అడిలైడ్: కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న–రామ్‌కుమార్ విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న కెరీర్‌లో ఇది 48వ ఏటీపీ టోర్నీ డబుల్స్ ఫైనల్‌కాగా... రామ్‌కుమార్ తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ జంట 6–2, 6–4తో నాలుగో సీడ్ శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–తొమిస్లావ్ బిర్కిచ్ (బోస్నియా హెర్జెగోవినా) జోడీపై విజయం సాధించింది.
నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శాంటియాగో–బిర్కిచ్‌లతో 58 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో బోపన్న, రామ్‌కుమార్ ఎని మిది ఏస్‌లు సంధించారు. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. 41 ఏళ్ల బోపన్న తన కెరీర్‌లో 19 డబుల్స్ టైటిల్స్ సాధించి, 28 సార్లు రన్నరప్‌గా నిలిచాడు.
(చదవండి: కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్)
Comments
Please login to add a commentAdd a comment