
కర్ణాటక, కోలారు: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషికి 10 సంవత్సరాల జైలు, 11 వేల రూపాయల జరిమానా విధిస్తూ రెండవ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. తాలూకాలోని సింగండహళ్లి గ్రామానికి చెందిన యువకుడు, ప్రైవేటు ఉద్యోగి అయిన శ్రీనాథ్ (25) శిక్షకు గురైన వ్యక్తి. ఇతను బంగారుపేట తాలూకా సొరెగౌడనకోట గ్రామానికి చెందిన బాలిక పక్క ఇంట్లో నివాసం ఉండేవాడు. బాలిక తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో శ్రీనాథ్ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక పోషకులు బంగారుపేట పోలీస్ స్టేషన్‌లో 2017 జనవరి 31న ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు శ్రీనాథ్‌పై పోక్సో కేసు దాఖలు చేసి దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బిఎస్ రేఖ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment