సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు.. వాటిని మేము ఎదుర్కొబోతున్నామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇప్పుడు కేసులు పెడితే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన.
కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని టీడీపీ ఖండించలేదు. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వైఎస్ జగన్, ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టారు. ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులు చంద్రబాబు హయాంలో కూడా పని చేశారు.
.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి వికృతమైన ఆనందం పొందాలని చూస్తున్నారు. నాడు రఘురామ కృష్ణంరాజు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచి చంద్రబాబుతో కలిశాడు. హైదరాబాద్‌లోనే ఉండి మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎల్లో మీడియాతో జతకట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టారు.
.. రఘురామను అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టారు. తనను కొట్టారని రఘురామ చెప్పారు. కొడితే గాయాలు ఉండాలి కదా?. తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని కోర్టులో చెప్పారు. కానీ, మూడేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి ఇప్పుడు కేసులు గుర్తుకు వచ్చాయా?. ఇంత కాలం ఎందుకు గుర్తుకురాలేదు’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే అధికారులు ఇబ్బందులు పడతారని, తర్వాత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి వారించారు.
ఇదీ చదవండి: రఘురామ ఓ అబద్ధాలకోరు.. మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment