west godavari distirict
-
Sankranti: ఆతిథ్యంలో గోదారోళ్లది అందెవేసిన చెయ్యి
సాక్షి, భీమవరం: సినిమా షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) వచ్చిన ప్రముఖ సినీనటుడు వీరమాచనేని జగపతిబాబు ఇక్కడి ఆతిథ్యం గురించి పోస్టు చేసిన వీడియో చాలానే వైరల్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నన్నాళ్లూ ఓ అభిమాని ప్రతిరోజూ రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తనకు విందు భోజనం పంపారని చెప్పుకొచ్చారు. వాటిని చూపిస్తూ ‘బకాసురుడిలా తింటాను.. కుంభకర్ణుడిలా పడుకుంటా’నంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాల(Godavari Districts) ఆతిథ్యాన్ని ఎన్నో వేదికలపై గుర్తుచేసుకున్న సందర్భాలెన్నో.. ఆయ్.. అండి.. రండీభాషలో ‘ఆయ్..’ అనే యాస ఉన్నా.. మాటనిండా మమకారమే దాగి ఉంటుంది. దారి చెప్పమంటే నేరుగా ఇంటికే తీసుకెళ్లేంత మర్యాద ఉంటుంది. తిండి పెట్టి చంపేస్తారన్నది నానుడైతే.. పెట్టుపోతలతో మైమరచిపోయేలా చేయడం వీరి నైజం. అడుగడుగునా వెటకారమే అనిపించినా.. అణువణువునా ఆప్యాయతే కనిపిస్తుంది. అరమరికలు లేని వ్యక్తిత్వాలు.. అబ్బురపరిచే సంప్రదాయాలు.. గోదావరి వాసుల పడికట్లు. అందుకే.. గోదారోళ్ల పిల్లను చేసుకోవడానికి ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. గోదారోళ్ల ఆతిథ్యం చూడాలంటే వారి ఇంటి అమ్మాయిని వివాహమాడాల్సిందే. పెళ్లిచూపులు లగాయితు అప్పగింతల వరకు అడుగడుగునా వారి అతిథి మర్యాదలు, సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి.సంక్రాంతి వస్తోందంటేసంక్రాంతి(Sankranti Festival) వస్తోందంటే గోదావరి మర్యాదలే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను పండక్కి వారం ముందే రమ్మని పిలిచి.. ఉన్నన్ని రోజులూ వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు గుమ్మం వద్దే చెంబులతో చేతికి నీళ్లందించి కాళ్లు కడుక్కోమని మర్యాదలు చేస్తారు. చేతులు తుడుచుకోవడానికి భుజాలపై తుండు (టవల్) అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మనసు నిండా అభిమానంతో స్వాగతం పలుకుతారు. కోడి పందేలు, జాతరలు, సినిమాలు, పల్లె అందాలను తిప్పి చూపిస్తుంటారు. సరదా పడాలే గానీ తాటికల్లు రుచి చూపిస్తారు. ఉన్నన్ని రోజులూ నచ్చిన వంటకాలను వండి వారుస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అరిటాకులో విందు భోజనం చేస్తుంటారు.అత్తల హడావుడి అంతాఇంతా కాదుకొత్త అల్లుడు మొదటిసారిగా పండుగకు ఇంటికి వచ్చే అల్లుళ్ల కోసం పల్లెల్లో అత్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, పోకుండలు, గోరుమిటీలు వంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. తలుపు చాటున నిల్చుని అల్లుడు గారికి అవి పెట్టు.. ఇవి పెట్టు అంటూ కూతురికి చెబుతూ అత్తలు సంబరపడిపోయే దృశ్యాలు అనేకం. తామేమీ తక్కువ కాదన్నట్టు కొంటె మరదళ్లు గాజులతో గారెలు.. గోళీలతో పొంగడాలు.. ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేసి బావలను ఆట పట్టించడం ఇక్కడ షరా మామూలే.వియ్యపురాలా.. నీవొచ్చెవేళకొందరు అల్లుడితో పాటు వియ్యపురాలిని సైతం ఇంటికి ఆహ్వానించి కానుకలు, కొత్త దుస్తులు అందిస్తారు. వియ్యపురాలు సైతం వస్తూవస్తూ ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు తెచ్చి ఇవ్వడం ఇక్కడి ఆచారం. తద్వారా ఇరు కుటుంబాల మధ్య బంధాలు బలపడతాయని గోదారోళ్ల నమ్మకం. పండుగలు ముగిసి స్వస్థలాలకు తిరిగి వెళ్లే బంధువులకు ఇంటిలో చేసిన పిండివంటలను ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీధి చివరి దాకా వచ్చి వీడ్కోలు చెబుతూ వచ్చే ఏడాది ముందుగానే రావాలంటూ మాట తీసుకుని మరీ సాగనంపడం గోదారోళ్ల ప్రత్యేకత.కొత్త అల్లుడికి గుర్తుండిపోయేలా..సంక్రాంతి వస్తోందంటే కొత్తగా పెళ్లయిన ఇళ్లల్లో సందడికి అంతే ఉండదు. తమ స్తోమతకు తగ్గట్టుగా అల్లుడికి తొలి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా అత్తింటి వారు మర్యాదలు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగతం పలుకుతారు. విందులో ఎన్నెన్నో (కొందరైతే వందకు పైగా) వంటకాలను వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. గత ఏడాది భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరో కుటుంబం వారు తమకు కాబోయే అల్లుడికి వంద రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. పండక్కి మొదటిసారి వస్తున్న అల్లుడిని భీమవరానికి చెందిన అత్తింటివారు డోలు, సన్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. భారతదేశం మ్యాప్‌పై దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. -
బిల్డప్ బాబూ బిల్డప్..! ఆ విషయం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాలా ఆత్రంగా ఉన్నారు. ఎలాగైనా ఆయా వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి నానా పాట్లు పడుతున్నారు. అందులోను రైతులలో ప్రభుత్వంపై అపనమ్మకం కలిగించాలన్నది ఆయన ఉద్దేశం. ఇందుకోసం ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలను ఎందుకు ఎంచుకున్నారో ఊహించడం కష్టం కాదు. భవిష్యత్తులో టీడీపీతో జనసేన కలిస్తే రెండు పార్టీల క్యాడర్ మద్య ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసే లక్ష్యంతో కూడా ఆయన అక్కడే వారం రోజుల మకాం పెట్టినట్లు అనిపిస్తుంది. దుష్ప్రచారం చేయడానికే బాబు టూర్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో కూడా వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగింది. కానీ ఆయన మాత్రం అక్కడే కూర్చుని రైతులను రెచ్చగొట్టడానికి విపరీత యత్నం చేశారు. ఆ క్రమంలో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రైతులంతా తమ ధాన్యాన్ని తాడేపల్లికి తరలించాలట. పోరుబాట పట్టాలట. తానే ముందుంటారట. ఇలా ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టలేదు. నిజంగానే రైతులకు ఏదైనా కష్టం వస్తే ప్రతిపక్ష నేతగా వెళ్లి వారిని పరామర్శించడం తప్పు కాదు. అక్కడ ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేస్తే చేయవచ్చు. కానీ అచ్చంగా దుష్ప్రచారం చేయడానికే ఆయన టూర్ చేస్తున్నారు. రైతులకు అండగా సీఎం జగన్ అకాల వర్షాలవల్ల అక్కడక్కడా రైతులు ఇబ్బందికి గురి అయ్యారు. వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అదికారిని నియమించారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కూడా దీనిపై మీడియా సమావేశం పెట్టి , తుపాను హెచ్చరికలు ఉన్నందున, వర్షాలు మరిన్ని కురిసే అవకాశం ఉన్నందున, తదుపరి తాము ఎన్యుమరేషన్ ప్రారంభించి రైతులకు తగు సాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌తో పోల్చితే రబీలో సాగు తక్కువగా ఉంటుంది. అందులోను మే నెల వచ్చేసరికి చాలా వరకు వ్యవసాయ ఆపరేషన్లు పూర్తి అయిపోతుంటాయి. ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నం అయినా నీటి సదుపాయం ఉన్నచోట ఏదో ఒక పంట వేస్తుంటారు. ఇలాంటి అకాల వర్షాలు పడినప్పుడు రైతులకు నష్టం జరుగుతుంటుంది. వారికి సాయం చేయాలని అడగడం వరకు తప్పు లేదు. ఎప్పుడు ఏ కారణం దొరుకుతుందా.. ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అన్న తాపత్రయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవకాశం వచ్చిందే తడవుగా హడావుడి చేసి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన రహదారుల వెంట వెళుతున్నప్పుడు ఆయా చోట్ల రైతులు పంటలు ఆరబోసి కనిపిస్తారు. కొందరు టార్పాలిన్లు కప్పి పంటలను కాపాడుకుంటున్నారు. అది చంద్రబాబుకు ఇష్టం లేదు. ధాన్యంతో పాటు మొక్కజొన్న పంట కొన్ని చోట్ల వర్షాల వల్ల తడిసింది. వాటిని ఎండబెడుతూ రైతులు కనిపించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో పంట నష్టం తక్కువే అని చెప్పాలి. తెలంగాణలో అనేక చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయిన దృశ్యాలు టీవీలలో కనిపించాయి. ఇక్కడ మిల్లర్లు వాటిని తీసుకోబోమని చెబుతున్నారు. ఏపీలో అలా జరగడం లేదు. మిల్లర్లు తీసుకుంటున్నారు. అది కూడా చంద్రబాబుకు ఇష్టం లేదు. వారు తీసుకుంటున్నారు కనుక ఏదో ఒక ఆరోపణ చేయాలి. అందుకే వెంటనే నూక పేరుతో ధర తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలని విమర్శించారు. అది అసలు కథ.. భరోసా కేంద్రాలవల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. రైతులు తక్షణమే తమ గ్రామంలో ఉన్న భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తమ అవసరాలను వివరించి సాయం పొందుతున్నారు. ఆ వ్యవస్థ వల్ల వైఎస్సార్సీపీ పార్టీకి, సీఎం జగన్‌కు రాజకీయ ప్రయోజనం జరగరాదన్నది ఆయన కోరిక. అందుకే వాటిని సైతం ఆయన వదలిపెట్టడం లేదు. నిజంగానే ఎక్కడైనా రైతు భరోసా కేంద్రంలో ఏదైనా అవకతవక జరుగుతుంటే ప్రభుత్వ దృష్టికి తేవచ్చు. అలాకాకుండా గుంపగుత్తగా మొత్తం వ్యవస్థపైనే ఆరోపణలు చేయడం ద్వారా ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఆ పాయింట్ మాత్రం చెప్పరు తాను అధికారంలోకి వస్తే ఈ రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా? ఆ పాయింట్ మాత్రం చెప్పరు. ఎవరైనా అలాంటి ప్రశ్నలు అడిగితే వారి మీద మండిపడితారు. చివరికి ఆయన రైతుల కులాల గురించి కూడా ప్రశ్నించి మాట్లాడే స్థాయికి వెళ్లారంటే ఇంత సీనియర్ నేత ఇన్నాళ్లుగా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేశారా అన్న భావన కలుగుతుంది. వాస్తవానికి ఎవరూ కూడా ఎదుటివారి కులాన్ని అడగరాదు. అందులోను సీనియర్ రాజకీయవేత్తలు అలాంటివాటికి దూరంగా ఉండాలి. కాని చంద్రబాబే అలా అడుగుతుంటే ఏమి చెబుదాం. యథా ప్రకారం తాను ఉంటే వర్షాలను ముందే పసికట్టి రైతులు నష్టపోకుండా చూసేవారట. బాబు విచిత్ర ప్రకటనలు గతంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే అభాసుపాలయ్యారు. సముద్రంలో తుపానులు కంట్రోల్ చేశానని, అమరావతిలో పది డిగ్రీల ఎండ తగ్గించాలని ఆదేశాలు ఇచ్చానని, సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, హైదరాబాద్ తానే కట్టానని, ఇలాంటి చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారు. ఆ సంగతి ఆయనకు టీడీపీ నేతలు ఎవరూ చెప్పరో ఏమోకాని, మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై జోకులు వస్తున్నాయి. చంద్రబాబు ఉంటే అసలు వర్షాలే పడవు కదా అని ఎద్దేవ చేస్తున్నారు. రైతులంటే చిన్నచూపు అనంతపురం జిల్లాలో కరువు వస్తే రెయిన్ గన్లు అంటూ వందల కోట్లు వ్యయం చేసి తెచ్చి, కరవు తీరిపోయిందని చెప్పేశారు. అసలు వ్యవసాయంపైనే ఆయనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రైతులంటే చిన్నచూపు. వారు ఏమి చెప్పినా వింటారులే అన్న భావన. లేకుంటే 89 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపిస్తానని 2014 ఎన్నికలలో హామీ ఇవ్వగలిగేవారా? పాపం.. అమాయకులైన రైతులు నమ్మి ఆయనకు ఓట్లు వేస్తే , ఆ తర్వాత వారిని దారుణంగా మోసం చేయడమే కాకుండా, వారిని ఆశపోతులని అవమానించారు. చంద్రబాబు బిల్డప్ ఆయన అధికార ఆశ ముందు రైతుల ఆశ ఎంత చిన్నది. పైగా రైతులేమీ ఆయనను రుణాలు మాఫీ చేయాలని అడగలేదు. చంద్రబాబే ఊరువాడ తిరిగి రుణాలను మాఫీ చేస్తానని ప్రచారం చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పుడేమో రైతులంటే చాలా ప్రేమ ఉన్నట్లు వారి తరపున తాను పోరాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఆయన పేలాలు ఏరుకోవడానికి తిరుగుతున్నారని వారు ఆరోపించారు. అవును ఆయన ఓట్ల పేలాలను ఈ వర్షాల నష్టాలలో, కష్టాలలో ఏరుకోవాలని చూశారు. రైతులు ఆ విషయాన్ని గమనించలేనంతటి అమాయకులా!.. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు తన పర్యటనలో భారీగానే నగదు ఉండేలా చూసుకుంటున్నట్లుగా ఉంది. ఒక మహిళ ఏదో సమస్య చెప్పగానే 2.30 లక్షల రూపాయల సాయం చేశారట. మరికొన్నిచోట్ల ఐదువేలు, పదివేలు ఇలా ఇచ్చారని వార్తలు వచ్చాయి. డిజిటల్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన ఇంత మొత్తాలలో నగదు ఇవ్వడం అంటే ఏమి అనుకోవాలి!అది వైట్ మనీ అవుతుందా!బ్లాక్ మనీ అవుతుందా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘పశ్చిమ’లో కొబ్బరి.. తడబడి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి ఎగుమతులు పతనమవుతున్నాయి. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో పంట అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు ఢీలా పడ్డాయి. దీంతోపాటు నాణ్యతపరంగా పొరుగు రాష్ట్రాల్లో పంట బాగుండటంతో మన మార్కెట్ డౌన్ అయ్యింది. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 30 లారీల కొబ్బరి ఎగుమతి చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో తమిళనాడు, కేరళ కొబ్బరి అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా నుంచి ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి నుంచి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం వద్ద రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వార కాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం ప్రాంతాల్లో కొబ్బరి సాగు ఎక్కువగా ఉంది. సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి చేస్తారు. శ్రావణమాసం సందర్భంగా కొద్దిరోజుల ముందు వరకూ ఎగుమతులు బాగున్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. లారీకి 30 వేల కాయల వరకు.. చిన్నలారీలో సుమారు 20 వేలు, పెద్ద లారీలో 30 వేల వరకు కాయలను లోడు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 30 లారీల పంట ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం పాత, కొత్త కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడులో కొబ్బరి కాయల ధర రూ.7 నుంచి రూ.8 వరకు ఉండటంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ ఎక్కడెక్కడంటే.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిసా, హర్యానా రాష్ట్రా ల్లో సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి కాయకు డిమాండ్ ఉంటుంది. జిల్లా నుంచి పీచు కాయ గుజరాత్‌కు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. బెల్ట్ ఫోర్ పట్టా రకాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి ఎగుమతుల్లో రాష్ట్రంతో తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఆంధ్రా కొబ్బరి ఎగుమతి అధికంగా ఉండటంతో పాటు ధర రూ.15 వరకూ పలికింది. ఒక్కసారిగా తమిళనాడు, కేరళలో దిగుబడులు పెరగడంతో మన మార్కెట్లో ధరలు తగ్గాయి. పరిశోధనా కేంద్రాలు కీలకం పరిశోధనా కేంద్రాల సూచనలు ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో రైతులు కొబ్బరి సాగుచేస్తున్నారు. తద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కోనసీమ జిల్లా అంబాజీపేటలో మినహా మరెక్కడా కొబ్బరి పరిశోధనా కేంద్రం లేకపోవడంతో రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోయింది. విస్తీర్ణం తగ్గుతూ.. జిల్లాలో గతంలో సుమారు 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేసేవారు. ఆక్వా విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుతం సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. ఆక్వా చెరువు గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లకు నల్లి తెగులు సోకడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. కొబ్బరి కాయపై మచ్చలు ఏర్పడటం, కాయ పరిమాణం తగ్గడంతో రైతులు లాభాలను అందుకోలేకపోతున్నారు. పరిశోధనా కేంద్రం అవసరం తమిళనాడు, కేరళతో సంబంధం లేకుండా మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరగాలంటే ఇక్కడ పండించే కొబ్బరి కాయకు మచ్చ లేకుండా ఉండాలి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఉండాలి. వాటి ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే తమిళనాడు కొబ్బరి పంట అందుబాటులో ఉంటే మన పంటకు డిమాండ్ తగ్గుతుంది. – దేవరపు లక్ష్మీనారాయణ, పాలకొల్లు కొబ్బరి మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డిమాండ్ తగ్గింది శ్రావణమాసం పూర్తికావడంతో మహారాష్ట్రలో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం శూన్యమాసం కావడం, తమిళనాడు, కేరళæ పంట అందు బాటులోకి రావడంతో మన మార్కెట్ పతనమవుతోంది. ఇటీవల జిల్లాలో వరదలు రావడంతో చెట్లు సుమారు 20 రోజులు నీటిలో ఉండటంతో కాయల్లో నాణ్యత తగ్గింది. డొక్క, పీచు ఇలా అన్ని రంగాల్లో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోకోనట్ కోప్రా మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీ -
అత్త 60వ పుట్టినరోజుకు కోడలి సర్ప్రైజ్.. నెటిజన్ల ఫిదా!
సాక్షి, పశ్చిమగోదావరి: అత్తాకోడళ్లు అంటేనే జగడాలకు మారుపేరుగా మారిపోయింది నేటి కాలంలో. టివీ సీరియళ్లలో అత్తాకోడళ్ళ పోరాట సన్నివేశ దృశ్యాలే ముందుగా కళ్ల ముందుకొస్తాయి. చాలా కుటుంబాల్లో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ నిత్యం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే స్థాయికి చేరింది. అయితే అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా తక్కువగా వింటుంటాం. అత్తాకోడళ్లు అనుబంధం బాగుంటే ఆ ఇల్లు ఆనందంగా కళకళలాడుతుంది. కోడలిని కూతురిగా, అత్తను కూడా తల్లిగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం అత్తకోడళ్ళ మధ్య ఉన్న ప్రేమను చాటే ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది జరిగింది ఎక్కడో పరాయి దేశం, పక్క రాష్ట్రంలో కాదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని మెచ్చుకుంటున్నారు. మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. -
‘ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అబ్బయ చౌదరి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాద్యయాత్రలో పేద కుటుంబాలకు ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, కానీ టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేయించి అడ్డుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. చదవండి:ఏపీ సోషల్ రిఫార్మర్ సీఎం వైఎస్ జగన్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద ప్రజలు తమ స్వంతింటి కల నేరవేరుతోందని ఎంత ఆశగా చూశారో కానీ సమయానికి టీడీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. ద్రవ్యోల్బణ బిల్లును సైతం అడ్డుకుని ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్.. గాలాయాగూడెం గ్రామం నుంచి ఉద్దేశపూర్వకంగా కొంతమందిని పంపి ధర్నా చేయించాడన్నారు. ధర్నా చేసిన మహిళలకు ఇప్పటికే ఇళ్ల స్థలాలు పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు ఆపకపోతే సహించేది లేదని దెందులూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. -
పాలకొల్లులో వివాహిత అనుమానాస్పద మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు పట్టణం మావుళ్లమ్మ పేటలో ఓ వివాహిత అనుమానాస్పదం గా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన ప్రియదర్శిని అనే వ్యక్తికి, మొగల్తూరు మండలం తూర్పుతాళ్లుకు చెందిన కోడి దుర్గ(19)కు ఏడాది క్రితం పెరుపాలెం బీచ్‌లో పరిచయం ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరిలో దుర్గను ఇంటికి తీసుకొచ్చిన ప్రియదర్శిని.. ఏప్రిల్‌లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తొమ్మిదినెలల గర్భవతి. కాగా, శుక్రవారం రాత్రి దుర్గ అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్తే దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు. మరో వైపు దుర్గ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రియదర్శిని బంధువులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. -
వందకు ఐదొందల మార్కులు
సాక్షి, పశ్చిమ గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో ప్రజలు ఐదొందల మార్కులిచ్చారని ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన నవ రత్నాలను అమలు చేశారని ప్రశంసించారు. విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎనభై శాతం నెరవేర్చారని కొనియాడారు. సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం ఆర్.టి.సి.ని ప్రభుత్వం లో విలీనం చేసినందుకు క్రృతజ్ణతగా పాలకొల్లు శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీకి ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్, యడ్ల తాతాజీ, చిలువూరి కుమార దత్త్ర్యాయ వర్మ, చందక సత్తిబాబు పాల్గొన్నారు. -
డ్రైనేజీ సంపులో పడ్డ విద్యార్థినులు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: డ్రైనేజీ సంపు పైనున్న మూత విరిగిపోవడంతో దానిపై ఉన్న ముగ్గురు విద్యార్థినులు డ్రైనేజీలో పడిపోయిన సంఘటన జిల్లాలోని గోపాలపురం బాలయోగి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. మ్యాట్రిస్ రాణి ఆదేశాల మేరకు విద్యార్థినులు పాఠశాల ఆవరణలో మొక్కలు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంపు సుమారు ఆరు అడుగుల లోతు ఉండడంతో విద్యార్థినులు అందులో మునిగిపోయారు. దీంతో పక్కనే ఉన్న తోటి విద్యార్థినులు సెక్యూరిటీ గార్డు సహాయంతో వారిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. పిల్లలతో పనులు చేయించడమేంటని వార్డెన్‌ను నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం విద్యార్థినిలను ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కూతురిని గర్భవతిని చేసిన తండ్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలో ఘోరం జరిగిపోయింది. వావి వరుసలు మరిచి కన్నతండ్రే తన సొంత కూతురి(12)పై అత్యాచారం చేసిన దారుణ సంఘటన బుట్టాయిగూడెంలో వెలుగు చూసింది. గత కొంతకాలంగా తండ్రి చేసిన ఈ దుర్మార్గం వల్ల ఆ మైనర్ బాలిక గర్భవతి అయింది. ఈ విషయం తల్లికి చెబితే చంపుతానంటూ ఆ బాలికను బెదిరించాడు. కానీ, ఎలాగోలా తెలుసుకున్న ఆబాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడకి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయన మాటే పదివేలు..
సాక్షి, భీమవరం: ‘ఆటో, టాక్సీవాలాలకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం. ఇందువల్ల ఆ ఆటోడ్రైవర్‌కు రోడ్డు ట్యాక్స్, ఇన్సూ్యరెన్స్, చిన్నపాటి రిపేర్లు చేయించుకునే భారం తగ్గుతుంది. ఇన్సూ్యరెన్స్ చేయడం వల్ల ఆటోలో జరగరానిది ఏదైనా జరిగితే ఆటోలో వెళుతున్న కార్మికులకు ఊరట కలుగుతుంది’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గతేడాది మేలో ఏలూరులో జరిగిన బహిరంగ సభలో అన్న మాటలు. ఈ మాటలు ఆటో, టాక్సీవాలాలకు కొండంత భరోసా ఇస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఆటో, టాక్సీ కార్మికులు జగన్ హామీలపై చర్చించుకుంటున్నారు. జిల్లాలో సుమారు 10 వేల మంది టాక్సీడ్రైవర్లు, 35 వేల మంది ఆటోడ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు. అరకొర సంపాదనతో జీవితం భారంగా ఉన్న ఆటో, టాక్సీ కార్మికులకు జగన్ వరాలు ఊరట కలిగిస్తున్నాయని వారంతా భావిన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అంటున్నారు. ఆటో డ్రైవర్లకు చేయూత ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఎందరో యువత ఆటో, టాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆటో కొనుగోలు చేసినప్పుటి నుంచి ఏటా పన్నులు, బీమా, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.12 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ రూ.10 వేల హామీ వీరికి ఎంతో లబ్ధి చేకూర్చనుంది. దీనిపై ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రకటన భేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు లబ్ధి చేకూరుస్తానని మా కోసం హామీ ఇవ్వడం ఆనందంగా ఉంది. మా బాధలు తెలుసుకున్న ఆయన మా కోసం ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది మాకు చాలా ఆర్థిక ప్రయోజనం కలిగిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీ అమలవుతుందని భావిస్తున్నాం. – సంబలదీవి వెంకట సత్యనారాయణ (చిన్న), టాక్సీ డ్రైవర్ భీమవరం ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు నేను 30 ఏళ్లగా టాక్సీ నడుపుతున్నాను. గతంలో టాక్సీ ఫీల్డ్ బాగుండేది. ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. సరైన కిరాయిలు లేక ఖాళీగా ఉంటున్నాం. అయినా బీమా, బ్రేకు, ఇతర పన్నుల రూపంలో సుమారు రూ.20 వేలు కడుతున్నాం. ఈ ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్న జగన్ మా కోసం ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. –రుంజుల విఠాల్కుమార్, ది భీమవరం టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆటో డ్రైవర్లకు అన్ని కష్టాలే.. ప్రస్తుతం ఆటో డ్రైవర్లకు అన్ని కష్టాలే. ఒక పక్క డీజిల్ ధరలు పెరగడం, మరోపక్క పన్నుల భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి కష్టకాలంలో మాకు అండగా నిలబడి మా కోసం ఏడాదికి రూ.10 వేలు జగనన్న ఇస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీ తప్పక నెరవేరుస్తారనే నమ్మకం మాకు ఉంది. – బడుగు నాగరాజు, ఆటో డ్రైవర్, భీమవరం -
కెమేరామెన్‌పై ఎమ్మెల్యే పీఏ దౌర్జన్యం
సాక్షి, పెరవలి: ఎన్నికల విధి నిర్వహణ ఉన్న వీడియో గ్రాఫర్‌పై స్థానిక ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పీఏగా పనిచేస్తున్న నాని తీవ్ర దుర్భాషలాడి దౌర్జన్యంగా కెమెరాను లాక్కున్న సంఘటన శనివారం కొత్తపల్లి అగ్రహారంలో జరిగింది. పెరవలి మండలంలోని కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో ఎమ్మెల్యే సతీమణి విశాలాక్షి కొందరు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వీఎస్టీ టీమ్ (వీడియో సర్వే లైన్స్ టీమ్) వచ్చి ప్రచారాన్ని వీడియో తీస్తున్నారు. అక్కడే ఉన్న నాని ఉరుకున వచ్చి కెమేరామెన్ ఆంజనేయులుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కెమేరాను లాక్కుని నేలకేసి కొట్టాలని నాని తన అనుచరులకు పురమాయించారు. ఆ కెమేరామెన్ తన ఐడీ కార్డును చూపించినప్పటికీ నాని వినలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కెమేరామెన్ తన పైఅధికారి ఎం.జోగారావుకు జరిగిన ఘటనను ఫోన్లో వివరించాడు. దీంతో ఆయన నానితో సంప్రదింపులు జరిపిన తర్వాత కెమేరాను వెనక్కి ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దుర్భాషలాడడం, కెమేరాను లాక్కోవడం చట్టరీత్యా నేరమని ఎన్నికల అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై ‘సాక్షి’ కెమేరామెన్ ఆంజనేయులను సంప్రదించగా తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రచారాన్ని కవర్ చేస్తుండగా ఎమ్మెల్యే శేషారావు పీఏ నాని వచ్చి దుర్భాషలాడారని, ఐడెంటిటీ కార్డును చూపించినా దౌర్జన్యంగా కెమెరాను లాక్కున్నారని తెలిపాడు. జోగారావును వివరణ అడగగా కెమెరాను లాక్కోవడం వాస్తవమేనని తెలిపారు. తహసీల్దార్ సీహెచ్ విజయభాస్కర్‌ను వివరణ అడగగా తాను ఎన్నికల నిర్వహణలో నిడదవోలులో ఉన్నానని పెరవలి ఎస్సై గారిని వివరాలు అడగాలని తెలిపారు. ఎస్సై వి.జగదీశ్వరరావుని అడగగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు కడతామని తెలిపారు. ఎమ్మెల్యే శేషారావుకు నాని పర్సనల్ పీఏగా వ్యవహరిస్తారని స్థానికులు తెలిపారు. నాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. -
ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు
సాక్షి, కొవ్వూరు : జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబం దశాబ్దాల నుంచి ఉంది. తల్లిదండ్రులు, తనయుడు ముగ్గురూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న ఆరుదైన ఘనత వీరికి సొంతం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జెడ్పీ చైర్మన్‌గా, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలుపొంది స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పనిచేయడం మాగంటి కుటుంబం ప్రత్యేకం. -
ప.గో.జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
వెంకటాపురంలో హైడ్రామా
పశ్చిమగోదావరి , ఏలూరు రూరల్: ఏలూరు మండలం వెంకటాపురం పం చాయతీలో మంగళవారం హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ కార్యాయలంలో పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశానికి హాజరుకా వాల్సిన మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వదంతులు హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని కొందరు వార్డు సభ్యులు స్వయంగా మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో గ్రామంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో సర్పంచ్ చెరుకూరి దీప్తిఉష స మావేశానికి హాజరుకావడం లేదంటూ ఇన్చార్జి కార్యదర్శి రత్నం సమావేశాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. దీంతో అప్పటికే వచ్చిన అప్పలనాయుడు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగారు. గంట ముందు వాయిదా నోటీసు అందిస్తారా అంటూ ప్రశ్నించారు. పరువు కోసం పాకులాట టీడీపీ నుంచి బహిష్కృతుడైన రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా 9 మంది వార్డు సభ్యులు పార్టీకి రాజీనామా చేయడం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి సవాల్‌గా మారింది. గ్రామంలో 3.27 ఎకరాల్లో ఏర్పాటుచేసే లే–అవుట్, కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు అపార్ట్మెంట్లకు అనుమతి ఇస్తూ అజెం డాలో పేర్కొన్న అంశాలకు తీర్మానాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే వార్డు సభ్యులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే వీటిని పాలకవర్గ సమావేశంలో అప్పలనాయుడు వర్గం తిరస్కరించేందుకు సిద్ధమయ్యింది. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే వర్గీయులు తీర్మానం వీగిపోతే పరువు పోతుందనే ఆలోచనతో సభ్యులను కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారని పలువురు చెబుతున్నారు. చివరకు సర్పంచ్‌ను సమావేశానికి వెళ్లవద్దంటూ ఆదేశించి సమావేశాన్ని వాయిదా వేయించారని సభ్యులు అంటున్నారు. పాలకవర్గ సభ్యులు ప్రమేయం లేకుండా గ్రామంలో తీర్మానాలు, అభివృద్ధి పనులు తమ వర్గీయులకే ఎమ్మెల్యే బుజ్జి వర్గం కేటాయిస్తోందని అప్పలనాయుడు వర్గం ఆరోపిస్తోంది. మొత్తం 20 మంది వార్డు సభ్యుల్లో 9 మంది అప్పలనాయుడుకు మద్దతు ప్రకటించారు. 8 మంది ఎమ్మెల్యే వర్గం వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. -
9న మున్సిపాలిటీల ఉప ఎన్నిక
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో ఖాళీ అయిన కౌన్సిలర్ల స్థానాలకు ఉప ఎన్నికల తేదీ ఖరారయింది. కొవ్వూరు మున్సిపాలిటీలో 16 వార్డు టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ గత ఏడాది అదే పార్టీ నేతల మధ్య తలెత్తిన ఇసుక తగాదాలో హత్యకు గురయ్యారు. అలాగే, తణుకు మున్సిపాలిటీలో మూడో వార్డు కౌన్సిలర్ గుబ్బల రామారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన ఇండిపెండెంట్ గా నెగ్గి టీడీపీలో చేరారు. ఈ రెండు స్థానాలకు వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది