
దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ను వివాహం చేసుకుని ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నయనతార . తాజాగా ఆమె చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలో పోయెస్ గార్డెన్ అంటే సెలబ్రెటీలకు కేరాఫ్. పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్, జయచిత్ర ఇళ్లతో పాటు జయలలిత నివాసం వేద నిలయం ఎదురుగా ఆమె నెచ్చెలి శశికళ సైతం ఓ భారీ బంగ్లాను కట్టించారు.
(చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య)
లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి పోయెస్‌గార్డెన్‌లోనే నివాసం ఉండేందుకు సిద్ధమైంది. నయనతార కొనుగోలు చేసిన ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని సమాచారం. వీటిని బాలీవుడ్ స్టార్స్ ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే ఒక ప్రముఖ సంస్థ రూ.25 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఇంటిలో 1500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్‌పూల్, నయనతార, విఘ్నేష్‌శివన్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరికొత్తగా నిర్మించనున్న ఇళ్లలోకి నయనతార, విఘ్నేష్‌శివన్ జంట త్వరలోనే ప్రవేశించనున్నట్లు ప్రచారం.
Comments
Please login to add a commentAdd a comment