బాలికను గర్భవతిని చేసిన పాల వ్యాపారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ వేలూరు జిల్లా ప్రత్యేక మహిళా కోర్టులో తీర్పునిచ్చారు. వేలూరు జిల్లా ఆనకట్టు నియోజకవర్గంలోని కన్నికాపురం గ్రామానికి చెందిన ఏయుమలై(28) పాల వ్యాపారి. గత సంవత్సరం జనవరిలో అదే గ్రామానికి చెంది న 15 ఏళ్ల బాలిక కు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దీని గురించి తెలియని ఆ బాలిక మత్తు నుంచి స్పృహలోకి వచ్చిన తరువాత తన దారిన తాను వెళ్లిపోయింది.
ఆ తరువాత గర్భం దాల్చింది. విషయం తెలుసున్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. బాలికను వద్ద విచారించగా పాల వ్యాపారి ఏయుమలై మత్తు మందు ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే తల్లిదండ్రులు వేలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఏయుమలైను అరెస్ట్ చేశారు. అనంతరం సత్‌వచ్చారిలోని ప్రత్యేక మహిళా కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నజీర్ అహ్మద్ విచారణ జరిపి ఏయుమలైకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. అదే విధంగా బాలిక కు 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు.