
పెరంబూరు: శృంగార నటి బాబీలోనా సోదరుడు విఘ్నేశ్‌కుమార్ పోలీస్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సోమవారం రాత్రి స్థానిక సాలిగ్రామం, దశరదపురం 9వ వీధిలో ఒక వ్యక్తి గొడవ చేస్తున్న సమాచారం పోలీసులకు అందింది.ఆ ప్రాంత సబ్‌ఇన్‌స్పెక్టర్ పళనిశంకర్ పోలీసును తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ యువకుడు(30) మద్యం సేవించి రగడ చేస్తుండడం కనిపించింది. పోలీసులు అతని వద్దకు వెళ్లి ఇంటికి వెళ్లమని చెప్పారు.
మద్యం మత్తులో ఉన్న విఘ్నేశ్‌కమార్ అక్కడ నుంచి వెళ్లకపోగా పోలీసులకే ఎదురు తిరిగి శంకర్ అనే పోలీసు చెంపపై కొట్టాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ పళని, శంకర్ అనే పోలీసు అతన్ని అరెస్ట్‌చేసి సాలిగ్రామం పోలీస్ స్టేషన్‌కు తీసకెళ్లారు. అక్కడ అతన్ని విచారించగా తను శ్రుంగార నటి బాబీలోనా సోదరుడు అని తెలిసింది. పోలీస్‌పై చేయి చేసుకున్న నేరం కింద కేసు నమోదు చేసి విఘ్నేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment