సాక్షి, చండీగఢ్ : ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక అడుగు ముందుకేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను నిర్ణయించాలంటూ.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పంచాయితీ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసే వారికి విద్యార్హతను నిర్ణియించాలని కోరుతూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.
పంచాయితీరాజ్ ప్రతినిధులకు కనీస విద్యార్హత లేకపోవడం వల్ల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన లేఖలే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment