ఆదిలాబాద్: కలెక్టర్‌కు కోపమొచ్చింది.. ఎప్పుడు శాంతంగా, సరదాగా కన్పించే రాహుల్‌రాజ్ తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచిన అధికారులను తీవ్రంగా మందలించిన కలెక్టర్, పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా అధికారులేవరూ సెలవులో వెళ్లవద్దని ఆదేశించిన కలెక్టర్ ప్రజావాణిని లైట్‌గా తీసుకుంటే సహించబోనని కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు.
అర్జీదారులు వచ్చిన రాకపోయినా ప్రతి జిల్లా స్థాయి అధికారి ఉదయం 10.30 గంటలకు సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా రావాలని లేకుంటే కుదరని తెల్చిచెప్పారు. ఈ నెల 21 న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సంక్షిప్త సమాచారంతో మంగళవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గుండె పోటుతో మరణించిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ మృతికి సంతాప సూచకంగా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు!
Comments
Please login to add a commentAdd a comment