విఘ్నేశ్ శుభారంభం | open tennis championship vignesh from Andhra pradesh started | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్ శుభారంభం

Published Tue, Oct 15 2013 11:50 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

open tennis championship vignesh from Andhra pradesh started

న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విఘ్నేశ్ శుభారంభం చేశాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన అతను తొలి రౌండ్‌లో 7-5, 6-4తో మహ్మద్ ఫరీజ్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అడవెల్లి పార్థసారథి, సాయిశరణ్ రెడ్డి తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. అన్విత్ బెంద్రే (మహారాష్ట్ర) 6-1, 6-2తో సాయిశరణ్‌పై, నితిన్ కీర్తనే (మహారాష్ట్ర) 6-1, 6-2తో పార్థసారథిపై గెలిచారు.
 
 భువన ఓటమి
 మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. నాలుగో సీడ్ కాల్వ భువన, తీర్థ ఇస్కా తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు. స్నేహదేవి రెడ్డి (తమిళనాడు) 6-2, 6-2తో భువనపై, మాన్యా నాగ్‌పాల్ (ఢిల్లీ) 6-1, 7-5తో తీర్థ ఇస్కాపై విజయం సాధించారు.
 
 అబ్దుల్లా, జ్ఞానభాస్కర్ ముందంజ
 అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టాప్ సీడ్ షేక్ అబ్దుల్లా, పరమాత్ముని వెంకట జ్ఞానభాస్కర్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో అబ్దుల్లా 6-3, 6-3తో అఖిల్ నాగరాజ్ (తమిళనాడు)పై, జ్ఞానభాస్కర్ 6-3, 6-4తో వాసుదేవ్ విజయరామన్ (తమిళనాడు)పై గెలిచారు. మిగతా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పార్థసారథి (ఆంధ్రప్రదేశ్) 4-6, 4-6తో ముకుంద్ శశికుమార్ (తమిళనాడు) చేతిలో; నిఖిల్ మన్నెపల్లి (ఆంధ్రప్రదేశ్) 1-6, 3-6తో పరీక్షిత్ (అస్సాం) చేతిలో ఓడిపోయారు.
 
 మూడో రౌండ్‌లో తీర్థ, సాత్విక, మౌళిక
 అండర్-18 బాలికల సింగిల్స్‌లో విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తీర్థ ఇస్కా, సామ సాత్విక, మౌళిక రామ్ మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్‌లో తీర్థ 6-2, 6-4తో స్నేహల్ మానె (మహారాష్ట్ర)పై, సాత్విక 6-4, 6-1తో గాయత్రి కుమరయ్యపై, మౌళిక రామ్ 7-5, 6-7, 6-3తో నేహల్ సాహ్ని (ఢిల్లీ)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో ఇస్కా అక్షర (ఆంధ్రప్రదేశ్) 3-6, 5-7తో అభినిక (తమిళనాడు) చేతిలో, చల్లా హర్ష సాయి 0-6, 1-6తో హిమాని మోర్ (హర్యానా) చేతిలో పరాజయం పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement