మౌలిక సదుపాయాలకు పెద్దపీట
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
Published Fri, Apr 14 2017 12:07 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఆకివీడు : మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసే విధంగా జిల్లాలో మోడల్ నియోజకవర్గంగా ఉండిని ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక ఏఎంసీలో గురువారం ఉండి నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశం ఎమ్మెల్యే శివరామరాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు మోడల్ నియోజకవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. వాటిలో జిల్లా నుంచి ఉండి నియోజకవర్గం ఎంపికైందన్నారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మోడల్ నియోజకవర్గం లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుంటూ, బీమా పథకాలు అమలు, హెల్త్ ఇన్సూరె¯Œ్స పథకాన్ని అన్ని కుటుంబాలకూ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, అంగ¯ŒSవాడీ కేంద్రాలకు భవనాలు, రోడ్ల అభివృద్ధి, పాఠశాలల్లో వసతులు, భవనాల సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్డి వంటివి అందజేయడం జరుగుతుందన్నారు. స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యతలో ముందుండాలన్నారు. అక్షరాస్యత అంటే సంతకం పెట్టడం, చదవడం మాత్రమే కాదని స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేయడం రావాలన్నారు. ప్రతి నెలా రివ్యూలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించాలని కలెక్టర్ భాస్కర్ సూచించారు. సమయం తగినంత లేదని కేవలం 355 రోజులు మాత్రమే ఉందన్నారు. నూరు శాతం గ్రామాలు అభివృద్ధి సాధించాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ ఉండి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తన వద్ద ప్రణాళిక ఉందన్నారు. డంపింగ్ యార్డుల నిర్మాణానికి, పుంతరోడ్లు, అంగ న్ వాడీ కేంద్రాల భవనాలు, పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, మరమ్మతులు, శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఏఎంసీ చైర్మ న్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement