పశ్చిమ గోదావరి, సాక్షి: ఓడలు ఏదో ఒకనాటికి బండ్లు అవుతాయంటే ఇదేనేమో. తొమ్మిదేళ్లలో ఐదుసార్లు పార్టీలు మార్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజు.. చివరకు అనుకున్న సీటు దక్కించుకోలేక, ఓ అసెంబ్లీ సీటు సంపాదించుకోవడం కోసం ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేశారో తెలుగు రాష్ట్రాలు కళ్లారా చూశాయి.
ఈ ఐదేళ్లలో రఘురామ వెలగబెట్టింది ఏంటో అందరికీ తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్‌లో నిత్యం సీఎం జగన్‌ను, ఏపీ సర్కార్‌ను విమర్శిస్తూ.. ఢిల్లీలో ఉంటూ కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తూ కాలం వెల్లదీశారు. అయితే ఎన్నికలు ముగిసినా కూడా రఘురామ తన డ్యూటీని ఇంకా మానలేదు. పాపం స్పీకర్ సీటు మీద ఆయనకు ఆశలున్నాయేమో కదా. అందుకే.. పుట్టినరోజున కూడా ఘొల్లుమనే జోకులేశారు. జోస్యం పేరిట రఘురామ పేల్చిన ఆ జోకులనే యెల్లో మీడియా తెగ ప్రచారం చేసుకుంటోంది.
నిన్న(మే 14న) రఘురామ పుట్టినరోజు. పాపం.. పెద అమిరంలోని తన ఆఫీస్‌లో రచ్చబండ పెట్టారుకానీ జనాలు మాత్రం రాలేదు. అయినా రఘురామ తగ్గలేదు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ బిగ్గరగా మాట్లాడారు. ఏపీ కూటమి ఏకంగా 150కిపైగా సీట్లు దక్కించుకుందట. అధికారంలోకి వస్తుందట. ఆ మాటకు పక్కనున్న టీడీపీ నేతలు బయటకే నవ్వుకోవడం కనిపించింది. రఘురామ జోకులు అంతటితో ఆగలేదు.
తనపై మత వ్యతిరేకుడనే ముద్ర వేయించారని తెగ ఫీలైపోయారు. అంతేకాదు.. తన శపథం నెరవేరిందని, పోలింగ్‌కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే కూటమి గెలుస్తుందనడానికి సంకేతమంటూ మాట్లాడారు. అయితే రఘురామ వాస్తవాల్ని గ్రహించలేకపోతున్నారు. పోటెత్తిన ఓటర్లలో జగనన్న పాలనలో సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు, ఆ సంక్షేమం కొనసాగాలని కోరుకుంటున్న మహిళా ఓటర్లు.. అదే టైంలో ఇంకోవైపు పెన్షన్లు ఇంటికే అందక ఇబ్బందులు పడి చంద్రబాబును తెగ తిట్టుకున్న అవ్వాతాతలు.. అధికంగా ఉన్నారు. మరి వాళ్లంతా తిరిగి ఎవరికి పట్టం కడతారో ఊహించలేమా?. అయినా.. రాబోయేది జగన్ సర్కారే అని చెప్పడానికి గోదావరి జిల్లాల సిద్ధం సభలకు లభించిన స్పందన చాలాదా?.
Comments
Please login to add a commentAdd a comment