
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలో ఘోరం జరిగిపోయింది. వావి వరుసలు మరిచి కన్నతండ్రే తన సొంత కూతురి(12)పై అత్యాచారం చేసిన దారుణ సంఘటన బుట్టాయిగూడెంలో వెలుగు చూసింది. గత కొంతకాలంగా తండ్రి చేసిన ఈ దుర్మార్గం వల్ల ఆ మైనర్ బాలిక గర్భవతి అయింది. ఈ విషయం తల్లికి చెబితే చంపుతానంటూ ఆ బాలికను బెదిరించాడు. కానీ, ఎలాగోలా తెలుసుకున్న ఆబాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడకి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment