మమ అనిపించారు | ITDA ruling class meeting in komarambeem area | Sakshi
Sakshi News home page

మమ అనిపించారు

Published Fri, Feb 20 2015 4:49 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

మమ అనిపించారు - Sakshi

మమ అనిపించారు

ఉట్నూర్ : కొమురంభీమ్ ప్రాంగణంలో కలెక్టర్ జగన్‌మోహన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశం ఆసాంతం సాదాసీదాగా సాగింది. అప్పుడప్పుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప.. సమస్యలపై వాడీవేడి చర్చ ఎక్కడా కనిపించలేదు. సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేష్, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాపూరావ్, నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, కోనేరు కోనప్ప, డీసీసీబీ చైర్మన్ దామోదర్, ఐటీడీఏ పీవో శ్రీనివాస్, జిల్లా ఉన్నతస్థారుు అధికారులు హాజరయ్యూరు.

జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారేకావడంతో గిరిజన సంక్షేమంపై గట్టిగా ప్రశ్నించేందుకు బలమైన ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేకుండాపోరుుంది. దీంతో సమావేశం చప్పగా సాగింది. మొదట్లో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాగా.. సమావేశం ప్రారంభమయ్యూక ఖానాపూర్, ఆసిఫాబాద్, ముథోల్, చెన్నూర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చారు. ఒక్కరిద్దరు సభ్యులు ప్రశ్నలు లెవనెత్తినా.. అవి వారి పరిధి మండలాలకే పరిమితమయ్యూరుు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు వారి పరిధిలోని అధికారుల తీరును వివరించడంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై మండిపడ్డారు.
 
సభ్యుల్లో కొట్టొచ్చిన అవగాహన లేమి..
ఐటీడీఏ పాలక వర్గం సమావేశంపై కొత్తగా ఎన్నికైన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలో అవగాహన లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎన్నిక కావడం.. పాలకవర్గం సమావేశానికి మొదటిసారిగా హాజరుకావడంతో.. జిల్లా పరిషత్ పనులా.. ఐటీడీఏ పనులా తెలియక సతమత మయ్యూరు. ఇంజినీరింగ్ విభాగం సమీక్షలో పలువురు సభ్యులు తమ పరిధిలోని పాఠశాలలు, ఇతర పనులపై సమస్యలు లేవనెత్తారు. దీంతో అధికారులు అవి తమ పరిధిలోకి రావంటూ సమాధానాలు ఇచ్చారు.

అదీకాక వివిధ విభాగాల సమీక్ష సమయంలో కూడా సభ్యులు జిల్లా పరిషత్, ఆర్వీఎం, ఇతర విభాగాలకు సంబంధించిన పనులపై ఐటీడీఏ అధికారులను నిలదీశారు. దీంతో అదీ తమ పరిధి కాదంటూ సమాధానం ఇయ్యడంతో విస్తుపోయూరు. దీంతో ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. సభ్యుల్లో అవగాహన లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు అన్ని శాఖలకు చెందిన పనుల పూర్తి వివరాలు, అవి ఎవరి పరిధిలోకి వస్తాయో వివరిస్తూ నివేదికలు తయారు చేసి సభ్యులకు అందించాలన్నారు.
 
ఎవరికి వారివే సమస్యలు..
జెడ్పీటీసీలు, ఎంపీపీలు వైద్య శాఖపై మండి పడ్డారు. ఆసిఫాబాద్ జెడ్పీటీసీ హేమాజీ తన మండలంలో గత సీజన్‌లో ఐదు వేల వరకు మ లేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 15 మంది చనిపోయూరని వైద్యాధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యూరని మండి పడ్డారు. పీహెచ్‌సీకి అంబులెన్సు లేక అత్యవసర వైద్యం కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఉట్నూర్ సీహెచ్‌సీలో వైద్యులు ఎల్లవేళ్లలా అందుబాటులో లేక.. గిరిజనులకు సరైన వైద్యం అందడం లేదని, మండలంలో ఉ న్న శ్యాంపూర్, హస్నాపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియకుండా ఉందన్నారు.

మంచిర్యా ల ఏరియూ ఆస్పత్రికి అంబులెన్స్ లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దివాకర్‌రా వు తెలిపారు. దీంతో మంత్రి ఐకే రెడ్డి స్పంది స్తూ.. ఎవరైనా దాతలను చూసి అంబులెన్స్ ఏ  ర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. నర్సాపూర్ పీహెచ్‌సీ భవన ం నిర్మాణం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు పూర్తికావడం లేదని సభ్యుడు ప్రస్తావించాడు. బజార్‌హత్నుర్ పీహెచ్‌సీలో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరని జెడ్పీటీసీ నారాయణ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దహెగాం మండలంలో వైద్యులు సమయానికి రావడం లేదని జెడ్పీటీసీ సుజాత పేర్కొన్నారు.

దీంతో మంత్రులు జిల్లా వైద్యాధికారి రుక్మిణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు జిల్లాలకు వెళ్లిన వారిని రప్పించాలని ఆదేశించారు. దీంతో వైద్యాధికారి స్పందిస్తూ.. అది తన పరిధిలోనిది కాదని, వైద్యవిధాన పరిషత్ తీసుకున్న నిర్ణయమని వివరించారు. డీసీహెచ్ చంద్రమౌళి విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని, పలుమార్లు హెచ్చరించినా తన పనితీరు మార్చుకోవడం లేదని, ఆయన్ను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయూలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆశ్రమాల్లో విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నా.. చింతాపూర్‌లో రెండు నెలలుగా దొడ్డు బియ్యం వండిపెడుతున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య డీటీడబ్ల్యూ సావిత్రిపై మండిపడ్డారు.

కృష్ణపల్లిలో రెండు నెలలుగా కోడిగుడ్లు పెట్టడం లేదన్నారు. ఆశ్రమాల్లో ఒక్కసారే వారానికి సరిపడా కాంట్రాక్టర్లు కూరగాయలు సరఫరా చేస్తుండడంతో గోదాముల్లో మురిగిపోతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. ఉట్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ సమయంలో వెల్లడైనట్లు వివరించారు. ప్రభుత్వం కొత్త ఏర్పాటు చేయూలనుకుంటున్న ఏకలవ్య పాఠశాలను ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటు చేయూలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల బాలికల మేనేజ్‌మెంట్ ఆశ్రమ పాఠశాలల్లో మహిళా సిబ్బందిని కాకుండా పురుషులను ఎలా నియమించారని ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రశ్నించారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆశ్రమ పాఠశాలల్లో అందించే నాలుగు జతల బట్టలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీడీ స్పందిస్తూ.. ఇప్పటికే 25 శాతం మంది విద్యార్థులకు రెండు జతల బట్టలు అందించాల్సి ఉందని, ఆప్కోకు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేదని వివరించారు. దీంతో మంత్రి రామన్న డీడీపై మండిపడ్డారు. ‘ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు. సమస్య ఇంత జఠిలంగా ఉన్నా.. మా దృష్టికి తీసుకురారా’ అంటూ నిలదీశారు. ప్రతి విద్యార్థి కొలత తీసుకుని బట్టలు కుట్టాలని, లేకుండా ఏజెన్సీలు రద్దు చేయూలని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న మంచినీటి పథకాల్లో 425 వివిధ కారణాలతో పనిచేయడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్ర సేన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్ననీటి పారుదల విభాగం చేపట్టిన పనులు ఇంకా పూర్తి కావడం లేదని మంత్రి రామన్న ఈఈఎంఐ రాజేశ్వర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 644 మంది లబ్ధిదారులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని, వివిధ కారణాలతో నిలిచిపోయూయని సీసీఎఫ్ తిమ్మారెడ్డి వివరించారు. వచ్చే సమావేశంలోగా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మంత్రి రామన్న ఆదేశించారు. అటవీ శాఖ ఆమోదం లేక నిలిచిపోరుున రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపేలా కృషి చేస్తామన్నారు.
 
షార్ట్ సర్క్యూట్‌తో భయందోళన..

భోజన విరామం తర్వాత ప్రారంభమైన కొద్ది సేపటికే సమావేశ మందిరంలో షార్ట్ సర్క్యూట్‌తో ట్యూబ్‌లైట్లు పగిలారుు. నిమిషాల వ్యవధిలో హాలులోని లైట్లు అన్నీ పగిలిపోవడంతో మంత్రులు, సభ్యులు, అధికారులు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు. కరెంట్ కట్ కావడంతో జనరేటర్ వేయడం వల్ల పవర్ హై ఓల్టేజీ సరఫరా అరుు ఇలా జరిగిందని సిబ్బంది చెప్పడంతో అందరూ మళ్లీ చేరుకున్నారు. సభ్యులందరి ఆమోదంతో అన్ని వసతులతో కొత్త భవనాన్ని ఏడాదిలోపు నిర్మించాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement