Tiger Shark Vomited Human Arm In Aquarium, Helps To Police Solve Murder Case - Sakshi
Sakshi News home page

ఆ షార్క్‌ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!

Published Tue, Dec 7 2021 10:46 AM | Last Updated on Tue, Dec 7 2021 11:21 AM

Tiger Shark Vomited Human Arm In An aquarium To Trigger  Murder Investigation - Sakshi

Tiger Shark Vomited Human Arm In An aquarium: కొన్ని కేసులు ఎంతలా పోలీసులు ప్రయత్నించినప్పటికీ వాటిని చేధించడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఒక పట్టాన ఆధారాలు దొరకవు. దీంతో పోలీసులకు ఆ కేసులు ఎప్పటికి పరిష్కారం కానీ ఒక మిస్టరీ కేసులుగా కనిపిస్తుంటాయి. అచ్చం అలాంటి ఒక అపరిష్కృత కేసును ఒక షార్క్‌ చేప సాయంతో చేధించగలిగారు.

(చదవండి: అఫ్ఘాన్‌ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్‌ మద్దతు కావాలి!)

అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో  సిడ్నీలోని కూగీ అక్వేరియంలో ఒక పెద్ద షార్క్ చేప ఒకరోజు అనూహ్యంగా వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. దీంతో అక్వేరియంలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్‌కి గురవుతారు అయితే ఆ షార్క్‌ చేప తొలుత మొదటగా ఒక ఎలుకను, పక్షిని వాంతి చేసుకుంది. ఆ తర్వాత ఒక తెగిపడిన మానవ చేతిని వాంతి చేసుకుంటుంది. దీంతో  ఆస్ట్రేలియాను పట్టి పీడిస్తున్న 1935 నాటి ఒక హత్య కేసు పోలీసులు చేధిస్దారు.

అసలేం జరిగిందంటే ఆ షార్క్‌ చేప వాంతి చేకున్న చేయి జిమ్మీ స్మిత్‌ అనే మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ది. పైగా ఆ చేతిపై ఇద్దరూ బాక్సర్‌లు చెలరెగిపోతున్న ఒక పచ్చబొట్టు ఉంటుంది, అంతేకాదు ఆ చేయి మణికట్టుకు ఒక తాడు ఉంటుంది. అయితే ఈ స్మిత్‌ మాజీ సైనికుడు ప్యాట్రిక్ బ్రాడీతో కలిసి తమ క్లైయింట్‌లను ఫోర్జరీ చేసిన నకిలీ చెక్‌లతో మోసం చేస్తుండేవారు. అ తర్వాత కొన్నాళ్లకి ఆ ఫోర్జరీ కేసు నుంచి ఇద్దరూ ఏదో విధంగా బయటపడ్డారు. ఈ మేరకు కొంతకాలం తర్వాత స్మిత్‌ బ్రాడిని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆ ఇద్దరూ చివరిసారిగా ఒక హోటల్‌ కలిసి మధ్యం సేవించినట్లు వారి కదలికలను పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత రోజే స్మిత్‌ హత్యకు గురవ్వడంతో పోలీసులు అనుమానంతో బ్రాడీని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కథలో ట్విస్ట్‌ ఏంటంటే స్మిత్‌ మృతదేహ కనిపించకపోవడంతో పోలీసులు ఆ కేసును చేధించలేక తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో కూగీ అక్వేరియం యజమాని  బ్రెట్ హాబ్సన్ షార్క్‌ చేప వాంతులు చేసుకన్న వీడియోలతో పాటు ఎలా వాంతులు చేసుకుందో వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో పోలీసులు ఆ షార్క్‌ చేప వాంతి చేసుకున్న మానవ చేయి ఆధారంగా ఈ కేసును చేధించారు. అయితే విచారణలో షార్క్‌ చేప స్మిత్‌పై దాడి చేయలేదని పోలీసులు నిర్థారించారు.

(చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement