మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు | Pregnant Minor Girl Burned by Lover in Bihar | Sakshi
Sakshi News home page

మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు

Published Wed, Dec 11 2019 12:38 PM | Last Updated on Wed, Dec 11 2019 12:50 PM

Pregnant Minor Girl Burned by Lover in Bihar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : ఇటీవల దేశంలో జరిగిన ఉన్నావ్‌, దిశ ఘటనలపై ప్రజల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా, మంగళవారం బీహార్‌లో ఉన్నావ్‌ తరహా ఘటన చోటుచేసుకుంది. బెట్టయ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఒక యువకుడు మైనర్‌ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక ఒకనెల గర్భంతో ఉండగా, యువకుడిని పెళ్లి చేసుకోమని కోరింది. ఈ నేపథ్యంలో పెళ్లికి నిరాకరించిన యువకుడు, తన స్నేహితులతో కలిసి ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో స్పందించిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు పాట్నాకు తీసుకెళ్లమని సూచించారు. పాట్నాకు వెళ్లేదారిలో బాధితురాలు 80 శాతం కాలిన గాయాలతో మంగళవారం మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement