క్వార్టర్స్‌లో అక్షర | Akshra reached in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అక్షర

Published Thu, Oct 24 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

క్వార్టర్స్‌లో అక్షర

క్వార్టర్స్‌లో అక్షర

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇస్కా అక్షర అండర్-16 బాలికల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో టాప్ సీడ్ అక్షర 6-1, 6-3తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలిచింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మాన్సి రెడ్డి, సామ సాత్విక ఓటమి పాలయ్యారు. మూడో రౌండ్‌లో మాన్సి రెడ్డి 3-6, 2-6తో రమ్య నటరాజన్ (తమిళనాడు) చేతిలో; సాత్విక 0-6, 2-6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో పరాజయాన్ని చవిచూశారు.

అండర్-16 బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో జ్ఞానభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) 6-3, 6-2తో అభినవ్ సంజీవ్ (తమిళనాడు)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో కొసరాజు శివదీప్ 6-1, 6-4తో సిద్ధాంత్ (మహారాష్ట్ర)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో మాన్సి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 7-5, 6-2తో సాహిత్య నిహ్లాని (ఢిల్లీ)పై విజయం సాధించగా... సామ సాత్విక (ఆంధ్రప్రదేశ్) 6-2, 4-6, 2-6తో రిషిక (తమిళనాడు) చేతిలో; చల్లా హర్ష సాయి (ఆంధ్రప్రదేశ్) 2-6, 2-6తో ఆర్యా చక్రవర్తి (ఉత్తర ప్రదేశ్) చేతిలో ఓడిపోయారు.

బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో టాప్ సీడ్ అక్షర 6-1, 6-3తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలిచింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మాన్సి రెడ్డి, సామ సాత్విక ఓటమి పాలయ్యారు. మూడో రౌండ్‌లో మాన్సి రెడ్డి 3-6, 2-6తో రమ్య నటరాజన్ (తమిళనాడు) చేతిలో; సాత్విక 0-6, 2-6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో పరాజయాన్ని చవిచూశారు.

అండర్-16 బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో జ్ఞానభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) 6-3, 6-2తో అభినవ్ సంజీవ్ (తమిళనాడు)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో కొసరాజు శివదీప్ 6-1, 6-4తో సిద్ధాంత్ (మహారాష్ట్ర)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. అండర్-14 బాలుర సింగిల్స్ మూడో రౌండ్‌లో మాన్సి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 7-5, 6-2తో సాహిత్య నిహ్లాని (ఢిల్లీ)పై విజయం సాధించగా... సామ సాత్విక (ఆంధ్రప్రదేశ్) 6-2, 4-6, 2-6తో రిషిక (తమిళనాడు) చేతిలో; చల్లా హర్ష సాయి (ఆంధ్రప్రదేశ్) 2-6, 2-6తో ఆర్యా చక్రవర్తి (ఉత్తర ప్రదేశ్) చేతిలో ఓడిపోయారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement