
జపాన్‌లోని అకాషీలో ఉన్న హిపోపో పాపా కేఫ్.. లోకల్‌గా ఇది చాలా ఫేమస్.. ఫుడ్ విషయంలో కాదు.. బాత్రూం విషయంలో.. ఈ హోటల్‌కు వచ్చినవారు ఒక్కసారైనా బాత్రూంకు వెళ్లివస్తారు. ఎందుకో తెలుసా? ఫొటో చూశారుగా.. ఇందుకే.. ఈ కేఫ్ యజమాని ఓ భారీ అక్వేరియం మధ్యలో బాత్రూంను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.1.8 కోట్లు ఖర్చుపెట్టాడు. దీంతో జనం ఈ కేఫ్‌కు బారులు తీరుతున్నారు. అయితే.. దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్.. చాలామంది జనం కేఫ్‌లో అర్డర్ ఇచ్చేదాని కన్నా.. ఎక్కువ సమయం బాత్రూంలో చేపలను చూస్తూ గడిపేస్తున్నారట. మరికొందరైతే.. ఉత్తుత్తినే.. ప్రకృతి పిలుస్తోందంటూ బాత్రూంలో దూరి గంటలు గంటలు గడిపేస్తున్నారట. ఇంకొందరైతే.. మరింత చిత్రంగా.. అవలాగ మమ్మల్నే చూస్తూ ఉంటే.. పనెలా అవుతుందమ్మా.. ఛీ సిగ్గేస్తోంది అంటూ వయ్యారాలు కూడా పోతున్నారట.
Comments
Please login to add a commentAdd a comment