Khosta-2: రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్‌ | Khosta-2: New Covid-like virus found in Russian bats | Sakshi
Sakshi News home page

Khosta-2: రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్‌

Published Tue, Sep 27 2022 5:00 AM | Last Updated on Tue, Sep 27 2022 6:57 AM

Khosta-2: New Covid-like virus found in Russian bats - Sakshi

వాషింగ్టన్‌: సార్స్‌–కోవ్‌–2.. అంటే కోవిడ్‌–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గలేదు. అచ్చంగా కోవిడ్‌–19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేవని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది.

వీటిలో ఖోట్సా–2 అనే వైరస్‌లో స్పైక్‌ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని కణాల్లోకి చొచ్చుకుపోయి, విషపూరితం చేస్తాయని తేల్చారు. కరోనా వైరస్‌లలో (సార్బీకోవైరస్‌లు) ఖోట్సా–2, సార్స్‌–కోవిడ్‌–2 అనేవి ఒకే ఉప కేటగిరీకి చెందినవని పరిశోధకులు చెప్పారు. అధ్యయనం వివరాలను ప్లాస్‌ పాథోజెన్స్‌ పత్రికలో ప్రచురించారు. కేవలం సార్స్‌–కోవ్‌–2 వంటి వేరియంట్లను నియంత్రించడానికి కాదు, సార్బీకోవైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్ట్‌ మైఖేల్‌ లెట్కో చెప్పారు. ఖోట్సా–2 వైరస్‌ వ్యాపిస్తే మనుషులకు తీవ్ర అనారోగ్యం ముప్పుందని గుర్తించారు. కోవిడ్‌–19, ఖోట్సా–2 లాంటి వైరస్‌లు ప్రొటీన్‌ స్పైక్‌ల సాయంతో మనుషులపై దాడి చేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement