minor girl pregnant
-
భార్యకు గర్భం.. భర్తకు జైలు
మైసూరు: మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు హాడి గ్రామానికి చెందిన నాగేష్ (25) అనే యువకుడు ఆదే గామానికి చెందిన మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్నాడు, బాలిక ఇటీవల గర్భం దాల్చడంతో విషయం పోలీసులకు చేరి భర్తపై పోక్సో కేసు పెట్టారు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన బాలిక (16)తో నాగేష్కు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. బాలిక గర్భవతి కావడంతో అన్నూరు పిహెచ్సీలో వైద్య పరీక్షల కోసం వెళ్లింది. వైద్యురాలు బాలికకు ఇంకా మైనారిటీ తీరలేదని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్లు నిండాకుండా పెళ్లి చేయడం, గర్భవతిని చేయడం చట్ట విరుద్ధం కాబట్టి, పోలీసులు నాగేష్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
మైనర్ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలు?
సాక్షి, మరిపెడ(వరంగల్): ఓ గిరిజన మైనర్ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలుగా పెద్ద మనుషులు నిర్ణయించినట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధి బొత్తలతండాకు చెందిన ఓ మైనర్ బాలికను అదే తండాకు చెందిన వరుసకు సోదరుడైన వివాహిత వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పెద్దమనుషులను సంప్రదించారు. వారు ఇరువురిని పిలిపించి మాట్లాడి గర్భవతిని చేసిన సదరు వ్యక్తికి రూ.8లక్షలు పరిహారం చెల్లించాలని తీర్మానం చేసినట్లు తెలిసింది. చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్ల కేసు: సోదరి బాల్య స్నేహన్ని వాడుకుని.. -
మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్
గతంలో టిక్‌టాక్ యాప్ ద్వారా ఎంతోమంది సామాన్య ప్రజానీకం కూడా ఫేమస్ అయ్యారు. ఒకదశలో ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ పిచ్చిలో జనాలు మునిగిపోయారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు దానికి ఎంత క్రేజ్ ఉంది అనేది. అయితే గత ఏడాది దేశ భద్రత కారణాల రీత్యా కేంద్రం మన దేశంలో చైనాకు చెందిన అనేక యాప్ లను బ్యాన్ చేసింది. అందులో ఇది ఒకటి. దీంతో కోట్ల మంది ఔత్సాహికులు డీలా పడిపోయారు. అయితే టిక్‌టాక్ తో చాలా మంది ఫేమస్ కావడమే కాకుండా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. అయితే, టిక్‌టాక్ ద్వారా వచ్చిన ఫేమస్ అడ్డుపెట్టుకొని కొద్దీ మంది చెడు పనులు కూడా చేస్తున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భం దాల్చిన కేసులో ఒక టిక్‌టాక్ స్టార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అంబిలి అకా విఘ్నేష్ కృష్ణను అరెస్టు చేసి పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విగ్నేష్ కృష్ణకు గత ఏడాది 17 ఏళ్ల ఓ బాలికతో సోషల్ మీడియా ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పుడప్పుడు వారు బయట కలుసకునేవారు. అలా ఓరోజు బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో విగ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను పరారీ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. విఘ్నేష్ కృష్ణ విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు ప్లాన్ లో భాగంగా పాస్ పోర్ట్ సిద్దంగా ఉందని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. తన తండ్రి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పాస్‌పోర్ట్ విషయం గురించి విఘ్నేష్ కృష్ణకు తెలియజేశాడు. అతని తండ్రిని అనుసరిస్తున్న పోలీసులు విఘ్నేష్ కృష్ణను పట్టుకున్నారు. విచారణ తరువాత అతన్ని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెను చెల్లి అని సంబోధిస్తూనే అతను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం -
గర్భం దాల్చిన మైనర్ బాలిక
జగిత్యాల : ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసి ఆమె మృతికి కారణమైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. బాలికకు పురిటినొప్పులు రావడంతో బాలిక తల్లి ఇంట్లోనే స్వంత వైద్యం చేసింది. ఈ ఘటనలో బాలికతో పాటు శిశువు కూడా మరణించగా రెండు రోజుల క్రితం మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు శవాలను వెలికితాశారు. బాలిక మృతికి పరోక్షంగా కారణమైన ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఉదంతంపై స్థానికులతో పాటు దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి) -
మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు
పాట్నా : ఇటీవల దేశంలో జరిగిన ఉన్నావ్, దిశ ఘటనలపై ప్రజల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా, మంగళవారం బీహార్‌లో ఉన్నావ్ తరహా ఘటన చోటుచేసుకుంది. బెట్టయ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఒక యువకుడు మైనర్ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక ఒకనెల గర్భంతో ఉండగా, యువకుడిని పెళ్లి చేసుకోమని కోరింది. ఈ నేపథ్యంలో పెళ్లికి నిరాకరించిన యువకుడు, తన స్నేహితులతో కలిసి ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో స్పందించిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు పాట్నాకు తీసుకెళ్లమని సూచించారు. పాట్నాకు వెళ్లేదారిలో బాధితురాలు 80 శాతం కాలిన గాయాలతో మంగళవారం మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. -
బాలికను తల్లిని చేసిన తాత?
జగిత్యాలక్రైం: వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలిక(15)ను పక్కింట్లో ఉంటున్న వరుసకు తాత అయిన వృద్ధుడు(65) వంట చేయమని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాలిక నాలుగు నెలల గర్భిణి కావడంతో విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని పురాణిపేటకు చెందిన బాలిక ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మొన్నటి వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికను పక్కింట్లో ఉంటున్న వరుసకు తాత అయిన వ్యక్తి వంట చేయమని పిలిచి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక గోప్యంగా ఉంచింది. విద్యాసంవత్సరం ప్రారంభమై స్కూలుకు వెళ్లిన బాలిక పక్షంరోజుల నుంచి అస్వస్థతతో ఉంటోంది. ఈనెల 12 కడుపునొప్పికి గురికావడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలికను ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు నాలుగునెలల గర్భిణిగా తేల్చారు. బాలికను తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. అయితే అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడే తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులుపై ఫిర్యాదు చేశాడు. బాలిక తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
బందరులో బాలికపై లైంగికదాడి!
సాక్షి, కోనేరు (మచిలీపట్నం): ఓ ప్రబుద్ధుడి కామవాంఛకు 13 సంవత్సరాల మైనర్ బాలిక గర్భం దాల్చింది. వరుసకు అన్నయ్య అయినా కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్ బాలిక పై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, పోలీస్ అధికారులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. ఇనుగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల కథ నం ప్రకారం.. మచిలీపట్నం టౌన్‌లోని ఓగీసుపేటకు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికకు వరుసకు అన్న అయిన మోహన్‌కుమార్ మాయమాటలు చెబుతూ కొంత కాలంగా ఆమెపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక బుధవారం నీరసంగా ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి బాలి కను నిలదీయగా అసలు విషయం చెప్పింది. తినుబండారాలు కొనిపెడానంటూ నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు చెప్పింది. విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఐసీడీఎస్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు, అధికారులు ఓగీసుపేట చేరుకుని బాలిక నుంచి వివరాలు సేకరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఐదు నెలల గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అఖిల్‌జమా తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
కూతురిని గర్భవతిని చేసిన తండ్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలో ఘోరం జరిగిపోయింది. వావి వరుసలు మరిచి కన్నతండ్రే తన సొంత కూతురి(12)పై అత్యాచారం చేసిన దారుణ సంఘటన బుట్టాయిగూడెంలో వెలుగు చూసింది. గత కొంతకాలంగా తండ్రి చేసిన ఈ దుర్మార్గం వల్ల ఆ మైనర్ బాలిక గర్భవతి అయింది. ఈ విషయం తల్లికి చెబితే చంపుతానంటూ ఆ బాలికను బెదిరించాడు. కానీ, ఎలాగోలా తెలుసుకున్న ఆబాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడకి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై కామాంధుడు దుశ్చర్య
కర్ణాటక, కోలారు: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషికి 10 సంవత్సరాల జైలు, 11 వేల రూపాయల జరిమానా విధిస్తూ రెండవ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. తాలూకాలోని సింగండహళ్లి గ్రామానికి చెందిన యువకుడు, ప్రైవేటు ఉద్యోగి అయిన శ్రీనాథ్ (25) శిక్షకు గురైన వ్యక్తి. ఇతను బంగారుపేట తాలూకా సొరెగౌడనకోట గ్రామానికి చెందిన బాలిక పక్క ఇంట్లో నివాసం ఉండేవాడు. బాలిక తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో శ్రీనాథ్ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక పోషకులు బంగారుపేట పోలీస్ స్టేషన్లో 2017 జనవరి 31న ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు శ్రీనాథ్‌పై పోక్సో కేసు దాఖలు చేసి దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బిఎస్ రేఖ ఈ మేరకు తీర్పు వెలువరించారు. -
బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు
బాలికను గర్భవతిని చేసిన పాల వ్యాపారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ వేలూరు జిల్లా ప్రత్యేక మహిళా కోర్టులో తీర్పునిచ్చారు. వేలూరు జిల్లా ఆనకట్టు నియోజకవర్గంలోని కన్నికాపురం గ్రామానికి చెందిన ఏయుమలై(28) పాల వ్యాపారి. గత సంవత్సరం జనవరిలో అదే గ్రామానికి చెంది న 15 ఏళ్ల బాలిక కు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దీని గురించి తెలియని ఆ బాలిక మత్తు నుంచి స్పృహలోకి వచ్చిన తరువాత తన దారిన తాను వెళ్లిపోయింది. ఆ తరువాత గర్భం దాల్చింది. విషయం తెలుసున్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. బాలికను వద్ద విచారించగా పాల వ్యాపారి ఏయుమలై మత్తు మందు ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే తల్లిదండ్రులు వేలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఏయుమలైను అరెస్ట్ చేశారు. అనంతరం సత్‌వచ్చారిలోని ప్రత్యేక మహిళా కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నజీర్ అహ్మద్ విచారణ జరిపి ఏయుమలైకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. అదే విధంగా బాలిక కు 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు.