వందకు ఐదొందల మార్కులు | Undi Former MLA P Sarraju Praised Chief Minister YS Jagan | Sakshi
Sakshi News home page

వందకు ఐదొందల మార్కులు

Published Fri, Sep 6 2019 7:12 PM | Last Updated on Fri, Sep 6 2019 7:32 PM

Undi Former MLA P Sarraju Praised Chief Minister YS Jagan - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వంద రోజుల పాలనలో ప్రజలు ఐదొందల మార్కులిచ్చారని ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన నవ రత్నాలను అమలు చేశారని ప్రశంసించారు. విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎనభై శాతం నెరవేర్చారని కొనియాడారు. 

సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం
ఆర్.టి.సి.ని ప్రభుత్వం లో విలీనం చేసినందుకు క్రృతజ్ణతగా పాలకొల్లు శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీకి ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్, యడ్ల తాతాజీ, చిలువూరి కుమార దత్త్ర్యాయ వర్మ, చందక సత్తిబాబు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement