గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో యూనియన్ బ్యాంకులో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో యూనియన్ బ్యాంకులో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్యాంకు శాఖ లాకర్ రూంలో మొదట షార్ట్‌సర్య్కూట్ కారణంగా మంటలు లేచాయి. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంటలు ఆఫీసులోని కంప్యూటర్లను ఆవరించాయి. సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.