక్వేరియంను సిద్ధం చేశారు. ఈ ట్యాంకులన్నింటినీ కలుపుతూ ఈ టన్నెల్ ఉంటుందన్నమాట. ఆక్వా రియో అని పేరుపెట్టన ఈ అక్వేరియంలో దాదాపు 350 జాతుల జలచరాలు 8000 వరకూ ఉంటాయి. సింగపూర్ తదితర దేశాల్లో అండర్ వాటర్ టన్నెల్స్‌తో కూడిన అక్వేరియంలు ఉన్నప్పటికీ ఇంత భారీస్థాయిలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని అంచనా. అక్వేరియంతోపాటు ఆక్వా రియోలో ఒక సర్ఫ్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం కూడా ఉంటాయి. జలచరాలను దగ్గర నుంచి చూడాలనుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కావాలంటే ఈ అక్వేరియంలో ఒక రాత్రి మొత్తం గడిపేందుకూ అవకాశముంది. ఇలాంటిదేవో ఇక్కడ ఒకటి అరా ఏర్పాట చేస్తే బాగుండు అనిపిస్తోంది కదూ.... నిజమే! -
బీపీ నియంత్రణలో ఉంచే అక్వేరియమ్
లండన్: చిన్న చిన్న చేపలు, ఇతర జలచరాలతో ఉండే అక్వేరియమ్లను కాస్సేపు చూస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా పని చేసి అలసిపోయినవారు అక్వేరియమ్లను చూసి కాస్సేపు సేదతీరొచ్చు. అయితే అక్వేరియమ్లతో అంతకుమించిన ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సేపు అక్వేరియమ్లను చూడడం వల్ల రక్తపోటు, గుండెవేగం తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. 'చాలా వైద్యశాలల్లో వెయిటింగ్ రూముల్లో, ఆపరేషన్ థియటర్స్లో అక్వేరియమ్లు ఉంటాయి. ఇవి అక్కడి రోగులు, వైద్యులు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడతాయి' అని బ్రిటన్‌కు చెందిన నేషనల్ మెరైన్ అక్వేరియమ్ పరిశోధకుడు డెబోరా క్రాక్నెల్ అన్నాడు. ఆయన బృందం జరిపిన అధ్యయనం ద్వారా జలచరాలు ఉండే అక్వేరియమ్లు మానవులపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని వెల్లడైంది. ఇలాంటివి అమర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని డెబోరా అన్నాడు. అక్వేరియమ్లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై జరిగిన తొలి పరిశోధన వీరిదే. ఈ అధ్యయనంలో భాగంగా అక్వేరియమ్లోని చేపల సంఖ్య, మానవుల మానసిక స్థితి, రక్తపోటు, గుండెవేగం తదితర అంశాలను వీరు పరిగణనలోకి తీసకున్నారు. అక్వేరియమ్లలో ఎక్కువ చేపలు ఉన్న సమయంలో మానవుల్లో మంచి మానసిక స్థితిని వారు గమనించారు. పని ఒత్తిడిని తగ్గించడంలో వీటి పాత్ర ఎక్కువని డెబోరా బృందం అభిప్రాయపడింది. -
ఆక్వా పార్కులో డాల్ఫిన్ పార్టీ
-
పట్టణ వాకిట ప్రకృతి సోయగం
పక్షుల పెంపకంపై మక్కువ చూపుతున్న ప్రజలు చేపల ఆక్వేరియంలకు గిరాకీ విభిన్న వ్యాపారానికి ఆదరణ ఊర పిచ్చుకల కిచకిచలు..చిలక పలుకులు..గోరింకల కేరింతలు..ముత్యాలాంటి మీనాల విన్యాసాలు..చెంగు చెంగంటూ దుమికే కుందేళ్ల గెంతుల ప్రకృతి సోయగాలు... పల్లె సీమల సొంతం. నేడు ఆ అందాలన్నీ నగరవాకిటా కనువిందు చేస్తున్నాయి. అది ఎలాంటే.. పంజరాన ఒదిగే లవ్‌బర్డ్స్, పావురాలు, కుందేళ్లు..ఆక్వేరియంలో గిరగిరా బంగారు చేపలు నగరవాసుల ఇళ్ల అలంకరణలుగా దర్శనమిస్తున్నాయి. పక్షుల సవ్వడిపై నగరవాసులు మక్కువ చూపుతుండడంతో ఈ వ్యాపారం మూడు మీనాలు..ఆరు లవ్‌బర్డ్స్‌గా సాగుతోంది. చిత్తూరు(రూరల్):నగరవాసులు వివిధ జాతుల పక్షులు, అందమైన చిన్న, చిన్న జంతువులు, ఆక్వేరియంలో చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో చెన్నై నుంచి తెప్పించిన పంజరాలతో కూడిన చిలుకలు, చేపల ఆక్వేరియంకు ఆదరణ అభించడంతో నగరంలో పలు దుకాణాలు వెలుస్తున్నాయి. వ్యాపారాలు సైతం లాభసాటిగా సాగుతున్నట్లు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వేలూరు మార్గంలో జెడ్పీ కార్యాలయం సమీపంలో ఓ షాపు, సీబీ రోడ్డులో మరోషాపులో, ఇంకా పలుచోట్ల అందమైన రంగుల్లో ఉన్న చేపలతో ఆక్వేరియంలు ఆకట్టుకుంటున్నాయి. ఆక్వేరియంల కోసం ఫ్లవర్ హర్న్, హెర్మో, సిల్వర్ షాక్, సీ ఏంజెల్, గోల్డ్‌ఫిష్, రూకే గోల్డ్, మాలి, టైగర్, వైట్షాక్, బ్లాక్ మోలాస్, లాంగ్‌టైమ్, పెట్రాస్కి గోల్డ్, లూసింగ్, ఫిరానా తదితర రకాల చేపలను చెన్నై నుంచి తెప్పించి, విక్రయిస్తున్నారు. ఆక్వేరియం అడుగున రంగురాళ్లు వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసి, విక్రయిస్తున్నారు. అలాగే ఈ షాపుల్లోనే రంగురంగుల చిలుకలతో నిండిన పంజరాలను విక్రయిస్తున్నారు. పెంచుకునేందుకు కుందేళ్లను, పావురాలను సైతం ఇక్కడ ప్రత్యేక పంజరాల్లో పెట్టి అమ్ముతున్నారు. అలాగే వాటి పోషణ కోసం వినియోగించే మేతను కూడా అక్కడే విక్రయిస్తున్నారు. -
భాగ్యనగరంలో భారీ అక్వేరియం!
జీరో గ్రావిటీ అనుభూతి సందర్శకుల సొంతం స్పందించే రాక్షస బల్లులు,ఆకాశంలో గిరికీలు కొట్టించే రోలర్‌కోస్టర్ అనిశ్చితి తొలగడంతో ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థ దేశంలోనే మొదటిది.. బుద్వేలులో ఏర్పాటు న్యూజిలాండ్ సాంకేతికత, బ్రిటన్ ఆర్థికసాయం హైదరాబాద్: చుట్టూ స్వచ్ఛమైన నీళ్లు... అందులో అందమైన చేపలు, ఆకట్టుకునే ఇతర జలచరాలు.. ఆ నీటికింద అద్దాలతో తయారైన సొరంగమార్గం...జలచరాల విచిత్రవిన్యాసాలు అతిదగ్గరగా తిలకిస్తూ... దానిగుండా నడుస్తూ ముందుకుసాగితే...‘జీరో గ్రావిటీ’ వ్యవస్థ సాక్షాత్కారం... అంతరిక్షంలో వ్యోమగాముల మాదిరిగా గాల్లో తేలియాడిన అరుదైన అనుభూతి మనసొంతమవుతుంది. ఆ పక్కకు చూస్తే భయంకర రూపంతో మనల్ని పలకరించే రాక్షసబల్లులు.. మనం వేసే ప్రశ్నలకు అవి క్రూరమైన గొంతుతో సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరుస్తాయి... ఇంకొంచెం ముందుకెళితే ఆకాశంలో గిరికీలు కొట్టిం చే రోలర్ కోస్టర్.. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ అద్భుత వినోదాల విందు త్వరలో హైదరాబాద్‌లో కూడా లభించబోతోంది. దేశంలోనే తొలి ప్రయత్నంగా ఈ భారీ ప్రాజెక్టు నగరంలో సిద్ధం కానుంది. న్యూజిలాండ్, బ్రిటన్ల సాంకేతిక, ఆర్థిక సహకారంతో ఓ సంస్థ దీని నిర్మాణానికి ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ సంస్థ గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఉత్సాహం చూపినా... స్థానికంగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో వెనకడుగు వేసింది. ఇప్పుడు రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కావటంతో ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రాథమికంగా రూ.150 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ప్రత్యేకతలెన్నో: నగరంలో అండర్ వాటర్ అక్వేరియం నిర్మాణం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరాలం జలాశయం నీటిని ఆధారం చేసుకుని జూపార్కు పక్కన ఇలాంటి ప్రాజెక్టు కోసం గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీ ఏ) ప్రయత్నించింది. ఆరు సంస్థలు ముందుకొచ్చినా ఆర్థికమాంద్యం వల్ల ప్రాజెక్టు చేపట్టలేకపోయాయి. ఇప్పుడు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నగర శివారులోని బుద్వేల్‌లో ఈ ప్రాజెక్టు కేటాయించేందుకు ముందుకురావడంతో ‘బిగ్ బ్లూ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటె డ్’ అనే సంస్థ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. బ్యాంక్ గ్యారం టీతోపాటు డీపీఆర్‌ను అందజేసింది. దీంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో అధికారులు పత్రికల్లో ప్రకటనలిచ్చినా వేరే సంస్థలు రాకపోవడంతో ఆ సంస్థకే ప్రాజెక్టును కేటాయించారు. బుద్వేల్‌లో ఇందుకోసం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో 8 ఎకరాల్లో అండర్‌వాటర్ అక్వేరియం రూపుదిద్దుకోనుండగా మిగతా స్థలంలో ‘జీరో గ్రావిటీ ప్రాజెక్టు’, ‘ఇంటరాక్టివ్ డైనోసార్, రోలర్ కోస్టర్, రెస్టారెంట్స్, రిసా ర్ట్స్.. ఇలా పలు వినోదకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు న్యూజిలాండ్‌కు చెందిన ఓ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుం డగా, బ్రిటన్‌కు చెందిన మరో సంస్థ ఆర్థిక చేయూతనివ్వనుందని అధికారులు చెబుతున్నారు. ముంబైలోని తారాపూర్వాలా అక్వేరియం, చండీగఢ్, సూరత్‌లలోని టన్నల్ అక్వేరియంలు మాత్రమే ఇప్పటివరకు దేశంలో గుర్తింపు పొందాయి. కానీ విదేశీ తరహాలో భారీ అండర్‌వాటర్ అక్వేరియం హైదరాబాద్‌దే కాబోతోందని అధికారులు చెబుతున్నారు. లీజ్ రెంట్తోపాటు అక్వేరియం ఆదాయంలోనూ ప్రభుత్వానికి వాటా ఉండడంతో ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. -
అన్వేషణం : నేలపై సముద్రం... జార్జియా అక్వేరియం!
చిన్ని చిన్ని అద్దాల పెట్టెల్లో, బుజ్జి బుజ్జి చేపలను వేసి, అక్వేరియం అంటూ ఇంట్లో అమర్చుకుంటాం. రంగుల చేపలను చూసి పిల్లలు గంతులు వేస్తుంటే చూసి మురిసిపోతాం. ఆ చిన్ని అక్వేరియమే మన ఇంట్లో ఇంత ఆనందాన్ని నింపితే... పదమూడు ఎకరాల్లో ఉండే జార్జియా అక్వేరియం ఇంకెంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది! అమెరికాలోని జార్జియా రాష్ర్టంలో ఉన్న సందర్శనీయ స్థలాల్లో జార్జియా అక్వేరియానిది ప్రత్యేక స్థానం. దాన్ని చూడటం జీవితంలోనే ఓ గొప్ప అనుభవం. దాదాపు ఎనభై లక్షల గ్యాలన్ల నీటిలో, లక్షా ఇరవై వేలకు పైగా సముద్ర జీవులు ఈదులాడుతూ ఉంటే, వాటి ముఖంలో ముఖం పెట్టి పలకరించడం ఇక్కడ మాత్రమే సాధ్యం. ప్రపంచంలోనే అతి పెద్దదైన జార్జియా అక్వేరియం నిర్మాణానికి కారకులు బెర్నార్డ్ మార్కస్. ప్రముఖ వ్యాపారస్తుడైన ఈయనకు సముద్ర జీవులంటే ఎంతో ఇష్టమట. అందుకే ఎక్కడ అక్వేరియంలు ఉన్నా ఇష్టంగా చూసేవారు. తన భార్యతో కలిసి పదమూడు దేశాలు తిరిగి, యాభై ఆరు అక్వేరియంల వరకూ సందర్శించి మరీ దీనికి రూపకల్పన చేశారు. రెండు వందల యాభై మిలియన్ డాలర్లను దీని కోసం వెచ్చించారు. అది కాక మరో నలభై మిలియన్ డాలర్లను పలువురి నుంచి సేకరించారు. ఫలితంగా 2005లో జార్జియా అక్వేరియం ప్రారంభమయింది. లక్షలాది మందికి ఓ చక్కని ఆటవిడుపుని, ఆనందాన్ని కలిగిస్తోంది! ఈ అక్వేరియం ఆరు విభాగాలుగా ఉంటుంది. వీటన్నిటి లోనూ రకరకాల సముద్ర జీవులు ఉంటాయి. సముద్ర మొక్కలు కూడా ఉంటాయి. గైడ్స్ మన వెంటే ఉండి, ప్రతి దాని గురించీ వివరిస్తారు. దాంతో ఉల్లాసంతో పాటు విజ్ఞానం కూడా లభిస్తుంది మనకు. అందుకే సరదాగా వచ్చే సందర్శకులతో పాటు, పరిశోధనల కోసం, ప్రాజెక్టు వర్కుల కోసం వచ్చేవారు కూడా ఎక్కువే! అమ్మో... అడుగుకో దెయ్యం! ఇంగ్లండులోని ప్లక్లీ గ్రామం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఏదో గొప్పదనం వల్ల కాదు. ఎక్కడా లేని దెయ్యాలు అక్కడే ఉన్నాయని! ఆ ఊరు పగలంతా సందడిగా ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించాక ఆ ఊళ్లో ఒక్క మనిషి కూడా గడప దాటి అడుగు బయటపెట్టడు. పెడితే... ఎక్కడ, ఏ దెయ్యాన్ని చూడాల్సి వస్తుందోనని భయం! ప్లక్లీలో పన్నెండు దెయ్యాలు చాలా ఫేమస్. రహదారి మీద తిరిగే మగదెయ్యం ప్రయాణీకులను ముప్పు తిప్పలు పెడుతుందట. పినాక్ సరస్సులో ఉండే ఆడదెయ్యం అర్ధరాత్రి అయితే చాలు, ఊరంతా చక్కర్లు కొడుతుందట. అదే టైమ్‌లో పన్నెండు గుర్రాలు ఉన్న రథంలో మరో దెయ్యం షికార్లు చేస్తుందట. ఇంకా చర్చిలో, పబ్‌లో, స్కూల్లో... ఇలా పలుచోట్ల ఉన్న ప్రముఖ దెయ్యాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని అంటారు. ఇవి కాక ఇంకా ఓ ఇరవై, ముప్ఫై దెయ్యాల వరకు ఉన్నాయట ఆ ఊళ్లో. వీటిని పుకార్లుగా నిరూపించేందుకుగాను ప్లక్లీకి వచ్చిన పరిశోధకులు సైతం, దెయ్యాల దెబ్బకి జడుసుకున్నారు. అర్ధరాత్రి వినిపించే అరుపులు, అడుగుకొకటి చొప్పున ఎదురై పలకరించే ఆత్మల ధాటికి తట్టుకోలేక పరారయ్యారు. అందుకే ఈ ఊరు... అత్యంత భయానక ప్రదేశంగా మిగిలిపోయింది!