open Tennis championship
-
ముగిసిన సత్యన్ పోరు
న్యూఢిల్లీ: ఆస్ట్రియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ పోరాటం ముగిసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ జు జిన్ (చైనా)తో శుక్రవారం లింజ్ నగరంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్ సత్యన్ 1–11, 7–11, 11–7, 2–11, 4–11తో ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో సత్యన్ 4–11, 11–9, 11–9, 8–11, 6–11, 11–9, 11–7తో ప్రపంచ 16వ ర్యాంకర్ మార్కోస్ ఫ్రెటాస్ (పోర్చుగల్)పై సంచలన విజయం సాధించాడు. -
ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేత అపురూప్
సాక్షి, హైదరాబాద్: స్పెయిన్‌లో జరిగిన పురుషుల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ ఆటగాడు పి. అపురూప్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఆరు వారాల పాటు శిక్షణ కోసం బార్సిలోనాకు వెళ్లిన అపురూప్ ఈ సందర్భంగా జరిగిన ఓపెన్ టోర్నీలో చాంపియన్ అయ్యాడు. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ఫైనల్లో అపురూప్ 6–3, 2–6, 6–4తో ఎంజో బ్లాగ్‌వినాట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. సెమీస్‌లో అపురూప్ 3–6, 6–3, 10–4తో మార్క్ గార్డెనో రస్కో (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో జూడీపై, రెండో రౌండ్లో 6–1, 6–0తో బెన్ వులియామి (బ్రిటన్)పై, తొలి రౌండ్లో 7–5, 6–0తో నికితా ప్లిస్‌చికోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. -
క్వార్టర్స్‌లో అక్షర
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇస్కా అక్షర అండర్-16 బాలికల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మూడో రౌండ్లో టాప్ సీడ్ అక్షర 6-1, 6-3తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలిచింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మాన్సి రెడ్డి, సామ సాత్విక ఓటమి పాలయ్యారు. మూడో రౌండ్లో మాన్సి రెడ్డి 3-6, 2-6తో రమ్య నటరాజన్ (తమిళనాడు) చేతిలో; సాత్విక 0-6, 2-6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అండర్-16 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో జ్ఞానభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) 6-3, 6-2తో అభినవ్ సంజీవ్ (తమిళనాడు)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో కొసరాజు శివదీప్ 6-1, 6-4తో సిద్ధాంత్ (మహారాష్ట్ర)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో మాన్సి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 7-5, 6-2తో సాహిత్య నిహ్లాని (ఢిల్లీ)పై విజయం సాధించగా... సామ సాత్విక (ఆంధ్రప్రదేశ్) 6-2, 4-6, 2-6తో రిషిక (తమిళనాడు) చేతిలో; చల్లా హర్ష సాయి (ఆంధ్రప్రదేశ్) 2-6, 2-6తో ఆర్యా చక్రవర్తి (ఉత్తర ప్రదేశ్) చేతిలో ఓడిపోయారు. బుధవారం జరిగిన మూడో రౌండ్లో టాప్ సీడ్ అక్షర 6-1, 6-3తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలిచింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మాన్సి రెడ్డి, సామ సాత్విక ఓటమి పాలయ్యారు. మూడో రౌండ్లో మాన్సి రెడ్డి 3-6, 2-6తో రమ్య నటరాజన్ (తమిళనాడు) చేతిలో; సాత్విక 0-6, 2-6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అండర్-16 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో జ్ఞానభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) 6-3, 6-2తో అభినవ్ సంజీవ్ (తమిళనాడు)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో కొసరాజు శివదీప్ 6-1, 6-4తో సిద్ధాంత్ (మహారాష్ట్ర)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో మాన్సి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 7-5, 6-2తో సాహిత్య నిహ్లాని (ఢిల్లీ)పై విజయం సాధించగా... సామ సాత్విక (ఆంధ్రప్రదేశ్) 6-2, 4-6, 2-6తో రిషిక (తమిళనాడు) చేతిలో; చల్లా హర్ష సాయి (ఆంధ్రప్రదేశ్) 2-6, 2-6తో ఆర్యా చక్రవర్తి (ఉత్తర ప్రదేశ్) చేతిలో ఓడిపోయారు. -
సెమీస్‌లో తీర్థ పరాజయం
న్యూఢిల్లీ: నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ ఇస్కా తీర్థ పోరాటం ముగిసింది. జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తీర్థ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల సెమీఫైనల్లో తీర్థ 3-6, 0-6తో చామర్తి సాయి సంహిత (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూసింది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు విఘ్నేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో విఘ్నేశ్-మహ్మద్ ఫరీజ్ జోడి 4-6, 4-6తో మోహిత్ జయప్రకాశ్ (తమిళనాడు)-అర్జున్ ఖాడే (మహారాష్ట్ర) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో తీర్థ
న్యూఢిల్లీ: తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇస్కా తీర్థ జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీర్థ 6-7 (3/7), 6-2, 7-6 (7/2)తో సృష్టి సలారియా (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన తీర్థ రెండో సెట్‌ను అలవోకగా చేజిక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో టైబ్రేక్ అనివార్యమైంది. కీలకమైన టైబ్రేక్‌లో తీర్థ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో చామర్తి సాయి సంహిత (తమిళనాడు)తో తీర్థ పోటీపడుతుంది. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మహిత దాడిరెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6-7 (6/8), 1-6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ విఘ్నేశ్ (ఆంధ్రప్రదేశ్) 2-6, 1-6తో అర్జున్ ఖాడే (మహారాష్ట్ర) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
విఘ్నేశ్ శుభారంభం
న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విఘ్నేశ్ శుభారంభం చేశాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లో 7-5, 6-4తో మహ్మద్ ఫరీజ్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అడవెల్లి పార్థసారథి, సాయిశరణ్ రెడ్డి తొలి రౌండ్లోనే ఓడిపోయారు. అన్విత్ బెంద్రే (మహారాష్ట్ర) 6-1, 6-2తో సాయిశరణ్పై, నితిన్ కీర్తనే (మహారాష్ట్ర) 6-1, 6-2తో పార్థసారథిపై గెలిచారు. భువన ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. నాలుగో సీడ్ కాల్వ భువన, తీర్థ ఇస్కా తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. స్నేహదేవి రెడ్డి (తమిళనాడు) 6-2, 6-2తో భువనపై, మాన్యా నాగ్‌పాల్ (ఢిల్లీ) 6-1, 7-5తో తీర్థ ఇస్కాపై విజయం సాధించారు. అబ్దుల్లా, జ్ఞానభాస్కర్ ముందంజ అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టాప్ సీడ్ షేక్ అబ్దుల్లా, పరమాత్ముని వెంకట జ్ఞానభాస్కర్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో అబ్దుల్లా 6-3, 6-3తో అఖిల్ నాగరాజ్ (తమిళనాడు)పై, జ్ఞానభాస్కర్ 6-3, 6-4తో వాసుదేవ్ విజయరామన్ (తమిళనాడు)పై గెలిచారు. మిగతా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పార్థసారథి (ఆంధ్రప్రదేశ్) 4-6, 4-6తో ముకుంద్ శశికుమార్ (తమిళనాడు) చేతిలో; నిఖిల్ మన్నెపల్లి (ఆంధ్రప్రదేశ్) 1-6, 3-6తో పరీక్షిత్ (అస్సాం) చేతిలో ఓడిపోయారు. మూడో రౌండ్లో తీర్థ, సాత్విక, మౌళిక అండర్-18 బాలికల సింగిల్స్‌లో విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తీర్థ ఇస్కా, సామ సాత్విక, మౌళిక రామ్ మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో తీర్థ 6-2, 6-4తో స్నేహల్ మానె (మహారాష్ట్ర)పై, సాత్విక 6-4, 6-1తో గాయత్రి కుమరయ్యపై, మౌళిక రామ్ 7-5, 6-7, 6-3తో నేహల్ సాహ్ని (ఢిల్లీ)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో ఇస్కా అక్షర (ఆంధ్రప్రదేశ్) 3-6, 5-7తో అభినిక (తమిళనాడు) చేతిలో, చల్లా హర్ష సాయి 0-6, 1-6తో హిమాని మోర్ (హర్యానా) చేతిలో పరాజయం పాలయ్యారు.