Vignesh
-
భర్త సినిమా నుంచి తప్పుకున్న నయనతార..
-
Nayanthara - Vignesh Shivan: న్యూబిగినింగ్స్ అంటూ నయనతార దంపతుల పూజలు! (ఫోటోలు)
-
ఫ్లై ఓవర్ పై.. అదుపుతప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: మితి మీరిన వేగంతో ఫ్లై ఓవర్ రెయిలింగ్‌ను ఢీ కొట్టి కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, కల్వాల గ్రామానికి చెందిన విగ్నేష్(24) శ్రీరాంనగర్‌లో ఉంటూ డ్రైవింగ్ యాప్‌లో రైడర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితుడు మనీష్‌కు తెలియకుండా అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని బయటికి వచ్చాడు. కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి కుడివైపు రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోగా విగ్నేష్ ఎగిరి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విగ్నేష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నయనతార పెళ్లి వీడియో ఏమైంది ?
-
ఎయిర్‌పోర్టుల్లో ‘బిచ్చగాడు’.. ఓ యువకుడి నకిలీ యాచన!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు కూడళ్లు, ప్రార్థనా స్థలాలు, ఫంక్షన్ హాళ్లు తదితర చోట్ల యాచకులను చూస్తూనే ఉంటాం. వృద్ధాప్యం వల్లో లేదా శారీరక వైకల్యం వల్లో యాచించే వారు కొందరైతే దీన్నే దందాగా మార్చుకొని జీవించే వారు ఇంకొందరు కనిపిస్తుంటారు. కానీ ఇలా రోజంతా అడుక్కున్నా ఎవరికైనా లభించేది చిల్లరే... అందుకే సులువుగా నోట్ల కట్టలు సంపాదించేందుకు ఓ యువకుడు ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకొని ‘బిచ్చగాడి’అవతారం ఎత్తాడు! శంషాబాద్ ఎయిర్పోర్ట్ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులు సహా అనేక మంది నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పర్సు పోవడంతో ఎదురైన అనుభవంతో.. చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్... బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు. ముందస్తు షెడ్యూల్‌తో ముష్టి కోసం.. విమానాశ్రయాలనే టార్గెట్‌గా చేసుకొని ప్రయాణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విఘ్నేష్ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్ విమాన టికెట్లు బుక్ చేసుకొనేవాడు. ఖరీదైన క్యాజువల్స్ ధరించి, చేతిలో లగేజ్ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్ షెడ్యూల్ టైమ్‌కు దాదాపు 4–5 గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్ (సైలెంట్ మోడ్‌లో ఉంచి) మాట్లాడినట్లు నటించేవాడు. తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. ఇప్పటివరకు ఫిర్యాదులులేకపోవడంతో.. ఈ పంథాలో విఘ్నేష్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. విఘ్నేష్ మోసగించిన వారిలో అత్యధికులు విదేశీయులే కావడంతో వారికి ఇది మోసమని తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నే‹Ùను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ హైదరాబాద్‌లో సాగించిన ‘భిక్షాటన’గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
రెండిళ్లు కొనుగోలు చేసిన నయనతార.. ఇంటీరియర్ డిజైన్‌కే రూ.25 కోట్లు!
దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ను వివాహం చేసుకుని ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నయనతార . తాజాగా ఆమె చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలో పోయెస్ గార్డెన్ అంటే సెలబ్రెటీలకు కేరాఫ్. పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్, జయచిత్ర ఇళ్లతో పాటు జయలలిత నివాసం వేద నిలయం ఎదురుగా ఆమె నెచ్చెలి శశికళ సైతం ఓ భారీ బంగ్లాను కట్టించారు. (చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య) లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి పోయెస్‌గార్డెన్‌లోనే నివాసం ఉండేందుకు సిద్ధమైంది. నయనతార కొనుగోలు చేసిన ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని సమాచారం. వీటిని బాలీవుడ్ స్టార్స్ ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే ఒక ప్రముఖ సంస్థ రూ.25 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఇంటిలో 1500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్‌పూల్, నయనతార, విఘ్నేష్‌శివన్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరికొత్తగా నిర్మించనున్న ఇళ్లలోకి నయనతార, విఘ్నేష్‌శివన్ జంట త్వరలోనే ప్రవేశించనున్నట్లు ప్రచారం. -
మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్
గతంలో టిక్‌టాక్ యాప్ ద్వారా ఎంతోమంది సామాన్య ప్రజానీకం కూడా ఫేమస్ అయ్యారు. ఒకదశలో ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ పిచ్చిలో జనాలు మునిగిపోయారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు దానికి ఎంత క్రేజ్ ఉంది అనేది. అయితే గత ఏడాది దేశ భద్రత కారణాల రీత్యా కేంద్రం మన దేశంలో చైనాకు చెందిన అనేక యాప్ లను బ్యాన్ చేసింది. అందులో ఇది ఒకటి. దీంతో కోట్ల మంది ఔత్సాహికులు డీలా పడిపోయారు. అయితే టిక్‌టాక్ తో చాలా మంది ఫేమస్ కావడమే కాకుండా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. అయితే, టిక్‌టాక్ ద్వారా వచ్చిన ఫేమస్ అడ్డుపెట్టుకొని కొద్దీ మంది చెడు పనులు కూడా చేస్తున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భం దాల్చిన కేసులో ఒక టిక్‌టాక్ స్టార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అంబిలి అకా విఘ్నేష్ కృష్ణను అరెస్టు చేసి పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విగ్నేష్ కృష్ణకు గత ఏడాది 17 ఏళ్ల ఓ బాలికతో సోషల్ మీడియా ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పుడప్పుడు వారు బయట కలుసకునేవారు. అలా ఓరోజు బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో విగ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను పరారీ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. విఘ్నేష్ కృష్ణ విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు ప్లాన్ లో భాగంగా పాస్ పోర్ట్ సిద్దంగా ఉందని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. తన తండ్రి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పాస్‌పోర్ట్ విషయం గురించి విఘ్నేష్ కృష్ణకు తెలియజేశాడు. అతని తండ్రిని అనుసరిస్తున్న పోలీసులు విఘ్నేష్ కృష్ణను పట్టుకున్నారు. విచారణ తరువాత అతన్ని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెను చెల్లి అని సంబోధిస్తూనే అతను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం -
పోలీస్ చెంప చెళ్లుమనిపించిన నటి సోదరుడు
పెరంబూరు: శృంగార నటి బాబీలోనా సోదరుడు విఘ్నేశ్కుమార్ పోలీస్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సోమవారం రాత్రి స్థానిక సాలిగ్రామం, దశరదపురం 9వ వీధిలో ఒక వ్యక్తి గొడవ చేస్తున్న సమాచారం పోలీసులకు అందింది.ఆ ప్రాంత సబ్ఇన్స్పెక్టర్ పళనిశంకర్ పోలీసును తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ యువకుడు(30) మద్యం సేవించి రగడ చేస్తుండడం కనిపించింది. పోలీసులు అతని వద్దకు వెళ్లి ఇంటికి వెళ్లమని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న విఘ్నేశ్కమార్ అక్కడ నుంచి వెళ్లకపోగా పోలీసులకే ఎదురు తిరిగి శంకర్ అనే పోలీసు చెంపపై కొట్టాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సబ్ఇన్స్పెక్టర్ పళని, శంకర్ అనే పోలీసు అతన్ని అరెస్ట్‌చేసి సాలిగ్రామం పోలీస్ స్టేషన్‌కు తీసకెళ్లారు. అక్కడ అతన్ని విచారించగా తను శ్రుంగార నటి బాబీలోనా సోదరుడు అని తెలిసింది. పోలీస్‌పై చేయి చేసుకున్న నేరం కింద కేసు నమోదు చేసి విఘ్నేశ్కుమార్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ఓ యువకుడు పెట్టిన పోస్టు ఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది. ఈ పోస్టు కారణంగా ఆ యువతి, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడడంతో విధ్వంసకర పరిస్థితి చోటుచేసుకుంది. సాక్షి, చెన్నై: ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫొటోలను మార్పింగ్ చేయడం, వారి పరువును బజారు కీడ్చే రీతిలో వ్యవహరించే మృగాళ సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ఇలాంటి పోస్టింగ్‌ల కారణంగా ఆ యువతులు, ఆ కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురి కావడమే కాదు, బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో పట్టుబడే వారితో కఠినంగా వ్యవహరించకపోవడం కాబోలు, తప్పుల మీద తప్పులు చేస్తూ యువతుల జీవితాలతో చెలగాటం ఆడే వారి సంఖ్య పెరుగుతున్నదని చెప్పవచ్చు. అలాగే, పోలీసులు సైతం సామాజిక వర్గాల నేతల ఒత్తిళ్లతో పట్టుబడే వారిని మందలించి వదలి పెట్టడం, ఆ తదుపరి తీవ్ర పరిణామాలు ఎదురైన పక్షంలో పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా కడలూరులో ఘటన వెలుగుచూసింది. మొదటి నుంచి వేధింపులు.... కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌కుప్పంకు చెందిన నీలకంఠం కుమార్తె రాధిక (20) కడలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కళాశాలలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెను అదే ప్రాంతానికిచెందిన పన్నీరు కుమారుడు ప్రేమ్‌కుమార్ టీజింగ్‌లతో వేధించే వాడు. తొలుత పెద్దగా పట్టించుకోనప్పటికీ, చివరకు అతడి చర్యలు శ్రుతిమించడంతో రాధికకు మనోవేదన తప్పలేదు. ఫేస్ బుక్‌లోనూ వేధించడం మొదలెట్టడంతో తనలోని ఆగ్రహాన్ని రాధిక బయటపెట్టింది. ఫేస్బుక్ ద్వారానే ప్రేమ్‌కుమార్‌కు చీవాట్లు పెట్టింది. అయితే, ప్రేమ్‌కుమార్ మరింత ఆగ్రహానికిలోనై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరి మధ్య తొలుత ఫేస్బుక్లో పెద్ద సమరమే సాగింది. చివరకు విసిగి వేసారిన రాధిక ఈ వేధింపుల గురించి తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో ప్రేమ్‌కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం అన్నది ఇరు సామాజిక వర్గాల మధ్య సమరం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనేతలు, పెద్దల జోక్యంతో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు మందలించి వదలి పెట్టారు. మారుతాడుకుంటే..కక్ష కట్టాడు... పోలీసులు మందలించడంతో ప్రేమ్‌కుమార్ మారతాడని రాధిక భావించింది. అయితే, ఆమెపై అతగాడు కక్ష పెంచుకోవడమే కాదు, ఆమె పరువు బజారుకీడ్చేందుకు తగ్గ సమయం కోసం వేచి చూసినట్టున్నాడు. ఈ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో వడలూరు పార్వతీపురంలో ఉన్న మేనత్త కుమారుడు విఘ్నేష్(23) ప్రేమలో రాధిక పడింది. ఈ ఇద్దరు తిరుగుతుండడం కుటుంబీకుల దృష్టికి చేరింది. ఇరు కుటుంబాల పెద్దలు ఆ ఇద్దరికి వివాహం చేయడానికి నిర్ణయించారు. చదువులు పూర్తి అయ్యాక పెళ్లి చేద్దామన్నట్టుగా ముందుకు సాగారు. దీంతో రాధిక, విఘ్నేష్‌ల ఆనందానికి హద్దే లేదని చెప్పవచ్చు. అయితే, ఈ ఆనందాన్ని ఆవిరి చేయడమే కాదు, ఆ ఇద్దరి పెళ్లి జరగకూడదని, ఇరు కుటుంబాల మధ్య వివాదాన్ని రేపే రీతిలో తనలోని మానవ మృగాన్ని ప్రేమ్‌కుమార్ బయటకు తీశాడు. సమయం కోసం వేచి ఉన్న ప్రేమ్‌కుమార్ కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో రాధిక ఫొటోలను మార్ఫింగ్ చేసే పనిలో పడ్డారు. అ సభ్యకరంగా ఉన్న ఆ ఫోటోలను ఫేస్బుక్లో పెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న రాధిక తీవ్ర మనస్తాపానికి గురి అయింది. తన పరువు బజారుకెక్కడంతో కలత చెంది సోమవారం ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణం తెలుసుకున్న కుటుంబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రేమ్‌కుమార్ ఇళ్లు, వారి బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం భగ్గుమనడంతో పరస్పరం దాడులు సాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేయత్నం చేశారు. అదే సమయంలో రాధిక ఆత్మహత్య చేసుకున్న సమాచారం చెవిన పడడంతో విఘ్నేష్ మనోవేదనలో పడ్డారు. రాధిక లేని జీవితం తనకు వద్దు అని భావించినట్టున్నాడు. సెంగం పాళయం వద్ద ఓ చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు విఘ్నేష్ వేలాడుతుండడాన్ని చూసిన అటు వైపుగా వెళ్లిన వారు ఆందోళనకు లోనయ్యారు. కిందకు దించగా, అప్పటికే మరణించి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ్‌కుమార్ పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా రాధికా, విఘ్నేష్ ఆత్మహత్య చేసుకోవడం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. రోడ్డెక్కిన ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ప్రేమ్‌కుమార్ సామాజిక వర్గానికి చెందిన వారి వాహనాలపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడలూరు జిల్లా యంత్రాంగం బలగాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. చివరకు మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసే వరకు మృతదేహాల్ని తీసుకోబోమని తేల్చడంతో అతడి కోసం వేట మొదలెట్టారు. తన కోసం పోలీసులు గాలిస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం కోర్టులో ప్రేమ్‌కుమార్ లొంగిపోయాడు. దీంతో ఇద్దరి మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆ గ్రామంలో పరిస్థితి మరలా అదుపు తప్పకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాగా, ఈ వ్యవహారంపై పీఎంకే నేత రాందాసు తీవ్రంగానే స్పందించారు. ఇప్పుడు ఎవరు ఎవర్ని వేధిస్తున్నారో అన్నది స్పష్టం అవుతుందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలకు భద్రత అన్నది కరువు అవుతోందని, ఇప్పుడు ఇద్దర్నిపొట్టన పెట్టుకున్న ప్రేమ్‌కుమార్ లాంటి వారితో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా, లేదా అని పరోక్షంగా వీసీకే నేత తిరుమావళవన్‌ను హెచ్చరించడం గమనార్హం. -
వాట్సాప్‌లో సీఎంకు బెదిరింపులు
వేలూరు: పాలారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రిని, కలెక్టర్‌ను బెదిరిస్తూ వాట్సాప్‌లో పోస్ట్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లా వాలాజ సమీపంలోని తిరుమలచ్చేరి గ్రామానికి చెందిన విఘ్నేష్(31) ఎమ్మెస్సీ వరకు చదువుకుని ఖాళీగా ఉంటున్నాడు. వాలాజ వీసీ మోటూరు, రాణిపేట, ఆర్కాడు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో విఘ్నేష్ తరచూ ఫిర్యాదులు అందజేసేవాడు. ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్బ జలాలు అడుగంటి పోయి ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారంటూ, దానిని అరికట్టాలని కోరేవాడు. అయితే, అతడి ఫిర్యాదులకు అధికారులు స్పందించకపోవటంతో విఘ్నేష్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన సెల్ వాట్సాప్‌లో ఇసుక రవాణాను అరికట్టటానికి సీఎం పళనిస్వామి, కలెక్టర్ రామన్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ బెదిరింపులు స్పురించేలా మాట్లాడి తన మిత్రులకు పోస్ట్ చేశాడు. వీటిపై వీఏవో సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు విఘ్నేష్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
బలిదానం!
విఘ్నేష్ ఆత్మాహతితో పరిస్థితి ఉద్రిక్తం శోకసంద్రంలో కుటుంబం నేడు అంత్యక్రియలు తిరువారూర్‌లో భద్రత కట్టుదిట్టం సాక్షి, చెన్నై: కావేరి జలాల వివాదం నేపథ్యంలో విఘ్నేష్ ఆత్మాహుతికి పా ల్పడడం తమిళనాడులో ఉద్రిక్తతకు కారమవుతోంది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేపింది. తమిళులకు భాషాభిమానం ఎక్కువే. ప్రపంచ దే శాల్లో ఎక్కడైనా తమిళుడికి చిన్న హాని జరిగినా, తమిళనాట నిరసనలు భగ్గుమంటాయి. శ్రీలంకలో యుద్ధం సమయంలో తమిళులపై సాగిన నరమేథం ఇక్కడి హృదయాల్ని పిండేశాయి. నిరసనల హోరు ఓ వైపు అప్పట్లో సాగితే, ముత్తుకుమార్ ఆత్మాహుతి బలిదానం కలకలాన్ని రేపాయి. తదుపరి పదుల సంఖ్యలో ఆ బాటను అనుసరించిన తమిళాభిమానులు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో జల వివాదం రేపిన చిచ్చు తమిళులపై ప్రతాపానికి దారి తీయడం, ఇక్కడి వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. కర్ణాటక చర్యల్ని ఎండగడుతూ తమిళాభిమానులు, రాజ కీయ పక్షాలు కదిలాయి. ఈ నిరసనల్లో ఎవరైనా ఆత్మాహుతి, ఆత్మహత్యాయత్నాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడుతారేమోనన్న బెంగ సర్వత్రా వెంటాడుతూ వచ్చింది. ఆ ప్రయత్నాల జోళికి ఎవ్వరూ వెళ్లకూడదని ప్రార్థించారు. , అది పునరావృతం అయినట్టుగా గురువారం నామ్ తమిళర్ కట్చి ర్యాలీలో ఘటన చోటు చేసుకుంది. అమరుడు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సీని దర్శకులు అమీర్, చేరన్ల నేతృత్వంలో గురువారం సాయంత్రం చెన్నైలో కావేరి జలాల కోసం గళం విప్పుతూ సాగిన భారీ ర్యాలీలో విఘ్నేష్ అనే యువకుడు కావేరి కోసం తనను తాను ఆర్పించుకుని ఆహుతి కావడం కలకలాన్ని రేపింది. తీవ్రగాయాలతో చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విఘ్నేష్ శుక్రవారం ఉదయం పద కొండున్నర సమయంలో విగత జీవిగా మారడం నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని, అతడి కుటుంబీకుల్ని శోక సంద్రంలో ముంచింది. విఘ్నేష్ ఇక లేడన్న సమాచారంతో, ఇలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయవద్దంటూ రాజకీయ పక్షాలు తమిళాభిమానులకు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి. అలాగే, రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేయవద్దని నాయకులకు ప్రజా సంఘాలు విన్నవించే పనిలో పడ్డాయి. విఘ్నేష్ తనకు సోదరుడు లాంటి వాడు అని, అతడు బతికి ఉంటే, కుటుంబానికి ఏమి చేసి ఉంటా డో అదే తాను చేస్తానని ఈసందర్భంగా సీమాన్ వ్యాఖ్యానించారు. విఘ్నేష్ భౌతిక కాయం వద్ద సీమాన్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. వీసీకే నేత తిరుమావళవన్ అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ప్రజా సంఘాలు, తమిళాభిమాన సంఘాల నాయకులు తరలి రా వడంతో కీల్పాకం ఆసుపత్రి ఆవరణలో ఉత్కంఠ నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున బలగాల్ని అక్కడ మోహరింప చేశారు. నేడు అంత్యక్రియలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని గోపాల సముద్రం గ్రామానికి చెందిన పాండియన్, షెన్బగలక్ష్మి దంపతుల కుమారుడు విఘ్నేష్. అతడి జనని సోదరి ఉన్నారు. నామ్ తమిళర్ కట్చి తిరువారూర్ ఉత్తరం జిల్లా విద్యార్ధి విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తూ, చెన్నై అంబత్తూరులోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. సీమాన్ మీద గౌరవం, తమిళాభిమానం నాలుగు రాళ్లు తనకు ఎక్కువే అన్నట్టుగా వ్యవహరించే విఘే్న ష బుధవారం తన ఫెస్‌బుక్‌లో ఈ ఆత్మాహుతి గురించి ముందుగానే ప్రకటించి ఉన్నా డు. గురువారం జరిగే ర్యాలీలో కావేరి కోసం ఆత్మాహుతులతో ముందుకు సాగుదామన్న అతడు పిలుపు ఇచ్చి ఉండటం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు పిలుపు నిస్తూ ఓ లేఖను సందించి ఉండటంతో , ఇక , మరో బలిదానం అన్నది రాష్ట్రంలో జరగకూడదన్న అప్రమత్తత పెరిగి ఉన్నది. కాగా, విఘ్నేష్ భౌతిక కాయానికి శని వారం గోపాల సముద్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని చెన్నై నుంచి స్వగ్రామానికి తరలించారు. పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు తమిళాభిమానులు తరలివచ్చే అవకాశంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరువారూర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
జైల్లో ఖైదీ వద్ద సెల్‌ఫోన్
తిరువొత్తియూరు : పుళల్ జైలులో గస్తీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఖైదీ వద్ద సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జైలు ఆవరణలో పడి ఉన్న పార్సిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సదరు పార్సిల్‌ను సిబ్బంది తెరచి చూశారు. అందులో మూడు సెల్ఫోన్లు, చార్జర్లుతోపాటు సిమ్‌కార్డులు, గంజాయి ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి జైలులో ఎవరి కోసం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫోన్ స్వాధీనం చేసుకున్న ఖైదీ విఘ్నేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. -
నెట్లో హల్చల్ చేస్తున్న నయన,విఘ్నేష్‌ల సెల్ఫీ
-
పెళ్లికి నిరాకరించాడని..
వేములపల్లి (నల్లగొండ): వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. కులాలు అడ్డుగోడలయ్యాయో.. మరే కారణమో తెలియదు కానీ.. ప్రియుడు చేసిన బాసలు మరిచిపోయాడు.. పెళ్లికి నిరాకరించాడు.. అతడిని ఒప్పించేందుకు ఆ యువతి చేయని ప్రయత్నమంటూ లేదు.. ప్రాథేయపడింది.. కనికరించలేదు.. పెద్దల ఎదుట తనగోడు వెళ్లబోసుకుంది.. ఫలితం లేదు.. చివరకు పోలీస్‌స్టేషన్ గడప కూడా ఎక్కింది.. శూన్యమే కనిపించింది.. మనస్తాపానికి గురై చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. ఇది తెలిసి భయంతో ప్రియుడు కూడా పురుగులమందు తాగాడు.. సంచలనం సృష్టించిన ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు, ప్రేమికుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదమాం లచ్చయ్య, రాములమ్మ దంపతుల పెద్దకుమార్తె రమణ, ఇదే గ్రామానికి చెందిన వెంకన్న,మంగమ్మల చివరి సంతానం విఘ్నేష్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పదో తరగతి వరకు చదివారు. విఘ్నేష్ వ్యవసాయ పనులు చూసుకుంటుండగా, రమణ కూలీగా చేస్తోంది. మూడేళ్ల క్రితం విఘ్నేష్ వ్యవసాయ బావి వద్ద కూలికి వెళ్లిన రమణకు విఘ్నేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కులాలు అడ్డుగోడలయ్యాయా..? విఘ్నేష్, రమణల కులాలు వేరు. అయినా ఇద్దరు కలిసిమెలసి తిరిగారు. బాసలు చేసుకుని పెళ్లాడాలనుకున్నారు. విషయం పెద్ద వాళ్లకు కూడా తెలిసింది. ఏమైందో తెలియదు కానీ విఘ్నేష్ పెళ్లికి నిరాకరించాడు. కొద్ది రోజులుగా వీరి పెళ్లి విషయమై గ్రామంలో పంచాయితీ కూడా జరుగుతోంది. అయినప్పటికీ విఘ్నేష్ పెళ్లికి ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో రమణ సోమవారం వేములపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే విఘ్నేష్ తరఫు బంధువులు కేసు నమోదు కాకుండా, రెండు రోజుల సమయమిస్తే గ్రామంలోనే మాట్లాడుకుంటామని, పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇచ్చినట్టు సమాచారం. న్యాయం జరగదనేనా..? పెద్ద మనుషుల పంచాయితీలో విఘ్నేష్ పెళ్లికి ఒప్పుకోకపోవడం, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై రమణ ఇంట్లోనే గుళికలు తిన్నట్టు తెలుస్తోంది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన రమణను కుటుంబ సభ్యులు గమనించి మిర్యాలగూడ ఆస్పత్రిలో చేర్పించారు. భయంతో ప్రియుడు.. రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విషయం తెలియడంతో విఘ్నేష్ భయాందోళనకు గురయ్యాడు. ఇంట్లోనే ఇతడు కూడా పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. రమణ ఫిర్యాదు మేరకు విఘ్నేష్‌పై మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
అమ్మకు నమస్కారం...
నవమాసాలు మోసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు... ఆ బిడ్డలనే తమ పంచప్రాణాలుగా భావించుకున్నారు... అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలబడలేదు... ఆ బిడ్డలకు పంచేంద్రియాలు పనిచేయవని తెలుసుకున్నారు... అయినప్పటికీ ఏ మాత్రం దిగాలు పడిపోలేదు... జన్మనిస్తే సరిపోదు... వారికి జీవితాన్ని కూడా ఇవ్వాలి అనుకున్నారు... వారిలోని ప్రత్యేక ప్రతిభను వెలికి తీశారు... స్వయం ఉపాధితో వారు తలెత్తుకునేలా తీర్చిదిద్దారు... ఆ బిడ్డలకు పాతిక ముప్ఫై సంవత్సరాలు నిండినా కన్నతల్లులకు మాత్రం ఇంకా చంటిబిడ్డలే... అలాంటి అయిదుగురు పిల్లల్ని అత్యంత సహనంతో సాకుతున్న అయిదుగురు మాతృమూర్తుల కథ ఇది... మానసిక వికలాంగుల కోసం ‘విద్యాసాగర్’ అనే విద్యాసంస్థ ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇందులో చేరిన పిల్లల్లోని మేధాశక్తిని వెలికి తీసేందుకు ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. ఎన్ని అంగవైకల్యాలు ఉన్నా, ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని ఈ సంస్థ విశ్వాసం. అందుకే ఇక్కడ చేరిన మానసిక వికలాంగులకు వృత్తి విద్యలపై శిక్షణ ఇస్తోంది. ఈ సంగతి తెలిసి, తమిళనాడు నలుమూలల నుండి ప్రత్యేక ప్రతిభావంతులను ఈ విద్యాసంస్థలో చేర్పిస్తున్నారు. అలా పిల్లలను చేర్పించిన వారిలో నలుగురు తల్లులు ఒకరికొకరు పరిచయమయ్యారు. వనజకు లక్ష్మి (30) అనే కుమార్తె, భారతికి విఘ్నేష్ (24), శాంతికి సాయి సంతోష్ (23), కవితకు కార్తిక్ (32) కుమారులు. వీరితో సంతోష్ (30) తండ్రి కుంచితపాదం కూడా కలిశారు. ఈ బిడ్డలు బాగా చదివి ఏదో సాధించాలనే ఆశ వీరికి లేదు. అలాగని వీరిని గాలికి వదిలేయలేరు. మానసిక వికలాంగులైన ఈ బిడ్డలకు ఒక ఉపాధి మార్గం కల్పించాలని ఈ తల్లులంతా కృత నిశ్చయానికి వచ్చారు. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషించారు. ‘‘ఇటువంటి పిల్లలతో ఏమి చేయగలరని మమ్మల్ని కొందరు ఎద్దేవా చేశారు. మేం సాధించాలనుకున్నది అసాధ్యమని కొందరు కొట్టిపారేశారు. తల్లిదండ్రులతో చనువున్నవారైతే ఇటువంటి పిల్లలతో రిస్క్ ఎందుకంటూ తిట్టిపోశారు’’ అని వారు ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు ఆ తల్లులు. కన్నపేగు బంధం వారిలోని పట్టుదలను మరింత బలోపేతం చేసింది. తమ బిడ్డలకు ఇస్తున్న వృత్తి విద్య శిక్షణను తాము కూడా తీసుకున్నారు. దాని నుంచి ‘ఎన్లైటన్ ఎంటర్ప్రైజెస్’ అనే చిన్న ఉత్పత్తుల సంస్థ ఉద్భవించింది. ఈ సంస్థలో రెండేళ్లపాటు శిక్షణ పొందిన వారికి నేషనల్ హాండీక్యాప్డ్ ఫెడరల్ కార్పొరేషన్ సిఫార్సుతో వారి బిడ్డల పేరున సీసీ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ. 2.50 లక్షల పెట్టుబడితో చెన్నై టి-నగర్లో సంస్థను ప్రారంభించారు. ‘‘అరటిబోదెతో భోజనం ప్లేట్లు, కప్పులు, వివాహాది శుభకార్యాలకు వినియోగించే తాంబూలం బ్యాగులు, కవర్లు, ఎన్వలప్‌లు, శారీ బాక్సులు తయారు చేయడం ప్రారంభించాం. మా బిడ్డల్లోని నైపుణ్యాన్ని బట్టి వారికి తగ్గ బాధ్యతలను అప్పగిస్తున్నాం’’ అంటూ వారు స్థాపించిన సంస్థ గురించి వివరించారు. అరటి బోదెలను నీళ్లతో కడిగి మట్టిని తొలగిస్తాడు సాయిసంతోష్. విఘ్నేష్ వాటిని బ్రష్‌తో శుభ్రం చేస్తాడు. కార్తిక్, సంతోష్లలో ఒకరు అందిస్తుంటే మరొకరు ప్రెస్సింగ్ మిషన్‌ను ఆపరేట్ చేస్తారు. ఇలా ఐదు అంచెలుగా ఈ ప్లేట్లను తయారుచేస్తారు. సంస్థలోని తల్లుల్లో ఒకరు వారికి సహకరిస్తారు. ఇలా తయారైన ఉత్పత్తులను శాంతి, భారతి మార్కెటింగ్ చేస్తారు. ‘‘కొందరు బజారుకు వెళ్లినపుడు మిగతావారి పిల్లలను మా సొంత పిల్లల్లాగ చూసుకుంటాం’’ అని వివరించారు అక్కడి మిగతా తల్లులు. ఇంటి దగ్గర సంసార బాధ్యతలను ఉదయాన్నే పూర్తిచేసుకుని, బిడ్డను తీసుకుని పది గంటలకల్లా యూనిట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30కు పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకుంటారు. మానసిక చైతన్యం లేని ఐదుగురిని అదుపు చేయడం మహా కష్టం. ప్రతి ఒక్కరినీ కుర్చీలకు వేసి కట్టేయాల్సిందే. పాతికేళ్లు పైబడిన వారంతా పసిబిడ్డల్లా కోరే బొమ్మలు, ఆట వస్తువులు కొనివ్వాల్సిందే. ‘‘మా సంస్థ కార్యకలాపాలతో ఈ ఐదుగురు బిడ్డలూ ఒకే తల్లి బిడ్డల్లా కలిసిపోయారు. మేమంతా అక్కాచెల్లెళ్లుగా మారిపోయాం. మన కర్మ అని కుంగిపోకుండా ముందుకు సాగిపోతున్నాం’’ అంటున్న వీరు సమాజంలో ఆదర్శ తల్లులుగా నిలిచిపోతారనడంలో సందేహమే లేదు. భవిష్యత్తుకు బాటలు కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తుకు తగిన రీతిలో బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాపారంలో వచ్చిన మొత్తంలో ముందుగా ఒక్కో రుణ వాయిదా కింద రూ.1,400 చొప్పున చెల్లించి, మిగిలిన లాభాన్ని ఐదు సమానభాగాలు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాం. 2012 ఏప్రిల్‌లో తీసుకున్న రుణం మూడేళ్లలో అంటే 2015కు తీరిపోతుంది. అప్పు తీరిపోతే పడిన శ్రమకు మరింత ఫలితం దక్కే అవకాశం ఉంది. అయితే మా ఉత్పత్తులను నిలకడగా కొనుగోలు చేసే వారు లేక ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నాం. ప్రతినెలా వాయిదాలకు సరిపడా సొమ్ము కోసం మేమంతా పాకులాడక తప్పడం లేదు. మనిషి ఎదుగుతున్నా మనసు ఎదగని మా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా శ్రమించేందుకు మేం సిద్ధం. - శాంతి ‘సాక్షి’కి హాయ్ సంతోష్ ప్రత్యేకమైన పరిభాషలో ప్లస్ ఐఐ ఉత్తీర్ణుడయ్యాడు. మిగతా వారితో పోల్చుకుంటే కొంత మెరుగ్గా వ్యవహరించగలడు. తల్లుల హావభావాల ద్వారా ఎవరో వచ్చి తమ కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నట్లు లీలగా గుర్తిస్తాడు. అందరికీ ఫోటోలు తీసి తల్లులతో ఇంటర్వ్యూను ముగించుకుని వెళుతున్న సాక్షి బృందానికి ఒక ప్లాస్టిక్ పలకపై ఉన్న ఏబీసీడీల వరుసలో వేలితో స్పెల్లింగ్ చూపుతూ థ్యాంక్యూ చెప్పాడు. ‘హెచ్ఐ’ అక్షరాలను చూపాడు. - కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై ఫోటోలు: వన్నె శ్రీనివాసులు -
విఘ్నేశ్ శుభారంభం
న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విఘ్నేశ్ శుభారంభం చేశాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లో 7-5, 6-4తో మహ్మద్ ఫరీజ్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అడవెల్లి పార్థసారథి, సాయిశరణ్ రెడ్డి తొలి రౌండ్లోనే ఓడిపోయారు. అన్విత్ బెంద్రే (మహారాష్ట్ర) 6-1, 6-2తో సాయిశరణ్పై, నితిన్ కీర్తనే (మహారాష్ట్ర) 6-1, 6-2తో పార్థసారథిపై గెలిచారు. భువన ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. నాలుగో సీడ్ కాల్వ భువన, తీర్థ ఇస్కా తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. స్నేహదేవి రెడ్డి (తమిళనాడు) 6-2, 6-2తో భువనపై, మాన్యా నాగ్‌పాల్ (ఢిల్లీ) 6-1, 7-5తో తీర్థ ఇస్కాపై విజయం సాధించారు. అబ్దుల్లా, జ్ఞానభాస్కర్ ముందంజ అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టాప్ సీడ్ షేక్ అబ్దుల్లా, పరమాత్ముని వెంకట జ్ఞానభాస్కర్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో అబ్దుల్లా 6-3, 6-3తో అఖిల్ నాగరాజ్ (తమిళనాడు)పై, జ్ఞానభాస్కర్ 6-3, 6-4తో వాసుదేవ్ విజయరామన్ (తమిళనాడు)పై గెలిచారు. మిగతా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పార్థసారథి (ఆంధ్రప్రదేశ్) 4-6, 4-6తో ముకుంద్ శశికుమార్ (తమిళనాడు) చేతిలో; నిఖిల్ మన్నెపల్లి (ఆంధ్రప్రదేశ్) 1-6, 3-6తో పరీక్షిత్ (అస్సాం) చేతిలో ఓడిపోయారు. మూడో రౌండ్లో తీర్థ, సాత్విక, మౌళిక అండర్-18 బాలికల సింగిల్స్‌లో విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తీర్థ ఇస్కా, సామ సాత్విక, మౌళిక రామ్ మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో తీర్థ 6-2, 6-4తో స్నేహల్ మానె (మహారాష్ట్ర)పై, సాత్విక 6-4, 6-1తో గాయత్రి కుమరయ్యపై, మౌళిక రామ్ 7-5, 6-7, 6-3తో నేహల్ సాహ్ని (ఢిల్లీ)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో ఇస్కా అక్షర (ఆంధ్రప్రదేశ్) 3-6, 5-7తో అభినిక (తమిళనాడు) చేతిలో, చల్లా హర్ష సాయి 0-6, 1-6తో హిమాని మోర్ (హర్యానా) చేతిలో పరాజయం పాలయ్యారు.