షార్ట్ సర్క్యూట్‌తో భారీ ప్రమాదం | Huge accident with Short-circuit | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో భారీ ప్రమాదం

Published Wed, Mar 18 2015 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

Huge  accident with Short-circuit

 మరో రెండు గంటల్లో డ్యూటీ అయిపోతుంది. 150 మంది కార్మికులు వివిధ ఫ్లోర్లలో తమ పనుల్లో  నిమగ్నమై ఉన్నారు. ఇంతలో  విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు లేచాయి. అంతే కలకలం మొదలైంది. ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నారు. అంతా వెంటనే అప్రమత్తమయ్యారు. నాలుగు,మూడు, రెండో ఫ్లోర్‌లో ఉన్న కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు పరుగులుపెట్టారు.  ఈలోగా మంటలు మూడో ఫర్నేస్‌ను చుట్టుముట్టాయి అంతా పావు గంటలో జరిగిపోయింది. బయటకు రావడం           ఏ మాత్రం ఆలస్యమైనా 16 మంది కార్మికులు మంటల్లో చిక్కుకునే వారు.  గర్భాం సమీపంలోని ఆంధ్రాఫెర్రో అల్లాయీస్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనావేశారు.
 
 గర్భాం(మెరకముడిదాం):    మండలంలోని గర్భాం సమీపంలో వున్న ఆంధ్రా ఫెర్రో  అల్లాయీస్  పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం    సంభవించింది. పరిశ్రమ యాజమాన్యం, కార్మికుల కథ నం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  మూడవ ఫర్నేస్ సమీపంలో ఉన్న విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 15 నిమిషాల్లో మూడో ఫర్నేస్‌ను చుట్టముట్టాయి. ఈ విషయాన్ని పరిశ్రమలో నైట్ డ్యూటీలో ఉన్న  కార్మికులు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఒక వైపు తోటి కార్మికులను హెచ్చరిస్తూ, మరో వైపు పరిశ్రమ జేఎండీ  నిమ్మిఖండేల్‌వాల్‌కు, వైస్ ప్రెసిడెంట్ పి.వి.ఎన్.విశ్వనాథ్‌న్‌కు, జీఎం మూర్తికి తెలి యజేశారు.
 
  అలాగే చీపురుపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు.విషయం తెలుసుకున్న జేఎండీ, వైస్ ప్రెసిడెంట్, జీఎం హుటాహుటీన పరిశ్రమకు చేరుకొని పరిశ్రమలో నైట్‌డ్యూటీ చేస్తున్న కార్మికులందరినీ అప్రమత్తం చేసి వారిని అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి దూరంగా పంపించారు.దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంతలోగా చీపురుపల్లి అగ్నిమాపక కేంద్రానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎం తకూ మంటలు అదుపులోకి రాలేదు.  గజపతినగరం అగ్నిమాపక  కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఆరు గంటల ప్రాంతంలో  ఆ ఫైర్‌ఇంజిన్ రావడంతో రెండు ఫైర్ ఇంజిన్లకు చెందన సిబ్బంది తీవ్రంగా శ్రమించడం తో  మంటలు కొంతమేర అదుపులోకి వచ్చాయి.
 
 అయితే ఇంతలో మూడవ ఫైర్ ఇంజిన్‌కు సమాచారం ఇవ్వడం తో   శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి మరో ఫైర్ ఇంజిన్ కూడా రావడంతో మూడింటికి చెందిన సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో పరిశ్రమలో 3వ ఫర్నేస్‌కు చెందిన యంత్ర సామగ్రి  మొ త్తం  కాలిబూడిదయింది.   ఫర్నీష్ ట్రాన్స్‌ఫార్మర్, హైడ్రోలిక్ సిస్టమ్, కాపర్‌బస్‌బార్స్, మూడు, నాలుగు ఫ్లోర్ల, చార్జింగ్‌కార్ పూర్తిగా అగ్నికి అహుతయ్యాయి. బుదరాయవలస ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి, వీఆర్‌ఓ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
 విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే  
 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే  ప్రమాదంజరిగింది.   విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ వద్దే మొదట మంటలు చెలరేగాయి. దీంతో సుమారు రూ. 10 కోట్ల నుంచి  రూ.15 కోట్ల  వరకూ నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం.  టెక్నికల్ సిబ్బంది వస్తేనే కానీ పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేయలేం.
 - నిమ్మిఖండేల్‌వాల్,  
 జేఎండీ,ఆంధ్రాఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమ.
 
 ప్రాణనష్టం జరకుండా చూశాం
  అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వెంటనే అప్రమత్తమై కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా  దూరంగా ఉంచాం.   విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగడంతో   మంటలు చాలా సేపటివరకూ అదుపులోకి రాలేదు.
 - పి.వి.ఎల్.ఎన్.విశ్వనాథన్,
 ైవె స్ ప్రెసిడెంట్, ఆంధ్రాఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమ.
 
 అందరినీ అప్రమత్తం చేశాం
 పరిశ్రమలో నైట్‌డ్యూటీ చేస్తున్నాం, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫర్నేస్ ట్రాన్స్‌ఫార్మర్‌వద్ద మంటలు చెలరేగుతున్నట్టు కార్మికులు కేకలు వేయడంతో అక్కడ ఉన్న తోటి కార్మికులందరినీ అప్రమత్తం చేశాం.  అక్కడ నుంచి దూరంగా పంపించేశాం. దీంతో ప్రాణనష్టం జరలేదు.
 - వెంకటరావు, కార్మికుడు,
 ఆంధ్రాఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement