వైఎస్సార్ జిల్లా (పులివెందుల రూరల్): ఈ చిత్రంలో మర్రి చెట్టు కొమ్మలకు వేలాడుతున్నవి కాయలు అనుకుంటే పొరపాటుపడినట్లే.. అవి కాయలు కాదండోయ్ గబ్బిలాలు. పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామానికి వెళ్లే రహదారి పక్కన మర్రిచెట్టు కొమ్మలపై ఉన్న గబ్బిలాలను స్థానికులు కెమెరాతో క్లిక్‌మనిపించారు. వీటిని ఈ ప్రాంతంలో కీతరేవులు, రుషి పక్షులుగా పిలుస్తారు.
ఇవి ఎక్కడ ఉన్నా పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. కీళ్ల, కాళ్ల నొప్పులు, మూర్ఛవ్యాధి తదితర వాటికి గబ్బిలాల మాంసం తింటే నయమవుతాయని ప్రజల నమ్మకం. ఈ పక్షులు రాత్రివేళల్లో ఆహారం కోసం బయటకు వెళ్లి.. పగటిపూట చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు.
చదవండి: పేదరికం నుంచి ...అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా
Comments
Please login to add a commentAdd a comment