Short-circuit
-
షార్ట్‌సర్క్యూట్‌తో బ్యాంకులో మంటలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో యూనియన్ బ్యాంకులో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్యాంకు శాఖ లాకర్ రూంలో మొదట షార్ట్‌సర్య్కూట్ కారణంగా మంటలు లేచాయి. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంటలు ఆఫీసులోని కంప్యూటర్లను ఆవరించాయి. సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో భారీ ప్రమాదం
మరో రెండు గంటల్లో డ్యూటీ అయిపోతుంది. 150 మంది కార్మికులు వివిధ ఫ్లోర్లలో తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు లేచాయి. అంతే కలకలం మొదలైంది. ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నారు. అంతా వెంటనే అప్రమత్తమయ్యారు. నాలుగు,మూడు, రెండో ఫ్లోర్లో ఉన్న కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు పరుగులుపెట్టారు. ఈలోగా మంటలు మూడో ఫర్నేస్‌ను చుట్టుముట్టాయి అంతా పావు గంటలో జరిగిపోయింది. బయటకు రావడం ఏ మాత్రం ఆలస్యమైనా 16 మంది కార్మికులు మంటల్లో చిక్కుకునే వారు. గర్భాం సమీపంలోని ఆంధ్రాఫెర్రో అల్లాయీస్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనావేశారు. గర్భాం(మెరకముడిదాం): మండలంలోని గర్భాం సమీపంలో వున్న ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమ యాజమాన్యం, కార్మికుల కథ నం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మూడవ ఫర్నేస్ సమీపంలో ఉన్న విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 15 నిమిషాల్లో మూడో ఫర్నేస్‌ను చుట్టముట్టాయి. ఈ విషయాన్ని పరిశ్రమలో నైట్ డ్యూటీలో ఉన్న కార్మికులు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఒక వైపు తోటి కార్మికులను హెచ్చరిస్తూ, మరో వైపు పరిశ్రమ జేఎండీ నిమ్మిఖండేల్వాల్కు, వైస్ ప్రెసిడెంట్ పి.వి.ఎన్.విశ్వనాథ్న్కు, జీఎం మూర్తికి తెలి యజేశారు. అలాగే చీపురుపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు.విషయం తెలుసుకున్న జేఎండీ, వైస్ ప్రెసిడెంట్, జీఎం హుటాహుటీన పరిశ్రమకు చేరుకొని పరిశ్రమలో నైట్‌డ్యూటీ చేస్తున్న కార్మికులందరినీ అప్రమత్తం చేసి వారిని అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి దూరంగా పంపించారు.దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంతలోగా చీపురుపల్లి అగ్నిమాపక కేంద్రానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎం తకూ మంటలు అదుపులోకి రాలేదు. గజపతినగరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఆరు గంటల ప్రాంతంలో ఆ ఫైర్ఇంజిన్ రావడంతో రెండు ఫైర్ ఇంజిన్లకు చెందన సిబ్బంది తీవ్రంగా శ్రమించడం తో మంటలు కొంతమేర అదుపులోకి వచ్చాయి. అయితే ఇంతలో మూడవ ఫైర్ ఇంజిన్‌కు సమాచారం ఇవ్వడం తో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి మరో ఫైర్ ఇంజిన్ కూడా రావడంతో మూడింటికి చెందిన సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో పరిశ్రమలో 3వ ఫర్నేస్‌కు చెందిన యంత్ర సామగ్రి మొ త్తం కాలిబూడిదయింది. ఫర్నీష్ ట్రాన్స్ఫార్మర్, హైడ్రోలిక్ సిస్టమ్, కాపర్బస్బార్స్, మూడు, నాలుగు ఫ్లోర్ల, చార్జింగ్కార్ పూర్తిగా అగ్నికి అహుతయ్యాయి. బుదరాయవలస ఎస్ఐ కె.ప్రయోగమూర్తి, వీఆర్ఓ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదంజరిగింది. విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ వద్దే మొదట మంటలు చెలరేగాయి. దీంతో సుమారు రూ. 10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం. టెక్నికల్ సిబ్బంది వస్తేనే కానీ పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేయలేం. - నిమ్మిఖండేల్వాల్, జేఎండీ,ఆంధ్రాఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమ. ప్రాణనష్టం జరకుండా చూశాం అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వెంటనే అప్రమత్తమై కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా దూరంగా ఉంచాం. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగడంతో మంటలు చాలా సేపటివరకూ అదుపులోకి రాలేదు. - పి.వి.ఎల్.ఎన్.విశ్వనాథన్, ైవె స్ ప్రెసిడెంట్, ఆంధ్రాఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమ. అందరినీ అప్రమత్తం చేశాం పరిశ్రమలో నైట్‌డ్యూటీ చేస్తున్నాం, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫర్నేస్ ట్రాన్స్ఫార్మర్వద్ద మంటలు చెలరేగుతున్నట్టు కార్మికులు కేకలు వేయడంతో అక్కడ ఉన్న తోటి కార్మికులందరినీ అప్రమత్తం చేశాం. అక్కడ నుంచి దూరంగా పంపించేశాం. దీంతో ప్రాణనష్టం జరలేదు. - వెంకటరావు, కార్మికుడు, ఆంధ్రాఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమ -
షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు సజీవ దహనం
హైదరాబాద్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఓ చిన్నారితోపాటు రక్షించబోయిన మరో వ్యక్తి మృత్యువు పాలయ్యారు. సలీంనగర్ కాలనీలో రియాజుద్దీన్ అనే వ్యక్తి భార్య సమీరా బేగం, కుమార్తెలు అప్సాబేగం, బుస్రా (8 నెలలు)తో కలసి నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రియాజుద్దీన్ ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సమీరాబేగం పెద్దకుమార్తెతో బయటకు వచ్చేసింది. చిన్న కుమార్తె బుస్రాను కాపాడేందుకు యత్నించగా దట్టమైన పొగలు, మంటలు అప్పటికే ఇంటిని కమ్మేశాయి. పక్కింట్లో నివసించే సయ్యద్ మహబూబ్ అలీ అస్మీ (55) చిన్నారిని రక్షించేందుకు ఇంట్లోకి వెళ్ళాడు. మంటలు వ్యాపించడంతో బయటకి రాలేకపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం లోపలికి వెళ్లగా అస్మీ, బుస్రా విగతజీవులై కనిపించారు. వారిద్దరి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. -
మమ అనిపించారు
ఉట్నూర్ : కొమురంభీమ్ ప్రాంగణంలో కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశం ఆసాంతం సాదాసీదాగా సాగింది. అప్పుడప్పుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప.. సమస్యలపై వాడీవేడి చర్చ ఎక్కడా కనిపించలేదు. సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేష్, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాపూరావ్, నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, కోనేరు కోనప్ప, డీసీసీబీ చైర్మన్ దామోదర్, ఐటీడీఏ పీవో శ్రీనివాస్, జిల్లా ఉన్నతస్థారుు అధికారులు హాజరయ్యూరు. జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారేకావడంతో గిరిజన సంక్షేమంపై గట్టిగా ప్రశ్నించేందుకు బలమైన ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేకుండాపోరుుంది. దీంతో సమావేశం చప్పగా సాగింది. మొదట్లో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాగా.. సమావేశం ప్రారంభమయ్యూక ఖానాపూర్, ఆసిఫాబాద్, ముథోల్, చెన్నూర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చారు. ఒక్కరిద్దరు సభ్యులు ప్రశ్నలు లెవనెత్తినా.. అవి వారి పరిధి మండలాలకే పరిమితమయ్యూరుు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు వారి పరిధిలోని అధికారుల తీరును వివరించడంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై మండిపడ్డారు. సభ్యుల్లో కొట్టొచ్చిన అవగాహన లేమి.. ఐటీడీఏ పాలక వర్గం సమావేశంపై కొత్తగా ఎన్నికైన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలో అవగాహన లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎన్నిక కావడం.. పాలకవర్గం సమావేశానికి మొదటిసారిగా హాజరుకావడంతో.. జిల్లా పరిషత్ పనులా.. ఐటీడీఏ పనులా తెలియక సతమత మయ్యూరు. ఇంజినీరింగ్ విభాగం సమీక్షలో పలువురు సభ్యులు తమ పరిధిలోని పాఠశాలలు, ఇతర పనులపై సమస్యలు లేవనెత్తారు. దీంతో అధికారులు అవి తమ పరిధిలోకి రావంటూ సమాధానాలు ఇచ్చారు. అదీకాక వివిధ విభాగాల సమీక్ష సమయంలో కూడా సభ్యులు జిల్లా పరిషత్, ఆర్వీఎం, ఇతర విభాగాలకు సంబంధించిన పనులపై ఐటీడీఏ అధికారులను నిలదీశారు. దీంతో అదీ తమ పరిధి కాదంటూ సమాధానం ఇయ్యడంతో విస్తుపోయూరు. దీంతో ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. సభ్యుల్లో అవగాహన లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు అన్ని శాఖలకు చెందిన పనుల పూర్తి వివరాలు, అవి ఎవరి పరిధిలోకి వస్తాయో వివరిస్తూ నివేదికలు తయారు చేసి సభ్యులకు అందించాలన్నారు. ఎవరికి వారివే సమస్యలు.. జెడ్పీటీసీలు, ఎంపీపీలు వైద్య శాఖపై మండి పడ్డారు. ఆసిఫాబాద్ జెడ్పీటీసీ హేమాజీ తన మండలంలో గత సీజన్లో ఐదు వేల వరకు మ లేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 15 మంది చనిపోయూరని వైద్యాధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యూరని మండి పడ్డారు. పీహెచ్‌సీకి అంబులెన్సు లేక అత్యవసర వైద్యం కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఉట్నూర్ సీహెచ్‌సీలో వైద్యులు ఎల్లవేళ్లలా అందుబాటులో లేక.. గిరిజనులకు సరైన వైద్యం అందడం లేదని, మండలంలో ఉ న్న శ్యాంపూర్, హస్నాపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియకుండా ఉందన్నారు. మంచిర్యా ల ఏరియూ ఆస్పత్రికి అంబులెన్స్ లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దివాకర్‌రా వు తెలిపారు. దీంతో మంత్రి ఐకే రెడ్డి స్పంది స్తూ.. ఎవరైనా దాతలను చూసి అంబులెన్స్ ఏ ర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. నర్సాపూర్ పీహెచ్సీ భవన ం నిర్మాణం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు పూర్తికావడం లేదని సభ్యుడు ప్రస్తావించాడు. బజార్హత్నుర్ పీహెచ్సీలో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరని జెడ్పీటీసీ నారాయణ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దహెగాం మండలంలో వైద్యులు సమయానికి రావడం లేదని జెడ్పీటీసీ సుజాత పేర్కొన్నారు. దీంతో మంత్రులు జిల్లా వైద్యాధికారి రుక్మిణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు జిల్లాలకు వెళ్లిన వారిని రప్పించాలని ఆదేశించారు. దీంతో వైద్యాధికారి స్పందిస్తూ.. అది తన పరిధిలోనిది కాదని, వైద్యవిధాన పరిషత్ తీసుకున్న నిర్ణయమని వివరించారు. డీసీహెచ్ చంద్రమౌళి విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని, పలుమార్లు హెచ్చరించినా తన పనితీరు మార్చుకోవడం లేదని, ఆయన్ను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయూలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆశ్రమాల్లో విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నా.. చింతాపూర్లో రెండు నెలలుగా దొడ్డు బియ్యం వండిపెడుతున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య డీటీడబ్ల్యూ సావిత్రిపై మండిపడ్డారు. కృష్ణపల్లిలో రెండు నెలలుగా కోడిగుడ్లు పెట్టడం లేదన్నారు. ఆశ్రమాల్లో ఒక్కసారే వారానికి సరిపడా కాంట్రాక్టర్లు కూరగాయలు సరఫరా చేస్తుండడంతో గోదాముల్లో మురిగిపోతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. ఉట్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ సమయంలో వెల్లడైనట్లు వివరించారు. ప్రభుత్వం కొత్త ఏర్పాటు చేయూలనుకుంటున్న ఏకలవ్య పాఠశాలను ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటు చేయూలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల బాలికల మేనేజ్మెంట్ ఆశ్రమ పాఠశాలల్లో మహిళా సిబ్బందిని కాకుండా పురుషులను ఎలా నియమించారని ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రశ్నించారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో అందించే నాలుగు జతల బట్టలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీడీ స్పందిస్తూ.. ఇప్పటికే 25 శాతం మంది విద్యార్థులకు రెండు జతల బట్టలు అందించాల్సి ఉందని, ఆప్కోకు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేదని వివరించారు. దీంతో మంత్రి రామన్న డీడీపై మండిపడ్డారు. ‘ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు. సమస్య ఇంత జఠిలంగా ఉన్నా.. మా దృష్టికి తీసుకురారా’ అంటూ నిలదీశారు. ప్రతి విద్యార్థి కొలత తీసుకుని బట్టలు కుట్టాలని, లేకుండా ఏజెన్సీలు రద్దు చేయూలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మంచినీటి పథకాల్లో 425 వివిధ కారణాలతో పనిచేయడం లేదని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్ర సేన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్ననీటి పారుదల విభాగం చేపట్టిన పనులు ఇంకా పూర్తి కావడం లేదని మంత్రి రామన్న ఈఈఎంఐ రాజేశ్వర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 644 మంది లబ్ధిదారులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని, వివిధ కారణాలతో నిలిచిపోయూయని సీసీఎఫ్ తిమ్మారెడ్డి వివరించారు. వచ్చే సమావేశంలోగా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మంత్రి రామన్న ఆదేశించారు. అటవీ శాఖ ఆమోదం లేక నిలిచిపోరుున రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపేలా కృషి చేస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో భయందోళన.. భోజన విరామం తర్వాత ప్రారంభమైన కొద్ది సేపటికే సమావేశ మందిరంలో షార్ట్ సర్క్యూట్‌తో ట్యూబ్‌లైట్లు పగిలారుు. నిమిషాల వ్యవధిలో హాలులోని లైట్లు అన్నీ పగిలిపోవడంతో మంత్రులు, సభ్యులు, అధికారులు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు. కరెంట్ కట్ కావడంతో జనరేటర్ వేయడం వల్ల పవర్ హై ఓల్టేజీ సరఫరా అరుు ఇలా జరిగిందని సిబ్బంది చెప్పడంతో అందరూ మళ్లీ చేరుకున్నారు. సభ్యులందరి ఆమోదంతో అన్ని వసతులతో కొత్త భవనాన్ని ఏడాదిలోపు నిర్మించాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. -
ఎలా జరిగింది..?
వలిగొండ : మండలంలోని నర్సాయిగూడెంలో గల ఎస్టీఎల్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జిన్నింగ్ మిల్లులో గురువారం రాత్రి సుమారు 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో సుమారు 4వేల క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది. నష్టం కోటి 60 లక్షల వరకు ఉంటుందని బయ్యర్లు అంటున్నారు. అయితే ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ షార్ట్‌సర్క్యూట్ జరగడానికి అవకాశం లేదు. ఆ సమయంలో అక్కడ కూలీలు కూడ పనిచేయడం లేదంటున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదే జిన్నింగ్ మిల్లులో గతనెల 17న అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఆసమయంలో పాత మిగిలిపోయిన పత్తి, బేల్పట్టి(ఇనుప పట్టి)లు కావడంతో కేవలం రూ.రెండు లక్షల వరకు నష్టం మాత్రమే జరిగింది. ప్రమాదం జరిగినా వీడని నిర్లక్ష్యం.. గత నెల 17న ఇదే జిన్నింగ్‌మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మంచినీటి వసతి లేకపోవడం, ఫైర్‌సేఫ్టీ యంత్రాలు పనిచేయక పోవడంతో ఆ చిన్న అగ్ని ప్రమాదాన్ని నిలువరించలేకపోయారు. ఆ అగ్ని ప్రమాదం అనంతరమైన ఫైర్‌సేఫ్టీపై ృష్టి పెట్టకపోవడం మిల్లు యాజమాన్యం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం సీసీఐ కొనుగోలుదారులైన ఫైర్‌సేఫ్టీపై ృష్టి పెట్టకపోవడం విచిత్రంగా ఉంది. అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు అగ్నికి ఆహుతైన పత్తి సుమారు 4 వేల క్వింటాళ్ల వరకు ఉంటుందని, దీనిని సుమారు 5,6 రోజుల నుంచి కొనుగోలు చేసిందిగా కొనుగోలుదారులలో ఒకడైన కిషోర్ తెలిపారు. ఈ 5,6 రోజులలో ఇంత పెద్దమొత్తంలో పత్తి కొనుగోలు చేసి ఉంటారని, ఇన్సూరెన్స్ కోసం చేశారాని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పత్తి దగ్ధమైతుండగా అక్కడ ఉండాల్సిన సీసీఐ కొనుగోలుదారులు కార్యాలయంలో ఎస్బీఐ ఇన్సూరెన్స్ సంస్థకు సంబంధించిన కాగితాలు వెతుకుతుండడం పలువురి అనుమానాలకు ఆస్కారమిచ్చినట్లవుతోంది. ఈ 5, 6 రోజులలో ఎంతమంది రైతులు పత్తి అమ్మకాలు చేశారని పరిశీలిస్తే వాస్తవాలు బయటపడే అవకాశముందని పలువురు అనుకుంటున్నారు. (సీసీఐ కొనుగోలు చేయాలంటే రైతు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బాంక్ ఖాతా జిరాక్స్‌లు సమర్పిస్తేనే కొనుగోలు చేయాలన్న నిబంధన ఉందని మార్కెట్ కార్యదర్శి మధుకర్ తెలిపారు.) -
ఉద్వేగం..ఉద్విగ్నం!
ఎన్నో ఏళ్ల తరువాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు, పిల్లలు జువైనల్ హోంలో పలువుర్ని తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు సైదాబాద్: చెడు వ్యసనాలకు బానిసై ఇంటినుంచి పారిపోయి వచ్చిన వారు కొందరు...తల్లిదండ్రులు పనికి పంపిస్తున్నారని మరికొందరు..ఇంట్లో కొడుతున్నారని ఇంకొందరు.. ఇలా పలు కారణాలతో తల్లిదండ్రులకు దూరమై రైల్వే ఫ్లాట్‌ఫాంలపై జీవించి, చివరకు జువైనల్ హోంకు వచ్చిన బాలలు పలువురు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఎన్నో ఏళ్ల తరువాత పిల్లలను కలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికిలోనై బోరున ఏడ్చేశారు. పిల్లలు సైతం ఏడుస్తూ తల్లిదండ్రులను చుట్టేశారు. ఈ భావోద్వేగ సంఘటనలు చూసి అధికారులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. సైదాబాద్‌లోని బాలల సదనంలో సాథీ, ఆశ్రీత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా సదనం నుంచి బయటకు వెళ్తున్న బాలలందరికీ ప్రముఖ వ్యాపారవేత్త శశికాంత్ అగర్వాల్ కొత్త దుస్తులు అందించారు. చెడుదారి పట్టిన తమను మార్చి, విద్యాబుద్ధులు చెప్పించిన బాలల సదనం అధికారుల మేలు ఎప్పటికీ మర్చి పోలేమని కొంతమంది చిన్నారులు రోదిస్తూ చెప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో జువైనల్‌హోం డెరైక్టర్ వి. భాస్కరాచారి మాట్లాడుతూ మొత్తం 32 మంది బాలలను తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి శ్రీనివాస్, చైల్డ్వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్యామలాదేవి, డిప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, అశ్రీత సంస్థ డెరైక్టర్ నాగరాజు, సాథీ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలీస్ అవుతా మాది ఈసీఐఎల్ నాగారం. చిన్నప్పుడు మా మవయ్య కొట్టాడని ఇంట్లోంచి పారిపోయి రైల్వేస్టేషన్ చేరుకున్నాను. ఒక రోజు రైల్వే స్టేషన్లో షార్ట్‌సర్క్యూట్‌తో పెద్ద గాయం అయింది. దీంతో పోలీసులు సైదాబాద్ బాలల సదనంలో చేర్పించారు. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆరేళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను బాగా చదువకుని పోలీస్ అవుతా. -శివ -
‘సేవ్ ఎనర్జీ’కి ‘షార్ట్ సర్క్యూట్’
