
భువనేశ్వర్: ఒడిశాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కియోంజర్ జిల్లాలో శక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 20వ జాతీయ రహదారి బలిజోడి గ్రామ సమీపంలో ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందుకున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కలకత్తా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి జీపు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం గాలిస్తున్నారు.
ఘటగావ్‌లో ఉన్న మాతా తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. వారంతా గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందినవారని వెల్లడించారు. బాధితుల్లో పలువురు మాజీ రాజ్యసభ సభ్యుడు రేణుబాల ప్రధాన్ బంధువులు కూడా ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment