రాష్ట్రంలో అరాచక పాలన
ఆకివీడు : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఇలాగే కొనసాగితే ప్రజలు చెప్పులు, రాళ్లతో కొడతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉండి నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం శనివార ఆకివీడు రైస్ మిల్లర్స్ హాలులో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ న్యాయం చేయమని వచ్చిన బాధితులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని టీడీపీ పాలకులపై ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక పాలనను అరికట్టేందుకు సమయం దగ్గరపడిందని అన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పాలనలో అరాచకం ఉందన్నారు. నియోజకవర్గంలో 170 ఎకరాల భూమిని పేదలకు పంచడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రూ.30 కోట్ల మంచినీటి పథకాన్ని నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి వెతలున్నప్పటికీ టీడీపీ నాయకులు కాలువల్లో దిగి పోజులిస్తున్నారని నాని ఆరోపించారు. ప్రజలు గమనిసూ్తనే ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో రాజన్న రాజ్యం రాబోతుందని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. కాగా బూత్ స్థాయి సమస్యల్ని వెలికితీసి వాటి పరిస్కారానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్లీనరీల విజయవంతంతో టీడీపీ కళ్లు తెరిపించామని చెప్పారు. జిల్లాస్థాయి ప్లీనరీకి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇంకా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం అని అన్నారు. ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పాతపాటి సర్రాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగకుండానే ప్రజల తలుపు తట్టి ప్రభుత్వ పథకాలు అందజేశానని గుర్తు చేశారు. కానీ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి కుంటుబడి పాతికేళ్లు వెనక్కిపోయిందన్నారు. ప్రజలు ఇదంతా గమనిసూ్తనే ఉన్నారని అన్నారు. సరియైన సమయంలో టీడీపీకి బుద్ధిచెబుతారని ఆకాంక్షించారు. అనంతరం బూత్, మండల కమిటీల ఎన్నికను ఆమోదించారు. పలు తీర్మానాలను ఆమోదించారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మ, నియోజకవర్గ నాయకుడు మేడిది జాన్సన్, కనకరాజు సూరి, చినమిల్లి వెంకట్రాయుడు, కాశిరెడ్డి, బూరుగుపల్లి సుబ్బారావు, శ్రీనుబాబు, మాజీ ఎమ్మెల్యే ఇందుకూరి రామకృష్ణంరాజు, పి.ఉమాదేవి, గుండా సుందర రామనాయుడు, గుల్లిపల్లి అచ్చారావు, ఇర్రింకి వీరరాఘవులు, కేశిరెడ్డి మురళీ, జగ్గురోతు విజయ్‌కుమార్, షేక్ హుస్సేన్, నంద్యాల సీతారామయ్య, జామి శ్రీనివాస్, పుప్పాల పండు, శిరపు శ్రీనివాస్, తోట శివాజీ, గ్లాడ్‌సన్, మోరా జ్యోతి పాల్గొన్నారు.