‘తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి’ని నగరానికి ప్రసాదించాలన్న ధ్యేయంతోప్రారంభమైన పథకం రాజమండ్రిలో కొడిగట్టింది. నగర పాలక సంస్థ అధికారుల నిర్వాకమే ఇందుకు కారణమని కాంట్రాక్టు సంస్థ అంటుండగా.. కాంట్రాక్టు సంస్థదే బాధ్యత అని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద వెలుగుల పథకం..షార్ట్ సర్క్యూట్‌తో మాడిపోయిన విద్యుద్దీపంలా మిగిలింది. సాక్షి, రాజమండ్రి :‘సేవ్ ఎనర్జీ’ (విద్యుత్‌ను ఆదా చేద్దాం) నినాదంతో దేశంలోనే తొలిసారిగా చారిత్రకనగరం రాజ మండ్రిలో అమలు చేసిన ఎల్ఈడీ వీధిలైట్ల పథకంపై చీకటి కమ్ముకుంది. వెలుగులు విరజిమ్మాల్సిన దీపాలు వెలవెలబోతున్నాయి. ఇందుకు నెపాన్ని నగర పాలకసంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ఈ పథకం కింత హైదరాబాద్‌కు చెందిన హైపీరియన్ గ్రీన్ ఎనర్జీ సంస్థతో 2009 నవంబరులో నగరపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హైపీరియన్ సొంత ఖర్చుతో ఎల్ఈడీ బల్బులు అమర్చి, ఏడేళ్ల పాటు రూ.3.90 వంతున వీధిలైట్ల కరెంటు బిల్లుకు ఏడాదికి రూ.1.91 కోట్లు కార్పొరేషన్ వెచ్చిస్తోంది. నగరంలో మొత్తం 11 వేల లైట్ల మార్పిడి ద్వారా కనీసం 60 శాతం విద్యుత్ ఆదా సాధించాలన్నది ఈ పథకం లక్ష్యం. కాంట్రాక్టు కాలంలో అలా ఆదా అయిన మొత్తాన్ని హైపీరియన్‌కు కొంత శాతాన్ని నగర పాలక సంస్థ ఇవ్వాలి. ఎవరేం చేయాలి... ఎల్ఈడీ లైట్ల వల్ల కరెంటు ఆదాను చూపించాల్సిన బాధ్యత హైపీరియన్దే. లైటు వరకూ నెట్వర్క్ అంటే స్విచ్చులు, వైరింగ్, విద్యుత్తు సరఫరా, మీటర్లు వంటి వాటిని సక్రమంగా ఉంచే బాధ్యత నగరపాలక సంస్థది. ఆదా అయిన విద్యుత్తు విలువలో మొదటి రెండు సంవత్సరాలు 90:10, మూడు, నాలుగు సంవత్సరాల్లో 85:15, ఐదు నుంచి ఏడేళ్ల వరకు 80:20 నిష్పత్తిలో హైపీరియన్, నగరపాలక సంస్థలు పంచుకోవాలి. ఆ సొమ్మునే హైపీరియన్కి ఇచ్చే లీజు మొత్తంగా పరిగణిస్తారు. అయితే 2009 నుంచి 2012 వరకూ ఎన్నిలైట్లు మార్చారు, ఏ ఏడాది ఎంత ఆదా అయింది, ఆ ప్రకారం హైపీరియన్కి ఎంత చెల్లించాలనే గణాంకాలను అధికారులు నిక్కచ్చిగా నమోదు చేయలేదని, దీనిపై ఆడిట్ అభ్యంతరాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. రోజుకు 11 గంటల కాలాన్ని వీధిలైట్లు వెలిగే సమయంగా పరిగణించి వినియోగం, ఆదాపై అంచనాలు వేయాలని, వేసవిలో కరెంటు కోత కాలంలో వినియోగం, ఆదా రెండూ లెక్కించరాదని ఒప్పందం. కానీ కోత సమయాలను పరిగణనలోకి తీసుకోలేదు. లైట్ల చోరీ జరిగినా, ప్రమాదాలు, తుపాన్ల వల్ల లైట్లు పాడైనా నగరపాలక సంస్థ భరించాలి. ఇందుకు మొత్తం లైట్లన్నింటికీ బీమా చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2013లో జల్ తుపానుతో లైట్లకు వాటిల్లిన నష్టం ఎవరు భరించాలన్న వివాదం నేటికీ తేలలేదు. అధికారుల నిర్లక్ష్యంతో రూ.50 లక్షల మేర నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాగా అధికారులు తాము తప్పించుకునేందుకు బాధ్యత తమదేనంటున్నారని కాంట్రాక్టు సంస్థ చెపుతోంది. తప్పుడు లెక్కలతో లక్షల బొక్కుడు.. విద్యుత్తు ఆదా 74 శాతం వరకూ ఉన్నా 60 శాతం మాత్రమే ఉన్నట్టు చూపుతున్నారని, ఈ విధమైన వ్యత్యాసాల ద్వారా నగర పాలక సంస్థ అధికారులు లక్షలు దిగమింగారని ఆరోపణలున్నాయి. ఏడాదికి రూ.26 లక్షల వరకు పక్కదారి పట్టాయంటున్నారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా..‘ఎలాగోలా’ సర్దుబాటు చేసుకున్న అధికారులు.. నగర పాలక సంస్థ చూసుకోవలసిన నెట్ వర్కింగ్ లోపాల నిర్వహణనూ హైపీరియన్ మీదే వేసి, ఆ మేరకు కూడా సొమ్ము చేసుకున్నట్టు చెపుతున్నారు. మొత్తమ్మీద అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు మధ్యన విభేదాలు తలెత్తడంతో ఎల్ఈడీ లైట్లు ఆలనాపాలనా ఎరుగని ‘అనాథ’ల్లా మారాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2013 జూన్‌లో నగరపాలక సంస్థ అధికారులు సర్వే చేయించగా 70 శాతం పైగా లైట్లు వెలగడం లేదని తేలింది. ఆ సంస్థ నుంచి కమిషన్లు దండుకున్నట్టు ఆరోపణలున్న అధికారులు వాటి నుంచి గట్టెక్కేందుకు ఇదే అదనుగా లైట్ల అధ్వానస్థితికి పూర్తి బాధ్యతను కాంట్రాక్టు సంస్థపై నెట్టేస్తూ లేఖలు, నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. మాకు తీవ్రనష్టం తెచ్చారు.. కార్పొరేషన్ చేయాల్సిన వైరింగ్ వంటి పనులను కూడా మా చేతే చేయించారు. మాకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టి, ఇప్పుడు తప్పంతా మాదేనంటున్నారు. ఎల్ఈడీ లైట్లతో ఆశించిన 60 శాతం కన్నా ఎక్కువగా 74 శాతం ఆదా అయినా తగ్గించి చూపేందుకు యత్నించారు. ఇప్పుడు అసలు ఆదాయే కావడం లేదని నెపం మాపై వేస్తున్నారు. వెలిగే లైట్ల వద్దే ఎక్కువ కరెంటు ఖర్చయ్యే లైట్లు బిగిస్తున్నారు. ఎల్ఈడీ లైట్ల వరకే మా బాధ్యత. నెట్ వర్కింగ్‌ను మున్సిపల్ సిబ్బంది చేయడం లేదు. - డాక్టర్ కె.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, హైపీరియన్ మరమ్మతుల్ని కార్పొరేషన్ చేయించింది.. లైట్ల నిర్వహణ బాధ్యత అంతా కాంట్రాక్టు సంస్థదే. ఇదే విషయాన్ని సూచిస్తూ గతంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సలహా మేరకు కంపెనీకి లేఖలు రాశాం. హైపీరియన్ సంస్థ మరమ్మతులు చేయకపోతే వాటిని కార్పొరేషన్ ద్వారా చేయించి ఆ ఖర్చును కంపెనీకి ఇచ్చే నిర్వహణా వ్యయం నుంచి మినహాయించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. - రవీంద్రబాబు, కమిషనర్, రాజమండ్రి నగర పాలక సంస్థ -
నిరుపేద బతుకుల్లో నిప్పులు
పి.గన్నవరం :రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవులు వారు. కూలీనాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు, చెమటోడ్చి సమకూర్చుకున్న సామాన్లు కళ్లెదుటే కాలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. ప్రాణాలు దక్కితే చాలనుకుని కట్టుబట్టలతో పరుగులు తీశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఉన్న పప్పులవారి పాలెం కాలనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు డాబాలు సహా 14 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఒక తాటాకిల్లు పాక్షికంగా దగ్ధం కాగా, సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. 26 కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, ఓ యువకుడు గాయపడ్డాడు. ఓ పాడి గేదె కూడా తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి. పప్పులవారి కాలనీలో సుమారు 100 ఇళ్లు ఉన్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో పప్పుల శ్రీనివాసరావుకు చెందిన తాటాకింట్లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న గడ్డిమేట అంటుకోవడం, అదే సమయంలో బలంగా గాలులు వీయడంతో నిప్పురవ్వలు సమీపంలోని తాటాకిళ్లపై ఎగిరిపడడంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. ఒకవైపు విపరీతమైన మంటలు, మరోవైపు దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలరచేత పట్టుకుని పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉధృతమయ్యాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి, బంగారు, వెండి వస్తువులు, నగదు, బైక్, సైకిళ్లు బూడిదయ్యాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా దగ్ధమయ్యాయి. పప్పుల రామారావుకు చెందిన 8 వేల కొబ్బరికాయల రాశి కాలిపోయింది. కొబ్బరికాయలు పేలుతూ ఎగిరిపడ్డాయి. ప్రమాదంలో చిక్కుకున్న పాడిగేదెను రక్షించబోయిన పప్పుల ధర్మారావు అనే యువకుడు గాయపడగా, అతడిని చికిత్స కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పప్పుల శ్రీని వాస్కు చెందిన పాడిగేదె తీవ్రంగా కాలిపోయింది. బాధితుల ఆక్రందన కష్టార్జితం కళ్లెదుటే కాలి బూడిద కావడంతో బాధితుల ఆక్రందనలకు అంతులేకుండా పోయింది. సర్వం తుడిచిపెట్టుకుపోయిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తపేట, అమలాపురం అగ్నిమాపకాధికారులు ఎన్.వెంకట్రావు, ఎండీ ఇబ్రహీం ఆధ్వర్యంలో సిబ్బంది స్థానికుల సహకారంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో అగ్నిమాపక శకటాలు రావడంతో నష్టం తగ్గిందని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితులకు గ్రామస్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ ఎల్.జోసెఫ్, ఆర్ఐ బొరుసు లక్ష్మణరావు, ఎస్సై జి.హరీష్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా 10 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ వంతున అందిస్తామన్నారు. పూర్తిగా కాలిన ఇంటికి రూ.5 వేలు, పాక్షికంగా కాలిన ఇంటికి రూ.4 వేల వంతున పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు దాసరి కాశి, కొక్కిరి రవికుమార్, తోలేటి బంగారునాయుడు, మర్రి శ్రీను, నేతల నాగరాజు, టీడీపీ నాయకులు సంసాని పెద్దిరాజు తదితరులు పరామర్శించారు. -
కలెక్టరేట్లో అగ్నిప్రమాదం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. సునయన ఆడిటోరియం షటిల్ బాడ్మింటన్ కోర్టు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన పాత కంప్యూటర్లు, యూపీఎస్‌లు, ఇతర ఎలక్ట్రికల్ సామగ్రి కాలిపోయింది. సునయన ఆడిటోరియం కంట్రోల్ రూమ్‌లో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగడంతో ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది, తదితరులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సునయన ఆడిటోరియంలోకి మాత్రం మంటలు వ్యాపించలేదు. నిర్వహణలోపం వల్లే : కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా, ఎలక్ట్రికల్ వస్తువుల నిర్వహణ సరిగా లేకపోవడమే షార్ట్ సర్క్యూట్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఘటన కారణంగా సుమారు 20 పాత కంప్యూటర్లు, యూపీఎస్‌లు దగ్ధమయ్యాయి. కర్నూలు అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది. జిల్లా అగ్నిమాపక దళాధికారి భూపాల్‌రెడ్డి కూడా పరిస్థితిని సమీక్షించారు. కాలిపోయినవన్నీ పనికిరానివి, పాతవి అయినందునా నష్టమేమీ లేదని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. డీఆర్వోతోపాటు కలెక్టరేట్ పాలనాధికారి మాధవరావు తదితరులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కారణాలను సమీక్షించారు. ఇది రెండోసారి: కలెక్టరేట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం ఇది రెండోసారి. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగిం రూ.10 లక్షల విలువైన కంప్యూటర్లు, యూపీఎస్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష!
ముంబై: వేసవి కాలం.. అగ్నికి ఆజ్యం పోసే కాలం. ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వింటూనే ఉంటాం. అనుకోకుండా మన దగ్గర ప్రమాదం జరిగితే ఒక్కోసారి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. ఆ అగ్ని ప్రమాదం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. కళ్లెదుటే సర్వస్వం బుగ్గి పాలవుతుంటే గుండెలు పగిలే వేదన అనుభవించాల్సి వస్తుంది. అప్పటి వరకు దర్జాగా జీవించిన వారు ప్రమాదం జరిగిన మరుక్షణమే కట్టుబట్టలతో రోడ్డున పడతారు. దిగువ, మధ్య తరగతి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడిపోతారు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఏమీ చేయలేని మనం అవి జరగకుండా మాత్రం ఎన్నైనా చేయగలం. కనీసం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎనలేని ఆస్తులు, ప్రాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలం. ప్రమాదాలను నివారించే వీలు కూడా ఉంటుంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ప్రమాదాలు దరికి రాకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు ఇంట్లోని వస్తువులు అల్మారాలు, షెల్పుల్లో సక్రమంగా ఉంచండి. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే గుణం ఉన్న వస్తువులు, సామగ్రి అందుబాటులో లేకుండా చూడాలి. కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పి వేయాలి. ఇంట్లో ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలు వాడాలి. పాడైన వైర్లు వాడొద్దు. ఓవర్‌లోడ్ వేయొద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లలో దాని సామర్థ్యానికి మించి ప్లగ్‌లను వాడొద్దు. పడుకుని పొగ తాగొద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులపై కుటుంబంతో బయటకు వెళ్తే ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. టపాకాయలు కాల్చే సమయంలో నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు. వేసవిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి, నేలరాలిన ఎండుటాకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్చి బయటపడేయాలి. {పమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వేసవికాలంలో రాత్రిళ్లు కరెంటు ఎక్కువగా పోతుంది. కరెంటు పోయినప్పుడు క్యాండిళ్లు, కిరోసిన్ దీపాలు వెలిగించి అలాగే నిద్ర పోతుంటాం. అలా కాకుండా పడుకునే ముందు వాటన్నింటిని ఆర్పి వేయాలి. తప్పదనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. {పమాదవశాత్తు నిప్పంటుకుంటే భయంతో పరుగెత్తకూడదు. దుప్పట్లు, తట్టులతో మంటలను కప్పేయాలి. వీలైనంత వరకు నేలపై దొర్లాలి. పాఠశాలలు, ఆస్పత్రుల్లో.. పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌లో ఆర్సీసీ లేదా కాంక్రిట్ స్లాబులనుమాత్రమే పైకప్పులుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి. పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునేందుకు సరైన ప్రణాళిక రచించి అది అందరికీ తెలిసే విధంగా తగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లే మార్గాల్లో(మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని వాడాలి. తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పు కలిగిన నిర్మాణాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహించరాదు. షార్ట్‌సర్క్యూట్ జరిగితే అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అమర్చుకోవాలి. అగ్ని ప్రమాదం అరికట్టడానికి సరిపడా నీరు, ఫిక్సిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా నిర్వహించాలి. కర్మాగారాల్లో.. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల ఉనికిని గుర్తించేలా ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి. అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. మిషనరీ బెల్టులు, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్క్యూట్లో ఓవర్ లోడ్ వేయకూడదు. మండే స్వభావం ఉన్న దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే.. {పమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి. విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగితే నీటిని ఉపయోగించకుండా పొడి ఇసుక లేదా మట్టి వాడాలి. ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పెళ్లి పందిళ్లు, ఇతర పందిళ్లు వేయాలి. పందిళ్ల చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ స్థలాన్ని ఉంచాలి. ఎలక్ట్రికల్ లైవ్ వైర్లు, పెండాల్స్కు కనీసం రెండు మీటర్ల దూరం ఉంచాలి. వంటింట్లో.. వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ట్యూబ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మార్చాలి. నాణ్యమైన ట్యూబ్లనే వాడాలి. గ్యాస్ స్టౌ ఎత్తయిన ఫ్లాట్‌ఫాంపై ఉండేలా చూసుకోవాలి. వంట గ్యాస్ వాడకం పూర్తి కాగానే రెగ్యులేటర్ వాల్వ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆపి వేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, ఆన్ ఆఫ్ చేయొద్దు. వెంటనే అగ్నిమాపక, గ్యాస్ కంపెనీల సాయం కోరాలి. మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయొద్దు. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివిస్టౌ దగ్గర నిల్వ ఉంచరాదు. గోదాముల్లో.. వస్తు నిల్వలను చెక్క స్లీపర్లపై నిల్వ చేయాలి. గోదాం బయట వస్తువులను నిల్వ చేయరాదు. పరిసర ప్రాంతాల్లో పొగతాగడం వంటివి నిషేధించాలి. వివిధ రకాల వస్తువులను స్టోరేజీ ర్యాకుల్లో విడివిడిగా నిల్వ చేయాలి. గోదాముల్లో తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. వస్తు నిల్వల మధ్యలో గ్యాంగ్వే, క్రాస్‌వే సెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది. వస్తువుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు ఆపివేయాలి. వస్తు నిల్వలు 4, 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు. తప్పనిసరి అయితే నిల్వలకు పెకప్పు కనీసం రెండు అడుగుల దూరం ఉంచాలి. గోదాం సమీపంలో తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి. -
మానికొండలో భారీ అగ్నిప్రమాదం
25 గుడిసెలు, మూడు గృహాలు దగ్ధం రూ.10 లక్షల ఆస్తి నష్టం వలస కూలీల కష్టం బూడిదపాలు మానికొండ (ఉంగుటూరు), న్యూస్‌లైన్ : పొట్టకూటి కోసం వలస వచ్చిన కూలీల జీవితాలతో అగ్నిదేవుడు ఆడుకున్నాడు. జిల్లాలు దాటి ఊరుగాని ఊరు వచ్చిన వలస కూలీల నివాసం ఉన్న 25 గుడిసెలు, మూడు గృహాలు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన మండలంలోని మానికొండలో గురువారం జరిగింది. దీంతో స్థానిక ఓ రైతు ఇంట ఆశ్రయం పొందిన నిల్వ కూలీలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూడెం మండలం దువ్వినెల్ల గ్రామానికి చెందిన 25 కుటుంబాలవారు మానికొండలోని కొంతమంది రైతుల వద్ద చెరుకు పనుల కోసం కొద్దిరోజుల క్రితం వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. విద్యుత్ కోత అనంతరం రెండు గంటలకు కరెంట్ వచ్చిందని, ఆ తర్వాత పది నిమిషాలకు ఈ ఘటన జరిగిందని, షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. గుడిసెల్లో ఉన్న మినీ గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. పక్కనే ఉన్న గుగిళ్ల పెద సాంబయ్య, ఉమాశంకర్, రాణి, సుబ్రమణ్యంలకు చెందిన మూడు ఇళ్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో కూలీలందరూ పనులకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన కూలీలు అక్కడికి చేరుకుని కష్టమంతా బూడిదైందని గగ్గోలు పెడుతున్నారు. వారి రోదనలతో ఘటనాస్థలి దద్దరిల్లింది. బాధితులకు తక్షణ సాయం కింద రూ.5 వేలు చొప్పున అందించినట్లు తహశీల్దారు వి.మురళీకృష్ణ తెలిపారు. వలస కూలీలను ఆదుకోనాలి అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వలస కూలీలను అన్నిరకాలుగా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అధికారులను కోరారు. సంఘటన స్థలంలో దృశ్యాలను చూసి చలించిపోయారు. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు తీవ్రంగా నష్టపోవటంతో కట్టుబట్టలే మిగిలాయని, వారిని మానవతాదృక్పథంతో ఆదుకోవాలని జిల్లా అధికారులను కోరారు. జిల్లా రైతు కన్వీనరు కొల్లి రాజశేఖర్, మండల మహిళా అధ్యక్షురాలు సూరెడ్డి శ్రీమణిమ్మ, యూత్ నాయకుడు దుట్టా రవిశంకర్, సర్పంచ్ జి.కృష్ణబాబు తదితరులు బాధితులను పరామర్శించారు. -
ఏడ్చి... ఏడ్చి... కన్నీరు ఇంకి..
-
ప్రమాదం నుంచి జస్ట్ మిస్...
చల్ల చల్లని కూల్ కూల్ అంటూ ఏసీ వేసుకుని హాయిగా సేద తీరుతుంటాం. కానీ, టైమ్ బాగా లేకపోతే అదే ఏసీ ఒక్కోసారి వేడి పుట్టించేస్తుంది. అప్పుడు మాత్రం టెన్షన్ పడక తప్పదు. శనివారం శ్రీదేవి ఇంటిల్లిపాదినీ ఆమె పడకగదిలోని ఏసీ అలానే టెన్షన్లో పడేసింది. అందులోంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయట. ఆ సమయంలో ఇంట్లో తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషి, తన అత్తగారితో ఉన్నారట శ్రీదేవి. సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందట. ఇంటికి కిలోమీటర్ దూరంలోనే బోనీకపూర్ ఆఫీసు ఉండటంతో, ఆయన అగ్నిప్రమాదం గురించి తెలుసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారట. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. దీనివల్ల శ్రీదేవి ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సమాచారం. దాంతో ఆ రాత్రి ఈ కుటుంబం ఓ హోటల్లో బస చేశారట.