undi constituency
-
‘ఉండి’ టికెట్ రగడ.. భీమవరంలో ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భీమవరం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై తెలుగుదేశం నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులు.. సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సెట్టింగ్ సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో రామరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది. చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు. -
వందకు ఐదొందల మార్కులు
సాక్షి, పశ్చిమ గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో ప్రజలు ఐదొందల మార్కులిచ్చారని ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన నవ రత్నాలను అమలు చేశారని ప్రశంసించారు. విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎనభై శాతం నెరవేర్చారని కొనియాడారు. సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం ఆర్.టి.సి.ని ప్రభుత్వం లో విలీనం చేసినందుకు క్రృతజ్ణతగా పాలకొల్లు శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీకి ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్, యడ్ల తాతాజీ, చిలువూరి కుమార దత్త్ర్యాయ వర్మ, చందక సత్తిబాబు పాల్గొన్నారు. -
టీడీపీకి షాకిచ్చిన నేతలు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పాలకోడేరు మండలంలో టీడీపీకి చెందిన వేండ్ర చంటిరాజు, శృంగవృక్షం బుజ్జిరాజు ,గొరగణమూడి పాపారావు,గరగనర్రు రాము తదితరులు వైసీపీలో చేరారు. ఉండి వైసీపీ కన్వీనర్ పి.వి.ఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమక్షంలో దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలతో కలిసి చేరారు . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉండి నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నేతల ప్రలోభాలు
-
రాష్ట్రంలో అరాచక పాలన
ఆకివీడు : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఇలాగే కొనసాగితే ప్రజలు చెప్పులు, రాళ్లతో కొడతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉండి నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం శనివార ఆకివీడు రైస్ మిల్లర్స్ హాలులో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ న్యాయం చేయమని వచ్చిన బాధితులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని టీడీపీ పాలకులపై ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక పాలనను అరికట్టేందుకు సమయం దగ్గరపడిందని అన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పాలనలో అరాచకం ఉందన్నారు. నియోజకవర్గంలో 170 ఎకరాల భూమిని పేదలకు పంచడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రూ.30 కోట్ల మంచినీటి పథకాన్ని నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి వెతలున్నప్పటికీ టీడీపీ నాయకులు కాలువల్లో దిగి పోజులిస్తున్నారని నాని ఆరోపించారు. ప్రజలు గమనిసూ్తనే ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో రాజన్న రాజ్యం రాబోతుందని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. కాగా బూత్ స్థాయి సమస్యల్ని వెలికితీసి వాటి పరిస్కారానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్లీనరీల విజయవంతంతో టీడీపీ కళ్లు తెరిపించామని చెప్పారు. జిల్లాస్థాయి ప్లీనరీకి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇంకా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం అని అన్నారు. ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పాతపాటి సర్రాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగకుండానే ప్రజల తలుపు తట్టి ప్రభుత్వ పథకాలు అందజేశానని గుర్తు చేశారు. కానీ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి కుంటుబడి పాతికేళ్లు వెనక్కిపోయిందన్నారు. ప్రజలు ఇదంతా గమనిసూ్తనే ఉన్నారని అన్నారు. సరియైన సమయంలో టీడీపీకి బుద్ధిచెబుతారని ఆకాంక్షించారు. అనంతరం బూత్, మండల కమిటీల ఎన్నికను ఆమోదించారు. పలు తీర్మానాలను ఆమోదించారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మ, నియోజకవర్గ నాయకుడు మేడిది జాన్సన్, కనకరాజు సూరి, చినమిల్లి వెంకట్రాయుడు, కాశిరెడ్డి, బూరుగుపల్లి సుబ్బారావు, శ్రీనుబాబు, మాజీ ఎమ్మెల్యే ఇందుకూరి రామకృష్ణంరాజు, పి.ఉమాదేవి, గుండా సుందర రామనాయుడు, గుల్లిపల్లి అచ్చారావు, ఇర్రింకి వీరరాఘవులు, కేశిరెడ్డి మురళీ, జగ్గురోతు విజయ్‌కుమార్, షేక్ హుస్సేన్, నంద్యాల సీతారామయ్య, జామి శ్రీనివాస్, పుప్పాల పండు, శిరపు శ్రీనివాస్, తోట శివాజీ, గ్లాడ్సన్, మోరా జ్యోతి పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
ఆకివీడు : మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసే విధంగా జిల్లాలో మోడల్ నియోజకవర్గంగా ఉండిని ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక ఏఎంసీలో గురువారం ఉండి నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశం ఎమ్మెల్యే శివరామరాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు మోడల్ నియోజకవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. వాటిలో జిల్లా నుంచి ఉండి నియోజకవర్గం ఎంపికైందన్నారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మోడల్ నియోజకవర్గం లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుంటూ, బీమా పథకాలు అమలు, హెల్త్ ఇన్సూరె¯Œ్స పథకాన్ని అన్ని కుటుంబాలకూ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, అంగ¯ŒSవాడీ కేంద్రాలకు భవనాలు, రోడ్ల అభివృద్ధి, పాఠశాలల్లో వసతులు, భవనాల సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్డి వంటివి అందజేయడం జరుగుతుందన్నారు. స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యతలో ముందుండాలన్నారు. అక్షరాస్యత అంటే సంతకం పెట్టడం, చదవడం మాత్రమే కాదని స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేయడం రావాలన్నారు. ప్రతి నెలా రివ్యూలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించాలని కలెక్టర్ భాస్కర్ సూచించారు. సమయం తగినంత లేదని కేవలం 355 రోజులు మాత్రమే ఉందన్నారు. నూరు శాతం గ్రామాలు అభివృద్ధి సాధించాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ ఉండి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తన వద్ద ప్రణాళిక ఉందన్నారు. డంపింగ్ యార్డుల నిర్మాణానికి, పుంతరోడ్లు, అంగ న్ వాడీ కేంద్రాల భవనాలు, పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, మరమ్మతులు, శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఏఎంసీ చైర్మ న్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.