సాక్షి, పశ్చిమ గోదావరి: ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అబ్బయ చౌదరి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాద్యయాత్రలో పేద కుటుంబాలకు ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, కానీ టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్‌లు వేయించి అడ్డుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. చదవండి:ఏపీ సోషల్ రిఫార్మర్ సీఎం వైఎస్ జగన్
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద ప్రజలు తమ స్వంతింటి కల నేరవేరుతోందని ఎంత ఆశగా చూశారో కానీ సమయానికి టీడీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. ద్రవ్యోల్బణ బిల్లును సైతం అడ్డుకుని ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్.. గాలాయాగూడెం గ్రామం నుంచి ఉద్దేశపూర్వకంగా కొంతమందిని పంపి ధర్నా చేయించాడన్నారు. ధర్నా చేసిన మహిళలకు ఇప్పటికే ఇళ్ల స్థలాలు పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు ఆపకపోతే సహించేది లేదని దెందులూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment