గతంలో టిక్‌టాక్ యాప్ ద్వారా ఎంతోమంది సామాన్య ప్రజానీకం కూడా ఫేమస్ అయ్యారు. ఒకదశలో ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ పిచ్చిలో జనాలు మునిగిపోయారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు దానికి ఎంత క్రేజ్ ఉంది అనేది. అయితే గత ఏడాది దేశ భద్రత కారణాల రీత్యా కేంద్రం మన దేశంలో చైనాకు చెందిన అనేక యాప్ లను బ్యాన్ చేసింది. అందులో ఇది ఒకటి. దీంతో కోట్ల మంది ఔత్సాహికులు డీలా పడిపోయారు. అయితే టిక్‌టాక్ తో చాలా మంది ఫేమస్ కావడమే కాకుండా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. అయితే, టిక్‌టాక్ ద్వారా వచ్చిన ఫేమస్ అడ్డుపెట్టుకొని కొద్దీ మంది చెడు పనులు కూడా చేస్తున్నారు.
తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భం దాల్చిన కేసులో ఒక టిక్‌టాక్ స్టార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అంబిలి అకా విఘ్నేష్ కృష్ణను అరెస్టు చేసి పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విగ్నేష్ కృష్ణకు గత ఏడాది 17 ఏళ్ల ఓ బాలికతో సోషల్ మీడియా ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పుడప్పుడు వారు బయట కలుసకునేవారు. అలా ఓరోజు బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో విగ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు.
బాలిక గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను పరారీ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. విఘ్నేష్ కృష్ణ విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు ప్లాన్ లో భాగంగా పాస్ పోర్ట్ సిద్దంగా ఉందని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. తన తండ్రి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పాస్పోర్ట్ విషయం గురించి విఘ్నేష్ కృష్ణకు తెలియజేశాడు. అతని తండ్రిని అనుసరిస్తున్న పోలీసులు విఘ్నేష్ కృష్ణను పట్టుకున్నారు. విచారణ తరువాత అతన్ని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెను చెల్లి అని సంబోధిస్తూనే అతను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment