షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు సజీవ దహనం | two burned alive of the Short-circuit | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు సజీవ దహనం

Published Thu, Mar 5 2015 4:53 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

two burned alive of  the  Short-circuit

హైదరాబాద్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఓ చిన్నారితోపాటు రక్షించబోయిన మరో వ్యక్తి మృత్యువు పాలయ్యారు. సలీంనగర్ కాలనీలో రియాజుద్దీన్ అనే వ్యక్తి భార్య సమీరా బేగం, కుమార్తెలు అప్సాబేగం, బుస్రా (8 నెలలు)తో కలసి నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రియాజుద్దీన్ ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సమీరాబేగం పెద్దకుమార్తెతో బయటకు వచ్చేసింది.

చిన్న కుమార్తె బుస్రాను కాపాడేందుకు యత్నించగా దట్టమైన పొగలు, మంటలు అప్పటికే ఇంటిని కమ్మేశాయి. పక్కింట్లో నివసించే సయ్యద్ మహబూబ్ అలీ అస్మీ (55) చిన్నారిని రక్షించేందుకు ఇంట్లోకి వెళ్ళాడు. మంటలు వ్యాపించడంతో బయటకి రాలేకపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం లోపలికి వెళ్లగా అస్మీ, బుస్రా విగతజీవులై కనిపించారు. వారిద్దరి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement