సెమీస్‌లో తీర్థ పరాజయం | In semi final Thirudha lost the game | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తీర్థ పరాజయం

Published Sat, Oct 19 2013 12:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

In semi final Thirudha lost the game

న్యూఢిల్లీ: నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ ఇస్కా తీర్థ పోరాటం ముగిసింది. జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తీర్థ సెమీఫైనల్లో ఓటమి పాలైంది.
 
 శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల సెమీఫైనల్లో తీర్థ 3-6, 0-6తో చామర్తి సాయి సంహిత (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూసింది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు విఘ్నేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో విఘ్నేశ్-మహ్మద్ ఫరీజ్ జోడి 4-6, 4-6తో మోహిత్ జయప్రకాశ్ (తమిళనాడు)-అర్జున్ ఖాడే (మహారాష్ట్ర) ద్వయం చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement