
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామా మొదలుపెట్టింది. తులసి బాబుకి టీడీపీతో సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీలో ఇన్నాళ్లు ఉన్నా తమకు సంబంధం లేదంటూ టీడీపీ ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు కేసులో టీడీపీ నేత తులసిబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేకి బినామిగా ఉన్న నిందితుడు తులసిబాబు.. నారా లోకేష్‌తోనూ గతంలో ఫోటోలు దిగాడు. గుడివాడలో కలెక్టర్ ఇతర అధికారులతోనూ తులసిబాబు సమీక్షలు చేశారు. టీడీపీకి ఇప్పుడు సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ వింత ప్రకటన చేశారు. గుడివాడ టీడీపీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన తులసిబాబు.. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి వ్యవహారాలు చక్కపెట్టారు.
ఇదీ చదవండి: నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
Comments
Please login to add a commentAdd a comment