Odisha Road Accident Today: Five Killed In Truck And Auto Incident At Kamakhyanagar - Sakshi
Sakshi News home page

Odisha Road Accident Today: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి 

Published Sun, Aug 28 2022 8:51 AM | Last Updated on Sun, Aug 28 2022 12:17 PM

Five Killed Truck Hits Auto At Kamakhyanagar Odisha - Sakshi

ఫుల్‌ స్పీడ్‌లో ఉన్న ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. డెంకానల్‌ జిల్లాలోని కామక్యానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో మైనర్​ సహా ఐదుగురు మృతి చెందారు. కాగా, మృతులంతా బంగూర గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆటోలో పని నిమిత్తం ముక్తపేసి ప్రాంతానికి వెళ్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement