
సాక్షి, పశ్చిమ గోదావరి : ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పాలకోడేరు మండలంలో టీడీపీకి చెందిన వేండ్ర చంటిరాజు, శృంగవృక్షం బుజ్జిరాజు ,గొరగణమూడి పాపారావు,గరగనర్రు రాము తదితరులు వైసీపీలో చేరారు. ఉండి వైసీపీ కన్వీనర్ పి.వి.ఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమక్షంలో దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలతో కలిసి చేరారు . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.