ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేత అపురూప్‌ | apuroop wins mens open tennis title | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేత అపురూప్‌

Published Thu, Dec 14 2017 12:28 PM | Last Updated on Thu, Dec 14 2017 12:29 PM

apuroop wins mens open tennis title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్పెయిన్‌లో జరిగిన పురుషుల ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ యువ ఆటగాడు పి. అపురూప్‌ రెడ్డి విజేతగా నిలిచాడు. ఆరు వారాల పాటు శిక్షణ కోసం బార్సిలోనాకు వెళ్లిన అపురూప్‌ ఈ సందర్భంగా జరిగిన ఓపెన్‌ టోర్నీలో చాంపియన్‌ అయ్యాడు. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ఫైనల్లో అపురూప్‌ 6–3, 2–6, 6–4తో ఎంజో బ్లాగ్‌వినాట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. సెమీస్‌లో అపురూప్‌ 3–6, 6–3, 10–4తో మార్క్‌ గార్డెనో రస్కో (స్పెయిన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో జూడీపై, రెండో రౌండ్‌లో 6–1, 6–0తో బెన్‌ వులియామి (బ్రిటన్‌)పై, తొలి రౌండ్‌లో 7–5, 6–0తో నికితా ప్లిస్‌చికోవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement